చైనా కుట్ర : 5 ప్రధానులు, 25 మంది సిఎంలు, 350 ఎంపీలపై చైనా నిఘా

  • Published By: murthy ,Published On : September 14, 2020 / 07:39 PM IST
చైనా కుట్ర  : 5 ప్రధానులు, 25 మంది సిఎంలు, 350 ఎంపీలపై చైనా నిఘా

Updated On : September 14, 2020 / 8:03 PM IST

China is watching : Overseas Key Information Database (OKIDB). చైనా చేతిలో చిక్కిన విదేశీ ప్రభుత్వాల సమచార డేటాబేస్ ఇది. China ప్రభుత్వానికి సంబంధమున్న Zhenhua ఈ డేటా బేస్ ను సేకరించి చైనా చేతిలో పెట్టింది. china Communist Partyతోపాటు ప్రముఖుల అందిరి మీద నిఘా నేత్రమేసింది చైనా.

ప్రముఖుల సమాచారం చేతిలో ఉంటే వాళ్లను ఎలా కంట్రోల్ చేయొచ్చో చైనాకు బాగా తెలుసు. అందుకే ఈ టెక్నిక్‌తో విదేశాల మీద నిఘా వేసింది. ఇది డిజిటల్ ఐ. అంటే మనుషులుండరు. ఆన్‌లైన్‌లోకి చొరబడి కావాల్సిన సమాచారాన్ని దొంగిలిస్తారు.

మంత్రులు, మేయర్ల నుంచి ఎంపీల వరకు ప్రతి ఒక్కరి మీద డ్రాగన్ నిఘావేసింది. అన్నిపార్టీల్లోని, విదేశాల్లోని ఎంపీల్లో 1350 మంది మీద కన్నేసింది. వాళ్ల డేటా మొత్తాన్ని సేకరించింది. అందులో భాగమే ఇండియా డేటాలోకి చైనా చొరబాటు.



భారత్ ప్రముఖుల రహస్యాలు తెలుసుకొని చైనా ఏం చేయబోతోంది? చైనా నిఘా సంస్థ ఎలా పనిచేస్తుంది.? ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబడుతోంది? ఈ స్పై ఆపరేషన్ వెనకున్న అసలు స్కెచ్ ఏంటి? చైనా పన్నిన ఈ కుట్ర డేటా చౌర్యం కుట్రలో దాగున్న అసలు కోణమేంటి?

Zhenhua Data Information Technology Co. Limited టెక్నాలజీ కంపెనీ. ఇదే ఈ కంపెనీనే భారతదేశంలోని 10 వేల మంది ప్రముఖులపై గూఢచర్యం చేస్తోంది. వారి కదలికలను, వారి డిజిటల్ లైఫ్‌లను నిశితంగా గమనిస్తూ స్పై ఆపరేషన్ చేస్తోంది. ప్రముఖుల రియల్ టైమ్ డేటాను చైనా ప్రభుత్వానికి, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి అందజేస్తోంది.

ఈ Zhenhua టెక్నాలజీ కంపెనీ ఎలా పనిచేస్తుంది? ఇండియాలోని ఫేమస్ పర్సనాలిటీలకు సంబంధించి.. ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తోంది? ఇంతకీ ఈ డేటా చౌర్యం వెనకున్న టార్గెట్ ఏంటి అన్న ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్.