Best Camera Smartphones : ఈ నవంబర్ 2023లో రూ. 25వేల లోపు బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

Best Camera Smartphones : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఈ నవంబర్ 2023లో రూ.25వేల లోపు ధరలో బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని టాప్ ఫోన్‌లలో శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ, ఐక్యూ జెడ్7 ప్రో 5జీ, రియల్‌మి నార్జో 60 ప్రో ఉన్నాయి.

Best Camera Smartphones : ఈ నవంబర్ 2023లో రూ. 25వేల లోపు బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

Best camera smartphones under Rs.25K this November 2023

Updated On : November 24, 2023 / 11:02 PM IST

Best Camera Smartphones : పండుగ సీజన్ ముగిసింది. అయినప్పటికీ అమెజాన్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. మీరు ఇంతకు ముందు డీల్ మిస్ అయితే.. ఇప్పుడు మరో అవకాశం అందిస్తోంది. అద్భుతమైన కెమెరా, వేగవంతమైన ప్రాసెసర్, కనీసం 8జీబీ ర్యామ్ అందించే రూ. 25వేల లోపు ధర కలిగిన స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. ఈ ధర పరిధిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని టాప్ ఫోన్లను మీకోసం అందిస్తున్నాం. అవేంటో ఓసారి పరిశీలిద్దాం.

శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ (8జీబీ ర్యామ్, 128జీబీ రోమ్) :
ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 21,999 ధరకు లభిస్తుంది. ఈ డివైజ్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. శక్తివంతమైన కెమెరా సెటప్‌లో 50ఎంపీ ప్రధాన కెమెరా, 6000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. లాంగ్ టైమ్ పర్ఫార్మెన్స్ కోసం నాలుగు OS అప్‌గ్రేడ్‌లు, ఐదు ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ ద్వారా సపోర్టు ఇస్తుంది. శాంసంగ్ ఎక్సినోస్ 1280 ఆక్టా కోర్ చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది.

Samsung Galaxy M34 5G

Samsung Galaxy M34 5G

Read Also : Best Premium Flagship Phones : ఈ నవంబర్‌లో బెస్ట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోండి!

ఐక్యూ జెడ్7 ప్రో 5జీ (8జీబీ ర్యామ్, 128జీబీ రోమ్) :
ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 23,999కు సొంతం చేసుకోవచ్చు. డైమెన్సిటీ 7200 5జీ ప్రాసెసర్, స్లిమ్ 6.78-అంగుళాల అద్భుతమైన 120హెచ్‌జెడ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 64ఎంపీ ఎయూఆర్ఏ లైట్ ఓఐఎస్ కెమెరాను కలిగి ఉంది. అయితే, 4600ఎంఎహెచ్ బ్యాటరీ 66డబ్ల్యూ ఫ్లాష్‌ఛార్జ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ డివైజ్ 8జీబీ ర్యామ్, ఏజీ మ్యాట్ గ్లాస్ ఎండ్‌తో సొగసైన 7.36ఎమ్ఎమ్ మందాన్ని కలిగి ఉంది.

iQOO Z7 Pro 5G

iQOO Z7 Pro 5G

రియల్‌మి నార్జో 60ప్రో (8జీబీ ర్యామ్, 128జీబీ రోమ్) :
రియల్‌మి నార్జో 60 ప్రో ధర రూ. 23,999కు కొనుగోలు చేయొచ్చు. అత్యాధునిక-ఎడ్జ్ 120° కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఓఎఐఎస్ టెక్నాలజీతో 100ఎంపీ కెమెరాతో వస్తుంది. వినియోగదారులు 12జీబీ + 12జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజీతో మల్టీ టాస్కింగ్‌ను అందిస్తుంది. ప్రీమియం బ్యాక్ డిజైన్ అధునాతన డిజైన్ కలిగి ఉంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

realme narzo 60 Pro

realme narzo 60 Pro

ఇన్ఫినిక్స్ జీరో 30 5జీ (8జీబీ ర్యామ్, 256జీబీ రోమ్) :
ఇన్ఫినిక్స్ జీరో 30 5జీ ధర రూ.23,999కు కొనుగోలు చేయొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8జీబీ ర్యామ్, 256జీబీ రోమ్, 17.22సెం.మీ (6.78 అంగుళాలు) ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, శక్తివంతమైన డైమెన్సిటీ 8020 ప్రాసెసర్, 5000ఎంఎహెచ్ బ్యాటరీ ఉన్నాయి. 108ఎంపీ (ఓఐఎస్)+13ఎంపీ + 2ఎంపీ బ్యాక్ కెమెరా సెటప్, ఆకట్టుకునే ఫోటోగ్రఫీతో 50ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

Infinix Zero 30 5G

Infinix Zero 30 5G

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ (8జీబీ ర్యామ్, 128జీబీ రోమ్) :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ ధర రూ. 24,999 వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వేగవంతమైన 65డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్‌సెట్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. అలాగే, 6.43-అంగుళాల 90హెచ్‌జెడ్ ఎఫ్‌హెచ్‌డీ‌ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఏఐ-ఇన్ఫ్యూజ్డ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది.

OnePlus Nord CE 2 5G

OnePlus Nord CE 2 5G

అదనంగా, 1టీబీ వరకు డ్యూయల్ సిమ్, మైక్రో ఎస్‌డీ సపోర్టుతో సహా ట్రిపుల్ కార్డ్ స్లాట్‌లతో అందిస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ఆక్సిజన్‌ఓఎస్ 11తో రన్ అవుతోంది. ఓటీఏ ద్వారా రెండేళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, మూడు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది.

Read Also : Best Affordable Smartphones : కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.10వేల లోపు ధరలో 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే!