సిగ్నల్ లేకపోయినా మీ ఫోన్ పనిచేస్తుందా? ఈ కొత్త టెక్నాలజీ గురించి మీకు తెలియాల్సిందే.. ఈ 4 స్మార్ట్‌ఫోన్లు కేక..
మొబైల్ ప్రపంచంలో ఇది ఒక పెద్ద విప్లవం వంటిదే..

సిగ్నల్ లేని చోట ఇరుక్కుపోయారా? ఫోన్‌లో చార్జింగ్ ఉన్నా ఎవరికీ కాల్ చేయలేని పరిస్థితి ఎప్పుడైనా ఎదురైందా? అలాంటి భయాలకు ఇక కాలం చెల్లుతోంది. ఇప్పుడు వస్తున్న కొత్త టెక్నాలజీ “శాటిలైట్ కమ్యూనికేషన్”. దీనివల్ల మీరు అడవిలో ఉన్నా, కొండల మీద ఉన్నా, సముద్రం మధ్యలో ఉన్నా… ఫోన్ చేయొచ్చు. ఈ టెక్నాలజీ మనందరి ఫోన్లలోకి రాబోతోంది. ఇప్పటికే పలు స్మార్ట్‌ఫోన్లలోకి వచ్చేసింది.
అందరికీ దారి చూపిన Apple iPhone 15 Pro
ఈ టెక్నాలజీని అందరికీ పరిచయం చేసిన ఘనత ఆపిల్‌కే దక్కుతుంది. iPhone 15 Pro సిరీస్‌లో “SOS శాటిలైట్” ఫీచర్‌ను తీసుకొచ్చింది. అంటే, సెల్యులర్ నెట్‌వర్క్ లేని చోట కూడా అత్యవసర సేవలకు నేరుగా శాటిలైట్ ద్వారా కాల్ చేసి సాయం పొందవచ్చు. ట్రెక్కర్లు, సాహస యాత్రికులకు ఇది ఒక వరం లాంటిది.
ఒక అడుగు ముందుకేసిన Samsung Galaxy S24 Ultra
ఆపిల్ దారిలో, శాంసంగ్ ఒక అడుగు ముందుకేసింది. Galaxy S24 Ultra ఫోన్‌లో కేవలం సాయం కావాలంటూ మెసేజ్ పంపడమే కాదు. అవతలి వైపు నుంచి సమాధానం కూడా పొందవచ్చు (Two-way messaging). దీనివల్ల మీరు క్షేమంగా ఉన్నారని మీ కుటుంబ సభ్యులకు తెలియజేయడం ఇంకా సులువవుతుంది.
Also Read: రూ.854 కోట్ల ప్యాకేజ్ ఆఫర్.. ట్రపిట్ బన్సాల్ ఎవరు? కుంభస్థలాన్నే కొట్టాడుగా..
Huawei Mate 60 Pro+: ఇది మామూలు ఫోన్ కాదు
హువావే ఈ టెక్నాలజీలో ఇంకా పవర్‌ఫుల్ ఫీచర్స్‌తో వచ్చింది. ఈ ఫోన్ ద్వారా కేవలం ఎమర్జెన్సీ మెసేజ్‌లే కాదు, నెట్‌వర్క్ లేకపోయినా మామూలు ఫోన్ కాల్స్, మెసేజ్‌ల లాగే మాట్లాడుకోవచ్చు. ఇది చైనా టియాంటాంగ్ (Tiantong) శాటిలైట్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. సైనికులు, రెస్క్యూ టీమ్‌లకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
Motorola Defy 2: సాహసాలు చేసే వారికోసం
సాహసాలు చేసే వారికోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ ఫోన్‌లో “Bullitt Satellite Messenger” అనే ఫీచర్ ఉంది. దీని ద్వారా టెక్స్ట్ మెసేజ్‌లు పంపడం, మీ లొకేషన్‌ను షేర్ చేయడం, SOS అలర్ట్‌లు పంపడం చాలా సులభం. ఎంతటి ప్రతికూల వాతావరణ ప్రదేశంలో ఉన్నా ఈ ఫోన్ నుంచి కాల్ చేయొచ్చు.
ఇది ఓ విప్లవమే..
మొబైల్ ప్రపంచంలో శాటిలైట్ కమ్యూనికేషన్ ఒక పెద్ద విప్లవం. ఇకపై ‘నో సిగ్నల్’ అనే ఆందోళన అవసరం లేదు. ఇది కేవలం ఒక టెక్నాలజీ మాత్రమే కాదు, మన ప్రాణాలను కాపాడే ఫ్రెండ్ వంటిది. భవిష్యత్తులో అన్ని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు ఈ టెక్నాలజీని తీసుకురావడం ఖాయం.