BSNL 5G Services : దేశవ్యాప్తంగా ఫస్ట్ 4G సర్వీసులు.. 2023 ఆగస్టులో BSNL 5G సర్వీసులు

BSNL 5G Services : భారత్‌లో రెండు పెద్ద ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు, రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) భారత మార్కెట్లో 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. 2024 నాటికి దేశం అంతటా 5G సర్వీసులను విస్తరించాలని భావిస్తున్నాయి.

BSNL 5G Services : దేశవ్యాప్తంగా ఫస్ట్ 4G సర్వీసులు.. 2023 ఆగస్టులో BSNL 5G సర్వీసులు

BSNL to launch 5G in August 2023, but before that it will launch 4G across India

Updated On : October 21, 2022 / 5:30 PM IST

BSNL 5G Services : భారత్‌లో రెండు పెద్ద ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు, రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) భారత మార్కెట్లో 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. 2024 నాటికి దేశం అంతటా 5G సర్వీసులను విస్తరించాలని భావిస్తున్నాయి. అయితే దేశీయ ప్రభుత్వ టెలికం రంగ దిగ్గజం BSNL సొంత 5G ప్రారంభానికి ముందుగానే BSNL 4G సర్వీసులను ప్రారంభించాలని భావిస్తోంది.

జనవరి 2023లో స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి 4Gని లాంచ్ చేయనుంది. ఆ తర్వాత BSNL 5G సర్వీసులు ఆగస్టు 2023లో ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ నేతృత్వంలోని టెలికాం నెట్‌వర్క్ BSNL జనవరి 2023 నాటికి దేశంలో 4G సర్వీసులను ప్రారంభించనుందని కమ్యూనికేషన్ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల వెల్లడించారు. BSNL 4G సర్వీసులను మొదటి వారంలో ప్రారంభించాలనే లక్ష్యంతో ఉందని వైష్ణవ్ పేర్కొన్నారు.

5G లాంచ్ ప్లాన్‌ను ప్రకటిస్తూ.. ‘వచ్చే ఏడాది ఆగస్టు నాటికి BSNL నెట్‌వర్క్‌లో 5G సర్వీసులు అమలులోకి వస్తాయన్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో, ఏకకాలంలో అందుబాటులోకి రావొచ్చున్నారు. స్వదేశీ సాంకేతికత సపోర్టుతో 4G, 5Gలను తీసుకురావడానికి BSNL కృషి చేస్తోందని గతంలో నివేదికలు సూచించాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ప్రభుత్వం సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DoT) కలిసి స్వదేశీ 4G కోర్ టెక్‌ని BSNLకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాయని తెలిపారు.

C-DOT స్వదేశీ 5G కోర్ టెక్‌ని కూడా ప్రకటించింది. బీటా టెస్టింగ్ విజయవంతంగా పూర్తయిన తర్వాత BSNL నెక్స్ట్ జనరేషన్ 5G నెట్‌వర్క్‌ను ఆగస్టు 15, 2023 నుంచి అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో టెల్కోలు సరసమైన ధరకు భారత్‌లో 5G ప్లాన్‌లను తీసుకువస్తాయని ప్రభుత్వం తెలిపింది.

BSNL to launch 5G in August 2023, but before that it will launch 4G across India

BSNL to launch 5G in August 2023, but before that it will launch 4G across India

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా 5G ప్లాన్‌ల ధరపై సూచనలిచ్చారు. గతంలో 1GB డేటా ధర సుమారు రూ. 300 ఉండగా, ఒక GBకి రూ.10కి తగ్గింది. 5G సర్వీసులతో పాటు, రెగ్యులేటరీ, చట్టపరమైన అంశాల పరంగా ఇండియన్ టెలికమ్యూనికేషన్ బిల్లు 2022 ముసాయిదాపై కూడా మంత్రిత్వ శాఖ పని చేస్తోంది. ఇందులో టెలికాం సర్వీసులుగా వాట్సాప్ వంటి ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్‌లు అందించే వాయిస్, వీడియో, డేటాతో సహా కమ్యూనికేషన్ సర్వీసులకు నియంత్రణను DoT ప్రతిపాదించింది.

ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందడం తప్పనిసరి చేసింది. ఇతర టెలికాం ఆపరేటర్లు.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ముసాయిదాలోని ఎంపిక చేసిన నిబంధనలపై కొన్ని ఆందోళనలు వ్యక్తం చేశాయి. టెలికాం శాఖ అన్ని కోణాల్లో చర్చలు జరుపుతోంది. ముఖ్యంగా, OTT సర్వీసులకు లైట్-టచ్ నిబంధనలను మాత్రమే అందించాలని DoT యోచిస్తోంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : BSNL New Plans : బీఎస్ఎన్ఎల్ నుంచి సరసమైన ధరకే రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ కోసం ఈ ప్లాన్లు ట్రై చేయండి!