Samsung Galaxy Z Flip 6 : బంపర్ ఆఫర్.. భారీగా తగ్గిన శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్.. ఇలా చేస్తే ఇంకా తక్కువకే వస్తుంది..!
Samsung Galaxy Z Flip 6 : కొత్త శాంసంగ్ మడతబెట్టే ఫోన్ కావాలా? అమెజాన్‌లో భారీ తగ్గింపు ధరకే శాంసంగ్ గెలాక్సీ Z Flip 6 5G ఫోన్ అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy Z Flip 6
Samsung Galaxy Z Flip 6 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ మడతబెట్టే ఫోన్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ప్రీమియం బిల్డ్ ఫీచర్లతో కొత్త ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. ప్రస్తుతం అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ Z Flip 6 5G ఫోన్ రూ.26,519 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.
ధర తగ్గింపుతో పాటు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. సాధారణంగా ఈ 5G ఫోల్డబుల్ ఫోన్ రూ.1,09,999 ధర ఉంటుంది. కొనుగోలుదారులు డ్యూయల్ అమోల్డ్ ప్యానెల్, స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా సెటప్, పవర్‌ఫుల్ బ్యాటరీ, ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లను పొందవచ్చు. కొత్త ఫోన్ కోసం చూస్తుంటే ఫ్లిప్-స్టైల్ ఫోన్ కొనేసుకోండి. అమెజాన్‌లో ఈ శాంసంగ్ మడతబెట్టే ఫోన్ డీల్ ఎలా పొందాలో వివరంగా తెలుసుకుందాం.
శాంసంగ్ గెలాక్సీ Z Flip 6 ధర ఎంతంటే? :
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 ఫోన్ ప్రస్తుతం రూ.84,980 ధరకు అందుబాటులో ఉంది. ఈ మడతబెట్టే 5G ఫోన్ ధర రూ.25,019 తగ్గింపు పొందింది. HDFC, Federal, BOB లేదా ఇతర బ్యాంక్ కార్డులతో అదనంగా రూ.1,500 తగ్గింపును పొందవచ్చు. దాంతో ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.83,500 కన్నా తక్కువకు వస్తుంది.
అదనంగా, కస్టమర్లు తమ పాత ఫోన్లతో ఎక్స్ఛేంజ్ చేసుకుంటే మోడళ్లను బట్టి రూ.22,800 వరకు డబ్బు ఆదా చేయొచ్చు. కస్టమర్లు నెలకు రూ.4,120 నుంచి EMI ఆప్షన్లు కూడా ఎంచుకోవచ్చు. నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ డీల్ 12GB + 256GB వేరియంట్ మాత్రమేనని గమనించాలి. యాడ్-ఆన్‌లలో భాగంగా, కస్టమర్‌లు ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్లాన్, స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా పొందవచ్చు.
గెలాక్సీ Z Flip 6 స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 5G ఫోన్ 6.7-అంగుళాల FHD+ డైనమిక్ అమోల్డ్ 2X మెయిన్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. అలాగే 60Hz వద్ద రన్ అయ్యే 3.4-అంగుళాల సూపర్ అమోల్డ్ కవర్ స్క్రీన్‌తో వస్తుంది. గెలాక్సీ ప్రాసెసర్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 Gen 3తో అమర్చి ఉంది. 12GB వరకు ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఈ గెలాక్సీ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా వన్ UI 6.1.1పై రన్ అవుతుంది.
Read Also : iPhone 16 Pro Max : వావ్.. ఈ ఐఫోన్‌పై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఇంత తక్కువ ధరకు మళ్లీ జన్మలో రాదు..!
25W వైర్డు, స్పీడ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,000mAh బ్యాటరీ కలిగి ఉంది. కెమెరాల విషయానికొస్తే.. 50MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రావైడ్ లెన్స్‌తో డ్యూయల్ రియర్ సెటప్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 10MP సెల్ఫీ కెమెరా ఉంది. ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ నైట్‌గ్రఫీ, వీడియో HDR వంటి ఫీచర్లను కలిగి ఉంది. IP48 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కూడా అందిస్తుంది.