Best Mobile Phones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. ఈ ఏప్రిల్‌లో రూ.15వేల లోపు ధరలో టాప్ 5G స్మార్ట్‌ఫోన్లు మీకోసం..!

Best Mobile Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఈ ఏప్రిల్‌లో రూ. 15వేల లోపు ధరలో అద్భుతమైన ఫీచర్లతో టాప్ 5G ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొని ఇంటికి తెచ్చుకోండి.

Best Smart Phones

Best Mobile Phones April 2025 : కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? అత్యంత సరసమైన ధరలో అద్భుతమైన ఫీచర్లు కలిగిన అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అందులోనూ మీరు 5G స్మార్ట్ ఫోన్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. ఈ ఏప్రిల్‌లో భారత మార్కెట్లో రూ. 15వేల లోపు ధరకే కొన్ని అద్భుతమైన ఆప్షన్లతో స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ ఫోన్లలో పర్ఫార్మెన్స్, మంచి కెమెరాలతో పాటు లాంగ్ టైమ్ బ్యాటరీ లైఫ్‌తో వస్తాయి. మీకు గేమింగ్, సోషల్ మీడియా లేదా రోజువారీ వినియోగానికి ఫోన్ కావాలంటే ఈ ఫోన్లలో ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు.

Read Also : Samsung Galaxy Z Flip 6 : బంపర్ ఆఫర్.. భారీగా తగ్గిన శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్.. ఇలా చేస్తే ఇంకా తక్కువకే వస్తుంది..!

ప్రస్తుతం భారత మార్కెట్లో మీరు రూ. 15వేల లోపు ధరకు కొనుగోలు చేయగల టాప్ 5G స్మార్ట్‌ఫోన్‌లను మీకోసం అందిస్తున్నాం. ఈ జాబితాలో రియల్‌మి P3x 5G, పోకో M7 ప్రో 5G, పోకో M7 ప్రో 5G, CMF ఫోన్ 1, రెడ్‌మి 13 5G ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

రియల్‌మి P3x 5G :
రియల్‌మి P3x 5G ఫోన్ స్టైలిష్ డిజైన్ మాత్రమే కాదు.. ఈ స్మార్ట్‌ఫోన్‌ గ్రేట్ బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్ కూడా. రూ. 13,999 ధరకు స్టెల్లార్ పింక్, మిడ్‌నైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అలాగే,
ఈ 5G ఫోన్ వీగన్ లెదర్‌తో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. లూనార్ సిల్వర్ వెర్షన్ టెక్స్చర్డ్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది.

120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల FHD+ డిస్‌ప్లే, పవర్ ఫుల్‌వ్యూ అందిస్తుంది. వీడియోలు, గేమ్‌లు ఆడేందుకు బెస్ట్ ఫోన్. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. బ్రౌజింగ్, స్ట్రీమింగ్, మల్టీ టాస్కింగ్ వంటి రోజువారీ పనులకు సరిగ్గా సరిపోతుంది.

50MP డ్యూయల్-కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంది. ఆకర్షణీయమైన ఫొటోలను తీయొచ్చు. 6,000mAh బ్యాటరీతో ఒక రోజు పాటు ఛార్జింగ్ ఉంటుంది. రఫ్ అండ్ టఫ్ వాడే వినియోగదారులకు ఈ రియల్‌మి 5G ఫోన్ అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.

పోకో M7 ప్రో 5G :
అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఫోన్‌ కోరుకునే వినియోగదారులకు పోకో M7 ప్రో 5G బెస్ట్ ఆప్షన్. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆకర్షణీయమైన విజువల్స్‌ను అందిస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7025 అల్ట్రా, 8GB ర్యామ్ వరకు అందిస్తుంది. ఈ 5G ఫోన్ మల్టీ టాస్కింగ్, క్యాజువల్ గేమింగ్‌ కోసం బెస్ట్ అని చెప్పవచ్చు.

50MP మెయిన్ కెమెరా మంచి ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది. అయితే 20MP ఫ్రంట్ కెమెరా క్లారిటీతో సెల్ఫీలను తీసుకోవచ్చు. వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. 5,110mAh బ్యాటరీతో ఫోన్ ఛార్జింగ్ రోజుంతా వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఫుల్ ఛార్జ్ కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పనిలేదు. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హైపర్ఓఎస్‌లో రన్ అవుతుంది.

CMF ఫోన్ 1 :
నథింగ్ సబ్ మోడల్ CMF ఫోన్ 1 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు దీటుగా వచ్చింది. ఇందులో బ్యాక్ కవర్లు మార్చుకోవచ్చు. మీకు కావలసినప్పుడు CMF ఫోన్ మీకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ద్వారా పవర్ పొందుతుంది. రోజువారీ పనులు, బ్రౌజింగ్, సాధారణ గేమింగ్ కోసం అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

6.67-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. కలర్‌ఫుల్ ఆప్షన్లను కూడా కలిగి ఉంది. 50MP మెయిన్ కెమెరా మంచి లైటింగ్ కండిషన్లలో కూడా బాగా పనిచేస్తుంది. అయితే, ఈ రేంజ్‌లో ఇతర ఫోన్‌ల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటుంది. 5,000mAh బ్యాటరీతో రోజంతా ఛార్జింగ్ వస్తుంది. నథింగ్ OS3.0 ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఈ CMF ఫోన్ 1 రన్ అవుతుంది.

రెడ్‌మి 13 5G :
రెడ్‌మి 13 5G ఫోన్ రెడ్‌మి 12 5G అప్‌గ్రేడ్ వెర్షన్. ఇందులో కొన్ని ముఖ్యమైన అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. 120Hz ఎల్‌సీడీ డిస్‌ప్లే స్క్రోలింగ్, గేమింగ్‌ స్పీడ్ ఉంటుంది. అతిపెద్ద అప్‌గ్రేడ్ 108MP ప్రైమరీ కెమెరా. మంచి లైటింగ్‌లో అద్భుతమైన ఫోటోలను తీయొచ్చు. 5,000mAh బ్యాటరీ ఉంది. కానీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది.

Read Also : iPhone Prices : ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ ధరలు ఇప్పట్లో పెరగవు.. ఎందుకో తెలిస్తే ఆశ్యర్యపోతారు!

షావోమీ బాక్స్‌లో ఛార్జర్‌ను కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హైపర్ఓఎస్ (HyperOS)లో రన్ అయ్యే యూజర్ ఇంటర్‌ఫేస్ ఇప్పుడు గత వెర్షన్‌ల కన్నా వేగంగా మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే క్వాలిటీ, కెమెరా ఫీచర్లతో రెడ్‌మి 13 5జీ ఫోన్ అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.