200MP కెమెరాతో స్మార్ట్‌ఫోన్.. Honor 90 5Gపై ఫ్లిప్‌కార్ట్‌లో మెగా ఆఫర్.. ధర సగం తగ్గింది భయ్యా..

ఫ్లాగ్‌షిప్ లెవెల్ కెమెరా, ప్రీమియం కర్వ్డ్ డిస్‌ప్లే, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ ఈ ధరలో దొరకడం చాలా అరుదు.

200MP కెమెరాతో స్మార్ట్‌ఫోన్.. Honor 90 5Gపై ఫ్లిప్‌కార్ట్‌లో మెగా ఆఫర్.. ధర సగం తగ్గింది భయ్యా..

Honor 90 5G Phone

Updated On : June 30, 2025 / 5:01 PM IST

ఒక ఫ్లాగ్‌షిప్ కెమెరా ఫోన్ కొనాలని ఉన్నప్పటికీ అందుకోసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని వెనకడుగు వేస్తున్నారా? ఏకంగా 200MP కెమెరాతో వచ్చిన Honor 90 5G స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ఊహించని డిస్కౌంట్ లభిస్తోంది. దాదాపు సగం ధరకే ఈ ప్రీమియం కెమెరా ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. ఆ ఆఫర్ల వివరాలు, ఫోన్ ఫీచర్లు ఏంటో చూసేయండి..

ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న ఆఫర్ల వివరాలు

  • అసలు ధర: రూ.47,999
  • ఫ్లాట్ 42% డిస్కౌంట్ తర్వాత ధర: కేవలం రూ.27,999
  • బ్యాంక్ ఆఫర్: Flipkart Axis Bank కార్డు వాడితే అదనంగా 5% వరకు డిస్కౌంట్ పొందవచ్చు
  • ఎక్స్‌ఛేంజ్ ఆఫర్: మీ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసి రూ.26,500 వరకు భారీ తగ్గింపును పొందండి (ఆఫర్ మీ పాత ఫోన్ మోడల్, కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది)
  • EMI: నెలకు కేవలం రూ.1,357 చెల్లించే నో-కాస్ట్ EMI ఆప్షన్‌తో ఎలాంటి భారం లేకుండా కొనుగోలు చేయవచ్చు.

Also Read: Vivo బంపర్ ఆఫర్.. 5G ఫోన్ ఇప్పుడు కేవలం రూ.11,999కే.. ఇంతకంటే మంచి డీల్ దొరకదు..

ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

200MP మెయిన్ కెమెరా + 50MP సెల్ఫీ కెమెరా
  • 200MP ప్రైమరీ కెమెరా: ప్రొఫెషనల్ కెమెరాలాంటి స్పష్టత, డీటెయిల్స్‌తో ఫొటోలు తీయొచ్చు. జూమ్ చేసినా క్వాలిటీ తగ్గదు.
  • 50MP సెల్ఫీ కెమెరా: అద్భుతమైన సెల్ఫీలు, గ్రూప్ సెల్ఫీలు, హై-క్వాలిటీ వీడియో కాల్స్ కోసం ఇది బెస్ట్.

కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే

  • 6.7-అంగుళాల కర్వ్డ్ OLED స్క్రీన్ ఈ ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.
  • 1.5K రెజల్యూషన్: వీడియోలు, ఫోటోలు ఎంతో స్పష్టంగా, సహజమైన రంగులతో కనిపిస్తాయి.
  • 120Hz రిఫ్రెష్ రేట్: స్క్రోలింగ్, గేమింగ్ కు అద్భుతంగా ఉంటుంది.
పర్ఫార్మెన్స్, బ్యాటరీ.. 
  • ప్రాసెసర్: Qualcomm Snapdragon 7 Gen 1 చిప్‌సెట్‌తో రోజువారీ పనులు, గేమింగ్ స్మూత్‌గా ఉంటాయి.
  • బ్యాటరీ: 5000mAh భారీ బ్యాటరీ రోజంతా సులభంగా ఛార్జింగ్ ఉంటుంది.
  • ఫాస్ట్ చార్జింగ్: 66W సూపర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో నిమిషాల్లో ఫోన్ చార్జ్ అవుతుంది.

ఈ డీల్ మిస్ చేసుకోవచ్చా?
మీరు రూ.30,000 లోపు బడ్జెట్‌లో ఒక ఆల్-రౌండర్ ఫోన్ కోసం చూస్తుంటే, Honor 90 5G ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అత్యుత్తమ డీల్స్‌లో ఒకటి. ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్ లెవెల్ కెమెరా, ప్రీమియం కర్వ్డ్ డిస్‌ప్లే, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఈ ధరలో దొరకడం చాలా అరుదు.