BSNL Superhit Plan : BSNL బ్యాంగ్ ప్లాన్.. 1TB వరకు హైస్సీడ్ డేటా..!
ప్రముఖ దేశీయ ప్రభుత్వరంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సూపర్ హిట్ ప్లాన్ ప్రవేశపెట్టింది. రూ. 499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ని క్రమబద్ధీకరించింది.
Bsnl Superhit Plan! Bsnl Launched A Bang Plan, Now Get More Data With Faster Speed
BSNL Superhit Plan : ప్రముఖ దేశీయ ప్రభుత్వరంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సూపర్ హిట్ ప్లాన్ ప్రవేశపెట్టింది. రూ. 499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ని క్రమబద్ధీకరించింది. ఈ ప్లాన్‌లో 1TB వరకు హై-స్పీడ్ డేటా 50 Mbps స్పీడ్ అందిస్తోంది. ప్లాన్ గడువు తేదీ ముగిసిన తర్వాత నెల మొత్తానికి ఇంటర్నెట్ స్పీడ్ 2 Mbps తగ్గిపోతుంది. ఫెయిర్-యూజ్-పాలసీ (FUP) డేటా వినియోగం తర్వాత 1TB, ఇంటర్నెట్ వేగం మొత్తం నెలకు 2 Mbpsకి తగ్గిపోనుంది. ఇంతకుముందు ఈ ప్లాన్‌పై 200GB డేటాతో 50 Mbps స్పీడ్ అందిస్తోంది.
ఇప్పుడు డేటా లిమిట్ కూడా 1TBకి పెంచింది. BSNL యూజర్లకు ఉచిత వాయిస్ కాలింగ్ కనెక్షన్‌ను కూడా అందిస్తోంది. ఇందుకోసం అదనంగా చెల్లించాల్సిన అవసరం లేకుండానే అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తోంది. BSNL రూ. 499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 1TB డేటా వరకు పొందవచ్చు. కేరళ టెలికాం నివేదిక ప్రకారం.. నవంబర్ 2021లో BSNL పాన్ ఇండియా రూ. 499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు 100GB డేటా ఆఫర్‌ను విత్ డ్రా చేసుకుంది. ప్రభుత్వ ఆధీనంలోని టెల్కో సంస్థ కేరళ సర్కిల్ BSNL యూజర్లకు మాత్రమే ఈ ప్లాన్లను ప్రకటించింది. రూ. 499కి 200GB డేటాను అందిస్తోంది.
ఈ ప్లాన్.. కేరళ సర్కిల్ కోసం మాత్రమే :
నివేదిక ప్రకారం.. రూ. 499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ క్రమబద్ధీకరించిన టెల్కో కంపెనీ.. ఇప్పుడు 1TB డేటాతో పాటు ఇతర బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ప్లాన్ కేరళ టెలికాం సర్కిల్ యూజర్లకు మాత్రమే ప్రకటించింది. ఈ ప్లాన్‌తో ఇతర అదనపు బెనిఫిట్స్ ఉండవు.
ఎయిర్టెల్ ప్లాన్ సూపర్ :
భారతీ ఎయిర్టెల్ రూ. 499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో పోలిస్తే.. BSNL రూ. 499 డేటా ప్లాన్ స్పీడ్ ఎక్కువగా అందిస్తోంది. ఎయిర్టెల్ ప్లాన్ 3.3TB నెలవారీ FUP డేటాతో పాటు Airtel థాంక్స్ బెనిఫిట్స్ అందిస్తోంది. కానీ, BSNL మాత్రం అంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ అందిస్తోంది. 1TB హైస్పీడ్ డేటా అవసరమైనవారికి కేరళలో BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ రూ. 499 బెస్ట్ ప్లాన్ గా చెప్పవచ్చు. ఒకవేళ మీకు ఎక్కువ డేటా కావాలంటే.. ఎయిర్టెల్ 40 Mbps స్పీడ్ ప్లాన్ కూడా బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు.
Read Also : Realme GT 2 Pro లాంచ్ ఈరోజే.. ప్రపంచంలో ఈ ఫీచర్ ఉన్న ఫస్ట్ ఫోన్ ఇదే!
