Google CEO Sundar Pichai : దీపావళి గురించి భారతీయులు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన 5 ప్రశ్నలివే.. రివీల్ చేసిన సుందర్ పిచాయ్!
Google CEO Sundar Pichai : గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఐదు అంకెలతో ప్రకాశవంతమైన దీపాన్ని చూపించే యానిమేటెడ్ ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అదేంటో ఓసారి లుక్కేయండి.

Google CEO Sundar Pichai reveals the 5 most common diwali-related questions
Google CEO Sundar Pichai : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ దీపావళి గురించి భారతీయులు గూగుల్‌లో సెర్చ్ చేసిన ప్రశ్నల గురించి ఆసక్తికరమైన వివరాలను రివీల్ చేశారు. నవంబర్ 12న, దీపావళి గురించి ప్రపంచవ్యాప్తంగా సెర్చ్ చేసిన ప్రశ్నలను పరిశోధించడానికి, వేడుకల్లో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసేందుకు పిచాయ్ ట్విట్టర్ (X) వేదికగా స్పందించారు.
ఈ సందర్భంగా పిచాయ్.. ఐదు అంకెలతో కూడిన ప్రకాశవంతమైన దీపాన్ని చూపించే యానిమేటెడ్ ఫొటోను షేర్ చేశారు. ఈ సంఖ్యలు దీపావళి గురించి భారతీయ యూజర్లు అడిగే మొదటి ఐదు ‘ఎందుకు’ అనే ప్రశ్నలను సూచిస్తాయి. మీరు ప్రతి నంబర్‌పై క్లిక్ చేస్తే.. పండుగ సమయంలో చాలా మంది ఆసక్తిగా ఉన్న నిర్దిష్ట ప్రశ్నను మీరు చూడవచ్చు.
పిచాయ్ హైలైట్ చేసిన ఐదు ప్రశ్నలివే :
* భారతీయులు దీపావళిని ఎందుకు జరుపుకుంటారు?
* దీపావళి సమయంలో మనం రంగోలీని ఎందుకు వేస్తాం?
* దీపావళి రోజున దీపాలు ఎందుకు వెలిగిస్తాం?
* దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారు?
* దీపావళి సమయంలో నూనె స్నానం ఎందుకు?
దీపావళి అంటే.. సంప్రదాయాలను అర్థం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఎవరూ ఎలా ఆసక్తి చూపుతున్నారో ఈ ప్రశ్నలు హైలైట్ చేశాయి. ప్రపంచవ్యాప్తంగా దీపావళి ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో చూడవచ్చు.
Happy Diwali to all who celebrate! We’re seeing lots of interest about Diwali traditions on Search, here are a few of the top trending “why” questions worldwide: https://t.co/6ALN4CvVwb pic.twitter.com/54VNnF8GqO
— Sundar Pichai (@sundarpichai) November 12, 2023
గత ఏడాది 2022లో దీపావళి సమయంలో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన (ICC T20) ప్రపంచ కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించిన తర్వాత పిచాయ్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

5 most common diwali-related questions
పిచాయ్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ‘దీపావళి శుభాకాంక్షలు.. ప్రతి ఒక్కరూ మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో అద్భుతమైన సమయాన్ని గడపాలని ఆశిస్తున్నాను. నేను ఈరోజు చివరి మూడు ఓవర్‌లను మళ్లీ చూసి సంబరాలు చేసుకున్నాను. ఆట అంటే ఇలా ఉండాలి.. అదరగొట్టారు’ అంటూ #Diwali #TeamIndia #T20WC2022 అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించారు.
Happy Diwali! Hope everyone celebrating has a great time with your friends and family.
? I celebrated by watching the last three overs again today, what a game and performance #Diwali #TeamIndia #T20WC2022— Sundar Pichai (@sundarpichai) October 24, 2022
సరిగ్గా చోటి దీపావళికి ఒక రోజు ముందు అక్టోబర్ 23న భారత్ అద్భుతమైన విజయం అందుకోవడం మరింత సంతోషాన్ని ఆనందాన్ని తెచ్చిపెట్టిందని పిచాయ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా దీపావళి సంప్రదాయాలపై ఎంత ఆసక్తిని కలిగి ఉన్నాయో చూపించలేదు. పిచాయ్ పోస్టు చేసిన ఆ పాత పోస్టు కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది.