Battlegrounds Mobile India: రాబోయే పబ్-జీని బ్యాన్ చేయాలంటూ కేంద్రమంత్రికి CAIT లేఖ
భారత్‌లో పబ్‌జీ మొబైల్ గేమ్‌పై నిషేధం విధించగా.. చాలాకాలం తర్వాత ఈ గేమ్ యాప్ మళ్లీ ఎప్పుడు వస్తుందా? అని గేమ్ లవర్స్ ఎంతగానో ఎదురుచూశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా’ పేరుతో పబ్ జీ గేమ్ మళ్లీ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

Grounds
Battlegrounds Mobile India: భారత్‌లో పబ్‌జీ మొబైల్ గేమ్‌పై నిషేధం విధించగా.. చాలాకాలం తర్వాత ఈ గేమ్ యాప్ మళ్లీ ఎప్పుడు వస్తుందా? అని గేమ్ లవర్స్ ఎంతగానో ఎదురుచూశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా’ పేరుతో పబ్ జీ గేమ్ మళ్లీ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎట్టకేలకు ఈ గేమ్ బీటా వెర్షన్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో గేమ్ లాంఛ్‌కు ముందే అందుబాటులోకి తెచ్చింది క్రాఫ్టన్ సంస్థ. ఆండ్రాయిడ్ యూజర్లు ఇప్పుడు దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదిస్తున్నారు.
అయితే, ప్రస్తుతం కేవలం కొద్ది మంది బీటా వెర్షన్ యూజర్లకు మాత్రమే ఇది అందుబాటులోకి రాగా.. గేమ్ టెస్టింగ్‌లో భాగంగా కొద్ది మందికి మాత్రమే యాక్సెస్ ఇచ్చింది సంస్థ. ఈ గేమ్‌ను ఇప్పటికే 5మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్లుగా కూడా కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలోనే పూర్తి వెర్షన్‌ను లాంచ్ చేసేందుకు మరో 10 నుంచి 15 రోజుల సమయం పట్టవచ్చని తెలుస్తోంది.
ఈ సమయంలో కాన్ఫరెన్స్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(CAIT) కేంద్రమంత్రి, ఐటీ శాఖా మాత్యులు రవి శంకర్ ప్రసాద్‌కు లేఖ రాసింది. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో సదరు కంపెనీ, భారత చట్టాలను అధిగమించి బ్యాక్ డోర్ ఎంట్రీ ఇస్తుందని, బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా భారత జాతీయ సార్వభౌమత్వానికి మరియు భద్రతకు ముప్పు మాత్రమే కాదని, యువ తరాలకు హానికరం అని లేఖలో ప్రస్తావించారు. భారత జాతీయ భద్రతకు అపాయం కలిగించి, మిలియన్ల మంది భారతీయ ప్రజల డేటాను తస్కరిస్తుందని, గోప్యతకు ప్రమాదాన్ని సృష్టిస్తుందని లేఖలో ప్రస్తావించారు.
బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్‌ను ప్లే స్టోర్ ప్లాట్‌ఫామ్‌లో ఉపయోగించడానికి అనుమతించవద్దని CAIT గూగుల్‌ను కూడా కోరింది. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా PUBG మొబైల్ రీబ్రాండెడ్ వెర్షన్ అని, గతేడాది దీనిని భారతదేశంలో నిషేధించారని, ఇది PUBG మొబైల్ మాదిరిగానే అనేక ఫీచర్లతో పబ్‌జీ మాదిరిగానే ఇది ఉంటుందని ఆరోపించింది CAIT.