Samsung Galaxy M16 5G : ఈ శాంసంగ్ AI స్మార్ట్‌ఫోన్‌పై కళ్లుచెదిరే ఆఫర్.. కేవలం రూ.630 ఈజీ EMIతో ఇంటికి తెచ్చుకోవచ్చు!

Samsung Galaxy M16 5G : శాంసంగ్ కొత్త ఏఐ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. మీరు ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 630 ఈజీ ఈఎంఐతో ఇంటికి తీసుకురావచ్చు.

Samsung Galaxy M16 5G : ఈ శాంసంగ్ AI స్మార్ట్‌ఫోన్‌పై కళ్లుచెదిరే ఆఫర్.. కేవలం రూ.630 ఈజీ EMIతో ఇంటికి తెచ్చుకోవచ్చు!

Samsung Galaxy M16 5G

Updated On : April 4, 2025 / 5:56 PM IST

Samsung Galaxy M16 5G : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి కొత్త శాంసంగ్ గెలాక్సీ M16 5G ఫోన్ ధర భారీగా తగ్గింది. AI ఫీచర్లతో వచ్చిన ఈ శాంసంగ్ బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్‌‌లో కేవలం రూ. 630 ప్రారంభ EMIతో కొనుగోలు చేయవచ్చు.

కొన్ని నెలల క్రితమే లాంచ్ అయిన శాంసంగ్ 5జీ ఫోన్ ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో అనేక ఆకర్షణీయమైన ఆఫర్‌లతో అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ M16 5G ఫోన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో ఆకట్టుకునే స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది.

Read Also : Lamborghini Temerario : లగ్జరీ లంబోర్గిని సూపర్ కారు వస్తోంది.. ఈ నెల 30నే లాంచ్.. కేవలం 2.7 సెకన్లలో 100 కి.మీ హైస్పీడ్..!

శాంసంగ్ గెలాక్సీ M16 5G డిస్కౌంట్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 3 వేర్వేరు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. 6GB ర్యామ్ + 128GB, 8GB ర్యామ్ + 128GB, 4GB ర్యామ్ + 128GB, 6GB ర్యామ్ వేరియంట్ ధర రూ. 12,998 కాగా, టాప్-ఎండ్ మోడల్ రూ. 14,498కు అందుబాటులో ఉంది.

ప్రస్తుతం, ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ అందుబాటులో లేదు. ఈ శాంసంగ్ ఫోన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా రూ. 630 ప్రారంభ EMIతో ఇంటికి కొనేసుకోవచ్చు. అదనంగా, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌తో కొనుగోలుదారులు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా పొందొచ్చు. ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్, రోజ్ అనే 3 స్టైలిష్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ M16 5G స్పెసిఫికేషన్లు :
ఈ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫుల్ హెచ్‌డీ (FHD+) రిజల్యూషన్‌తో పాటు 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. కేవలం 7.9mm మందంతో, గెలాక్సీ M16 5G రిఫ్రెష్ కెమెరా డిజైన్‌ను సూచిస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.

Read Also : Oppo Find X8 Series : ఒప్పో ఫ్యాన్స్‌కు పండగే.. పిచ్చెక్కించే ఫీచర్లతో ఒప్పో Find X8 సిరీస్ వచ్చేస్తోందోచ్.. ప్రీ-బుకింగ్స్ ఓపెన్..!

8GB వరకు ర్యామ్, 128GB స్టోరేజీకి సపోర్టు ఇస్తుంది. 5,000mAh బ్యాటరీతో అమర్చిన ఈ ఫోన్ 25W వద్ద USB టైప్-C ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా శాంసంగ్ OneUI 7పై పనిచేస్తుంది. బ్యాక్ సైడ్ OISతో 50MP మెయిన్ కెమెరా, 5MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.