జనవరి 1 నుంచి మీ మొబైల్ నెంబర్‌కు 11 అంకెలు..!

  • Publish Date - November 25, 2020 / 09:38 PM IST

Calling mobile number from January 11 Digits : ల్యాండ్ ఫోన్ నుంచి మొబైల్ నెంబర్లకు కాల్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ల్యాండ్ ఫోన్ నుంచి మొబైల్ నెంబర్లకు కాల్ చేయాలంటే జీరో (0) యాడ్ చేయాల్సిందే..

మొబైల్ నెంబర్ 10 అంకెలు ఉంటే.. దానికి ముందు మరో అంకె ‘0’ను యాడ్ చేయాల్సి ఉంటుంది. దీనిపై టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI)కు డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం (DoT) గత మే లోనే ప్రతిపాదించింది. డాట్ ప్రతిపాదనను ఇప్పుడు ట్రాయ్ అంగీకరించింది.

దాంతో ఫిక్సడ్ లైన్, మొబైల్ సర్వీసుల మధ్య మరిన్ని నెంబర్లకు అవకాశం పెరిగింది. కొత్త వ్యవస్థను జనవరి 1 లోగా అమలు చేసేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ట్రాయ్ టెలికంలకు సూచించింది.

డయిలింగ్ ప్యాట్రన్ మార్పుతో 2,554 మిలియన్ల నెంబర్లు అదనంగా లభించనున్నట్టు రెగ్యులేటర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే? ల్యాండ్‌ లైన్‌ నుంచి ల్యాండ్‌లైన్‌ ఫోన్ కాల్ చేసినప్పుడు లేదా మొబైల్‌ నుంచి ల్యాండ్‌లైన్‌ కాల్, మొబైల్‌ టు మొబైల్‌కు ఫోన్ కాల్స్‌ చేసేటప్పుడు ‘0’ యాడ్‌ చేయాల్సిన అవసరం లేదు.

అలా కాకుండా ఎవరైనా జీరో లేకుండా ల్యాండ్ లైన్ నుంచి మొబైల్ ఫోన్‌కు కాల్ చేస్తే ఒక ప్రకటన వినిపిస్తుంది.. ల్యాండ్‌లైన్‌ నుంచి కాల్‌ చేస్తే ఇకపై మొబైల్ నెంబర్లకు 11 అంకెలు ఉండనున్నాయి.

10 డిజిట్ మొబైల్ నెంబర్ల నుంచి 11 డిజిట్ నెంబర్ స్కీమ్ కింద మొబైల్ నెంబర్లు మొత్తం 10 బిలియన్ల నెంబర్ల కేపాసిటీని అందించనుంది. అలాగే డొంగల్ సంబంధిత మొబైల్ నెంబర్లకు కూడా 13 అంకెలుగా మారే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు