Best Laptops 2023 : 5 best laptops under Rs 80,000 in April 2023
Best Laptops 2023 : ఏప్రిల్ 2023లో రూ. 80వేల లోపు బెస్ట్ ల్యాప్‌టాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రేంజ్‌లో సెమీ-ప్రొఫెషనల్ గేమర్‌లకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. మీ బడ్జెట్ పెరిగేకొద్దీ.. మల్టీ టాస్కింగ్‌లో 16GB RAMతో అనేక ఫీచర్లు కలిగిన ల్యాప్‌టాప్స్ ఎంచుకోవచ్చు. అయితే, మీరు ఇప్పటికీ ఈ రేంజ్‌లో మ్యాక్‌బుక్‌ని పొందలేరు. అయితే, M1-పవర్‌తో పనిచేసే మ్యాక్‌బుక్ ఎయిర్ బ్యాంక్ ఆఫర్‌లతో సుమారు రూ. 81వేలకి అందుబాటులో ఉంటుంది. ఈ లిస్టులో విండోస్ ఆధారిత ల్యాప్‌టాప్‌లు మాత్రమే కాదు.. రూ.80వేల లోపు 5 బెస్ట్ ల్యాప్‌టాప్‌లను అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన బ్రాండ్ మోడల్ ఎంచుకోవచ్చు.
HP పెవిలియన్ x360 2-in-1 :
మీరు ట్రేడేషన్ ల్యాప్‌టాప్‌లతో విసిగిపోయి ఉన్నారా? HP పెవిలియన్ x360 2-in-1 రోజ్ గోల్డ్ ఆప్షన్ చాలా బాగుంటుంది. డిస్‌ప్లేను పూర్తిగా 360 డిగ్రీలు టర్న్ చేయొచ్చు. ల్యాప్‌టాప్‌ను టాబ్లెట్ మాదిరిగా కూడా ఉపయోగించవచ్చు. ల్యాప్‌టాప్ కేవలం 1.5 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. ప్రయాణాల్లోనూ ఈ ల్యాప్‌టాప్ సౌకర్యవంతంగా ఉంటుంది.
Best Laptops 2023 _ 5 best laptops under Rs 80,000 in April 2023
HP పెవిలియన్ x360 2-in-1 ఇతర ముఖ్య ఫీచర్లలో 12వ-జనరల్ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్, 16GB DDR4 RAM, 512GB SSD, 14-అంగుళాల Full-HD డిస్‌ప్లే ఉన్నాయి. అధికారిక HP స్టోర్ నుంచి కొనుగోలు చేస్తే.. కంపెనీ రూ. 2,499 విలువైన బ్యాగ్‌ను అందిస్తోంది. మొత్తంమీద, సాధారణ ఆఫీసులకు వెళ్లేవారికి విలువైన ల్యాప్‌టాప్ అని చెప్పవచ్చు. HP ఇండియా (HP India) ఇ-స్టోర్‌లో ధర రూ. 78,999లకు అందుబాటులో ఉంది.
ఆసుస్ వివోబుక్ S15 OLED :
మీరు మంచి డిస్‌ప్లే ల్యాప్‌టాప్ కోసం చూస్తుంటే.. (Vivobook S15) OLED బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. 15.6-అంగుళాల OLED డిస్‌ప్లేతో వచ్చిన ఏకైక ల్యాప్‌టాప్ ఇది. ఈ డిస్ప్లే ప్యానెల్ లోతైన బ్లాక్ వంటి ఆకర్షణీయమైన కలర్లను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 512GB SSD, 8GB DDR4 ర్యామ్ ఉన్నాయి. అదృష్టవశాత్తూ.. అదే 12వ-జెన్ ఇంటెల్ కోర్ i5 CPUని పొందవచ్చు. Asus ఇండియా ఇ-స్టోర్‌లో ధర ల్యాప్‌టాప్ రూ. 74,990గా ఉంది.
Best Laptops 2023 _ 5 best laptops under Rs 80,000 in April 2023
MSI గేమింగ్ స్వోర్డ్ 15 :
కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ (MSI) గేమింగ్ స్వోర్డ్ 15 అనేది అత్యంత సరసమైన గేమింగ్ ల్యాప్‌టాప్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. ట్రేడేషనల్ బ్లాక్ గేమింగ్ ల్యాప్‌టాప్‌ల మాదిరిగా కాకుండా MSI గేమింగ్ స్వోర్డ్ 15 వంటి డ్యూయల్ బ్లాక్ అండ్ వైట్ ఫినిషింగ్‌తో వచ్చింది. 2.6 కిలోల బరువు ఉన్న ఈ భారీ ల్యాప్‌టాప్.. ఇతర ఫీచర్లలో 144Hz ఫుల్-HD డిస్‌ప్లే, 16GB, 1TB NVMe SSD, Nvidia RTX 3050 GPU, 16GB RAM ఉన్నాయి. అమెజాన్ (Amazon)లో ధర రూ. 80వేల నుంచి ఉంటుంది.
Best Laptops 2023 _ 5 best laptops under Rs 80,000 in April 2023
Lenovo యోగా స్లిమ్ 7i Pro :
మీ ల్యాప్‌టాప్ తేలికగా ఉండాలంటే.. యోగా స్లిమ్ 7i ప్రో బెస్ట్ ఆప్షన్. 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5 CPUని కలిగి ఉంది. అన్నిరకాల పనులకు బాగా ఉపయోగపడుతుంది. ఈ ల్యాప్‌టాప్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 14-అంగుళాల 2.8k డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. ఇతర ఫీచర్లలో 16GB LPDDR4X RAM, 512GB స్టోరేజీతో పాటు డాల్బీ అట్మోస్ట్-సపోర్టెడ్ హర్మాన్ స్పీకర్లు ఉన్నాయి. (Lenovo) ఇండియా ఇ-స్టోర్‌లో దీని ధర రూ. 74,990గా ఉంది.
Best Laptops 2023 _ 5 best laptops under Rs 80,000 in April 2023
షావోమీ నోట్‌బుక్ ప్రో 120G :
మీరు ఏదైనా మ్యాక్‌బుక్ కొంటున్నారా? ఇలాంటి డిజైన్‌తో ల్యాప్‌టాప్ కావాలంటే.. (Xiaomi) నోట్‌బుక్ ప్రో 120G బెస్ట్ ఆప్షన్. ఈ ల్యాప్‌టాప్ మెటల్ బాడీని కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 14-అంగుళాల 2.5K డిస్‌ప్లేను కలిగి ఉంది. షావోమీ ల్యాప్‌టాప్ 12వ జెన్ ఇంటెల్ కోర్ i5 CPU, GeForce MX550 GPU, 16GB LPDDR5 RAM, 512GB PCIe Gen 4.0 హై-స్పీడ్ స్టోరేజ్ కలిగి ఉంది.
Best Laptops 2023 _ 5 best laptops under Rs 80,000 in April 2023
రోజువారీ పనులను సులభంగా నిర్వహించగలదు. అదనంగా, మీరు ఇప్పటికే Xiaomi/ Redmi వాడుతుంటే.. ఈ ల్యాప్‌టాప్ మరింత ఉపయోగకరంగా ఉండవచ్చు. అమెజాన్‌లో ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 67,999గా ఉంటుంది.