iPhone 16 Pro Max : వావ్.. ఈ ఐఫోన్‌పై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఇంత తక్కువ ధరకు మళ్లీ జన్మలో రాదు..!
iPhone 16 Pro Max : కొత్త ఆపిల్ ఐఫోన్ కావాలా? ఐఫోన్ 16ప్రో మ్యాక్స్‌పై అద్భుతమైన డిస్కౌంట్.. తక్కువ ధరకే ఐఫోన్ పొందాలంటే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.

iPhone 16 Pro Max
iPhone 16 Pro Max : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 16 ప్రో మాక్స్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. విజయ్ సేల్స్ ఆపిల్ హై-ఎండ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై రూ. 15,500 కన్నా ఎక్కువ భారీ తగ్గింపును అందిస్తోంది. అత్యంత ఆకర్షణీయమైన డీల్‌లలో ఇదొకటిగా చెప్పవచ్చు.
ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కోరుకునే వారు ఐఫోన్ 16 ప్రో మాక్స్ డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ప్రస్తుతం అధికారిక విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆపిల్ ప్రొడక్టులపై డిస్కౌంట్లు చాలా అరుదు. సాధారణంగా ఎక్కువ కాలం ఈ ఆఫర్లు అందుబాటులో ఉండవు. మీరు కొత్త ఐఫోన్ లేదా అప్‌గ్రేడ్ చేయాలని చూస్తుంటే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ డీల్ :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ రూ.1,44,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రూ.1,33,700 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లతో మీరు డబ్బులు మరింత ఆదా చేసుకోవచ్చు.
ICICI బ్యాంక్, AXIS బ్యాంక్, KOTAK బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు అదనంగా రూ. 3వేలు తగ్గింపు పొందవచ్చు. అలాగే, HDFC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో EMI ఆప్షన్ ఎంచుకునే వినియోగదారులు రూ. 4,500 డిస్కౌంట్ పొందవచ్చు.
ఐఫోన్ 16 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.9-అంగుళాల సూపర్ రెటినా (XDR) ఓఎల్ఈడీ డిస్‌ప్లేను 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందిస్తుంది. ఈ ప్రీమియం హ్యాండ్‌సెట్ టైటానియం డిజైన్, అప్‌గ్రేడ్ సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లో 48MP ప్రైమరీ షూటర్, 48MP అల్ట్రావైడ్ సెన్సార్, 5x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 12MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. హుడ్ కింద, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 3nm A18 Pro చిప్‌సెట్‌తో అమర్చి ఉంది. అలాగే, ఐఫోన్ Genmoji, ఇమేజ్ ప్లేగ్రౌండ్, (Siri)తో ChatGPT సపోర్ట్ సహా అన్ని ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్టు ఇస్తుంది.