Boult Smartwatches : ఇండియాకు 2 బౌల్ట్ స్మార్ట్‌వాచ్‌లు.. ధర తక్కువ.. హెల్త్ ఫీచర్లు ఎక్కువ..!

ఆడియో కంపెనీ బౌల్ట్ వేరబుల్స్ సిగ్మెంట్లోకి ప్రవేశించింది. బడ్జెట్ ఆడియో సిగ్మెంట్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బౌల్ట్ డ్రిఫ్ట్ కాస్మిక్ స్మార్ట్‌వాచ్ పేరుతో రెండు స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్లోకి లాంచ్ చేసింది.

Boult Smartwatches : ఆడియో కంపెనీ బౌల్ట్ వేరబుల్స్ సిగ్మెంట్లోకి ప్రవేశించింది. బడ్జెట్ ఆడియో సిగ్మెంట్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బౌల్ట్ డ్రిఫ్ట్ కాస్మిక్ స్మార్ట్‌వాచ్ పేరుతో రెండు స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్లోకి లాంచ్ చేసింది. అయితే స్మార్ట్‌వాచ్‌లు సరసమైన ధరతో భారత మార్కెట్లోకి వచ్చాయి. ఈ రెండు స్మార్ట్ వాచ్‌లో అనేక ఆరోగ్య ఫీచర్లు, యాక్టివిటీ ట్రాకర్‌లు ఉన్నాయి. బౌల్ట్ డ్రిఫ్ట్, కాస్మిక్ కూడా సాలీడ్ బ్యాటరీ లైఫ్ తో వచ్చాయి. కొత్త లాంచ్‌ల గురించి బౌల్ట్ ఆడియో సహ వ్యవస్థాపకుడు & CEO వరుణ్ గుప్తా మాట్లాడుతూ.. భారత మార్కెట్లో 5 ఏళ్లుగా హై క్లాస్ ఆడియో ప్రొడక్టులను అందిస్తోంది.

బౌల్ట్ ఆడియో స్మార్ట్‌వాచ్ సిగ్మెంట్లో తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను తీసుకొచ్చింది. తొలి స్మార్ట్‌వాచ్‌ రేంజ్‌లో బౌల్ట్ డ్రిఫ్ట్ 3 జూలై 2022న లాంచ్ చేసింది. బౌల్ట్ కాస్మిక్ 9 జూలై 2022 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ రెండు స్మార్ట్ వాచ్‌లు కేవలం 10 నిమిషాల కన్నా తక్కువ సమయంలోనే అమ్ముడుపోయాయి. బౌల్ట్ ఆడియో ఎల్లప్పుడూ మిలీనియల్స్ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేలా పర్యావరణ వ్యవస్థకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు. రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లను లాంచ్ సందర్భంగా రోజువారీ జీవితంలో వేరబుల్ టెక్నాలజీని అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.

బౌల్ట్ డ్రిఫ్ట్, బౌల్ట్ కాస్మిక్ : ధర ఎంతంటే? :
బౌల్ట్ డ్రిఫ్ట్ స్మార్ట్‌వాచ్, బౌల్ట్ కాస్మిక్ ధర రూ. 1999, రూ. 1499గా వచ్చాయి. స్మార్ట్‌వాచ్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి. బౌల్ట్ డ్రిఫ్ట్ బ్లూ, బ్లాక్ గ్రే వంటి ఆకర్షణీయమైన కలర్లలో అందుబాటులో ఉన్నాయి. బౌల్ట్ కాస్మిక్ రోజ్ గోల్డ్, బ్లూ, బ్లాక్ షేడ్స్‌లో లభిస్తుంది.

Boult Launches Two Smartwatches In India, Price Starts At Rs 1,499

బౌల్ట్ డ్రిఫ్ట్, బౌల్ట్ కాస్మిక్.. స్పెసిఫికేషన్స్ :
బౌల్ట్ డ్రిఫ్ట్ స్మార్ట్‌వాచ్ 240×280 పిక్సెల్‌ల రెజల్యూషన్‌తో 1.69-అంగుళాల TFTని కలిగి ఉంది. వాచ్ 218ppi పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది. 500 నిట్‌ల గరిష్టంగా అందిస్తుంది. వాచ్‌లో 60 ప్రీసెట్ స్పోర్ట్స్ మోడ్‌లు, 150+ వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకర్ 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్‌ను కలిగి ఉంది. హృదయ స్పందన రేటును ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. మీ నిద్ర నాణ్యత (డీప్ స్లీప్, తేలికపాటి నిద్ర మేల్కొనే సమయం) ఆటోమేటిక్ స్లీప్ మానిటర్‌ను కలిగి ఉంది, మీ ఆరోగ్యంపై మంచి అవగాహన పొందవచ్చు. మీ జీవనశైలిలో మార్పులు చేసుకునేలా సాయపడుతుంది. మాడ్యూల్ ఇంటర్నల్ మైక్రోఫోన్ స్పీకర్ కూడా ఉంది. మీ ఇన్‌కమింగ్ కాల్‌లకు ఆన్సర్ ఇచ్చేందుకు కావలసిన కాంటాక్ట్ ద్వారా డయల్ చేసేందుకు అనుమతిస్తుంది.

బౌల్ట్ కాస్మిక్ 1.69-అంగుళాల TFT డిస్‌ప్లేను 240×280 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 218ppi పిక్సెల్ డెన్సిటీ, 500 నిట్స్ హై బ్రైట్‌నెస్ డిస్‌ప్లే 100+ వాచ్ ఫేస్‌లను కలిగి ఉంది. బ్లడ్ ప్రెజర్ మానిటర్, బ్లడ్ శాచురేషన్ ట్రాకర్, హార్ట్ రేట్ మానిటర్, మెన్స్ట్రువల్ సైకిల్ మానిటర్, వాటర్ రెసిస్టెన్స్, మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది. హార్ట్ రేట్ మానిటరింగ్, కేలరీల కౌంటింగ్, అధునాతన HR సెన్సార్‌లను కలిగి ఉంది. మీకు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎప్పటికప్పుడూ గమనిస్తూ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది.

Read Also : Microsoft Surface Laptop Go 2 : మల్టీ స్టోరేజ్ మోడల్స్‌తో మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్ గో 2.. ఇండియాలో ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు