ChatGPT APP: ఇండియాలో ఆండ్రాయిడ్ ఫోన్‌లలో అందుబాటులోకి చాట్ జీపీటీ యాప్.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

ఇండియా, యూఎస్, బంగ్లాదేశ్, బ్రెజిల్ దేశాల్లో ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. అయితే, మరికొన్ని దేశాల్లో వచ్చే వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుందని కంపనీ తెలిపింది.

ChatGPT APP: ఇండియాలో ఆండ్రాయిడ్ ఫోన్‌లలో అందుబాటులోకి చాట్ జీపీటీ యాప్.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

ChatGPT APP

ChatGPT APP In Android Phones: చాట్ జీపీటీ (ChatGPT) యాప్ ఇప్పుడు Android స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకుకూడా అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే‌స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గతకొన్ని నెలలుగా చాట్‌జీపీటీ ప్రపంచ వ్యాప్తంగా భాగా ప్రాచుర్యం పొందింది. చాట్ జీపీటీ అనేది సాధారణ సంభాషణల భాషలో వినియోగదారుల ప్రశ్నలకు సమాధానమిస్తుంది. జీపీటీ మోడల్‌లో పనిచేసే అమెరికన్ కంపెనీ ఓపెన్ ఏఐ ద్వారా చాట్ జీపీటీ అభివృద్ధి చేయబడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చాట్ జీపీటీ రెండు వెర్షన్లు ఉన్నాయి. ఒకటి ఉచితం, మరొకటి చాట్ జీపీటీ ప్లస్ అని పిలువబడే చెల్లింపు వెర్షన్. చాట్ జీపీటీ యొక్క తాజా వెర్షన్ చెల్లింపు వెర్షన్‌లో అందుబాటులో ఉంది.

ChatGPT App : ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొత్త చాట్‌జీపీటీ యాప్.. వచ్చేవారమే లాంచ్.. గూగుల్ బార్డ్ పరిస్థితి ఏంటి?

అమెరికన్ కంపనీ ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ యొక్క ఆండ్రాయిడ్ వెర్షన్ యాప్‌ను ప్రారంభించింది. ఇంతకుముందు, చాట్ జీపీటీ అధికారిక యాప్ ఐఓఎస్ అంటే ఐ ఫోన్స్ కోసం మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, ఇప్పుడు చాట్ జీపీటీ యాప్‌ని ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఓపెన్ ఏఐ ప్రస్తుతం భారతదేశంతో పాటు కొన్ని దేశాలకు మాత్రమే ఆండ్రాయిడ్ కోసం చాట్ జీపీటీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండియా, యూఎస్, బంగ్లాదేశ్, బ్రెజిల్ దేశాల్లో ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. అయితే, మరికొన్ని దేశాల్లో వచ్చే వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుందని కంపనీ తెలిపింది.

Fake ChatGPT Apps : ప్లే స్టోర్‌లో ఫేక్ చాట్‌జీపీటీ యాప్స్.. మీ ఫోన్ ఫుల్ కంట్రోల్ ఇక హ్యాకర్ల చేతుల్లో.. మీ నెంబర్లతో స్కామ్ చేస్తారు జాగ్రత్త..!

చాట్‌జీపీటీ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్స్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చాట్ జీపీటీ‌లాగా నకిలీ యాప్‌లు ప్లే స్టోర్‌లో ప్రత్యక్షమయ్యాయి. వీటిని డౌన్‌లోడ్ చేసుకోవటం వల్ల ఇబ్బందులు కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. ప్లే స్టోర్‌లో చాట్ జీపీటీ అని టైప్ చేసిన వెంటనే కొన్ని ఫేక్ యాప్‌లు కూడా దర్శనమిస్తున్నాయి. అవి కనిపించే తీరులో చాట్ జీపీటీని పోలి ఉంటాయి. కానీ, తొందరపడి వాటిని డౌన్‌లోడ్ చేసుకోవద్దని కంపనీ ప్రతినిధులు వెల్లడించారు. అసలు చాట్ జీపీటీ యాప్ యొక్క లోగో నలుపు రంగులో ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మీరు చాట్ జీపీటీ క్రింద వ్రాసిన ఓపెన్ ఏఐ‌ని గుర్తించవచ్చు.

 

మీరు చాట్ జీపీటీ‌ని ఉపయోగించాలనుకుంటే మీరు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తరువాత సైన్‌అప్ చేయాలి. మీ ఇ-మెయిల్ ఐడీని నమోదు చేయడం ద్వారా ఇ- మెయిల్ ద్వారా పాస్‌వర్డ్‌ని సృష్టించడం ద్వారా లాగిన్ చేయొచ్చు. వినియోగదారు ఇంటర్ ఫేస్ చాలా సులభం. మీరు ఎవరితోనైనా మాట్లాడే విధంగానే దాని నుండి ఏదైనా అడగవచ్చు.