Best Budget Smartphones
Best Budget Smartphones : మోటోరోలా ఫ్యాన్స్ కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? 2025లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు అద్భుతమైన ఫోన్లు.. రూ. 20వేల కన్నా తక్కువ బడ్జెట్‌లో కొనేసుకోవచ్చు. మీరు కూడా మీ బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ కోసం చూస్తుంటే ఈ ఫోన్లలో ఏదో ఒకటి కొనేసుకోవచ్చు. ఫీచర్లు, పర్ఫార్మెన్స్, సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ పరంగా (Best Budget Smartphones) అనేక ప్రముఖ బ్రాండ్‌లతో పోటీపడుతుంది. రూ. 20వేల లోపు మోటోరోలా నుంచి బడ్జెట్‌కు మించిన ఫీచర్లను అందిస్తోంది.
మోటోరోలా మోటో G85 5G :
మోటో G85 5G పర్ఫార్మెన్స్, డిజైన్ పరంగా అద్భుతంగా ఉంటుంది. బడ్జెట్ ఫోన్‌లలో ఇదో బెస్ట్ ఆప్షన్. అరచేతిలో ఈజీగా సరిపోతుంది. డిస్‌ప్లే కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది. గేమింగ్ స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు అద్భుతమైన వ్యూను అందిస్తుంది. థర్మల్ రెగ్యులేషన్ సపోర్టు కూడా ఉంది. రోజువారీ టాస్కులకు ప్రాసెసర్ చాలా స్పీడ్ ఉంటుంది. మోటోరోలా మోటో G85తో మంచి కెమెరా పర్ఫార్మెన్స్, ధర రేంజ్ మీ బడ్జెట్ ధరలోనే లభిస్తుంది.
మోటోరోలా మోటో G64 5G :
మోటోరోలా మోటో జీ64 5జీ ఫోన్ పవర్ సోర్స్ ఫోన్.. రోజంతా వినియోగించినా ఛార్జింగ్ తగ్గదు. అందులోనూ ఫ్యూర్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉంది. గేమింగ్ లేదా మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు వేగంగా రన్ అవుతుంది. కెమెరా పరంగా చూస్తే క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. సూర్యకాంతిలో కూడా మంచి ఫొటోలను క్యాప్చర్ చేయగలదు. బ్యాటరీ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. మోటోరోలా G64 5G తప్పక కొనాల్సిన ఫోన్.
మోటోరోలా మోటో G54 5G :
మోటో G54 5జీ ఫోన్ బ్యాటరీ లైఫ్, క్వాలిటీ కెమెరా కాన్ఫిగరేషన్ కలిగి ఉంది. ఫుల్ ప్యాకేజీతో స్టూడెంట్స్ కొనాల్సిన ఫోన్ ఇది. ఈ ఫోన్ భారీ యాప్‌లను కూడా ఈజీగా రన్ చేయగలదు. ధర పరంగా పరిశీలిస్తే ఈ మోటో జీ54 5జీ ఫోన్ రూ. 20వేల లోపు ధరలో కొనేసుకోవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 40 నియో :
సాధారణంగా, మోటోరోలా ఎడ్జ్ 40 నియో రూ. 20వేల కన్నా తక్కువ ధరకు వస్తుంది. డిజైన్ పరంగా చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. కర్వడ్ అమోల్డ్ డిస్‌ప్లే అద్భుతంగా ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ పరంగా ఫొటోలు అద్భుతంగా వస్తాయి. ప్రాసెసర్ బాగుంది. భారీ గేమింగ్‌లో కూడా ఎప్పుడూ వేడెక్కదు. అద్భుతమైన పర్ఫార్మెన్స్ కలిగిన మోటోరోలా ఎడ్జ్ 40 నియో కొనేసుకోవచ్చు.