ఆ ఫోన్లలో ఇక వాట్సాప్ పనిచేయదు

మీరు ఇప్పటికీ నోకియా ఎస్40 ఫోన్ వాడుతున్నారా? మీకు వాట్సాప్ సౌకర్యం ఉందా? ఇక మీదట ఈ ఫోన్లో వాట్సాప్ పనిచేయదు.

  • Published By: sreehari ,Published On : December 31, 2018 / 11:15 AM IST
ఆ ఫోన్లలో ఇక వాట్సాప్ పనిచేయదు

Updated On : December 31, 2018 / 11:15 AM IST

మీరు ఇప్పటికీ నోకియా ఎస్40 ఫోన్ వాడుతున్నారా? మీకు వాట్సాప్ సౌకర్యం ఉందా? ఇక మీదట ఈ ఫోన్లో వాట్సాప్ పనిచేయదు.

మీరు నోకియా ఎస్40 ఫోన్ వాడుతున్నారా? అందులో వాట్సాప్ సౌకర్యం ఉందా? ఇక మీదట ఈ ఫోన్లో వాట్సాప్ పనిచేయదు. ఈ రోజు నుంచి నోకియా ఎస్40 ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. నోకియా ఎస్ 40 మోడల్ ఫోన్లలో డిసెంబర్ 31 తరువాత వాట్సాప్ సేవలు నిలిపివేయనున్నట్టు వాట్సాప్ సంస్థ వెల్లడించింది. జనవరి 1నుంచి నోకియా ఎస్40 ఫోన్లలో వాట్సాప్ సేవలను వినియోగించుకోలేరని స్పష్టం చేసింది. ప్రముఖ మెసేజింగ్ సంస్థ వాట్సాప్ కొన్నిఏళ్ల క్రితమే కాలం చెల్లిన ఫోన్లలో సేవలు అందించడం స్వస్తి చెప్పేసింది. బ్లాక్ బెర్రీ 10, బ్లాక్ బెర్రీ ఓఎస్, నోకియా సింబయన్ ఎస్60, విండోస్ ఫోన్ 8.0, ఆండ్రాయిడ్ వెర్సన్స్ 2.3.7, ఐఫోన్ ఐఓఎస్ 7 అంతకంటే పాత మోడల్స్ ఫోన్లలో వాట్సాప్ సేవలు అందిస్తోంది. ఈ ప్లాట్ ఫాంలకు సర్వీసులను ఆపేయాలని వాట్సాప్ సంస్థ నిర్ణయించింది. 2020 నాటికి ఈ ప్లాట్ ఫాం ఫోన్లలో కూడా వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.

ఈ ఏడాది జూన్‌లోనే వాట్సాప్ సేవలు నిలిచిపోవాల్సి ఉండగా.. వాట్సాప్ డిసెంబర్ వరకు గడువు పొడిగించింది. కొన్నేళ్ల క్రితం స్మార్ట్ ఫీచర్లతో వచ్చిన ఓఎస్ నోకియా సిరీస్ 40 మోడల్ మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసింది. నోకియా ఎస్40 మొబైల్ మోడల్‌ను 1999లో విడుదల చేయగా.. 2005లో చివరిసారిగా అప్ డేట్ చేశారు. రోజురోజుకీ మార్కెట్లలో వస్తున్న స్మార్ట్ ఫోన్ల గిరాకీతో మైక్రోసాఫ్ట్, ఓఎస్ సిరీస్‌‌‌ కనుమరుగయ్యాయి. నోకియా ఎస్40 మోడల్స్‌లోని ఓఎస్ కలిగిన అత్యధిక మోడల్స్‌లో నోకియా ఆశా 201, నోకియా 205 వంటి పలు మోడళ్లు మార్కెట్లో విడుదలయ్యాయి. వాట్సాప్ తాజా నిర్ణయంతో నోకియా ఎస్40, పాత వర్సెన్ యూజర్లకు వాట్సాప్ సేవలు అందుబాటులో ఉండవు. ఆండ్రాయిడ్ 2.3.7, అంతకంటే పాత వర్సెన్ (జింజర్ బ్రీడ్), ఐఫోన్ 3జీఎస్, ఐఓఎస్ 6 వంటి ఫోన్లలో ఫిబ్రవరి 1, 2020 నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నట్టు సంస్థ వెల్లడించింది.