లైట్‌వెయిట్‌ స్మార్ట్‌ఫోన్లు.. ఇప్పుడివే ట్రెండు.. ఈ మూడు స్మార్ట్‌ఫోన్లు అదుర్స్ అంతే..

ఇటువంటి తేలికపాటి స్మార్ట్‌ఫోన్లను కొనాలని మీరు అనుకుంటుంటే ఈ టాప్‌ మోడళ్లను చూడండి..

లైట్‌వెయిట్‌ స్మార్ట్‌ఫోన్లు.. ఇప్పుడివే ట్రెండు.. ఈ మూడు స్మార్ట్‌ఫోన్లు అదుర్స్ అంతే..

Updated On : May 6, 2025 / 9:25 AM IST

తేలికైన, సన్నని స్మార్ట్‌ఫోన్‌లు ఈ ఏడాది బాగా ట్రెండ్‌లో ఉంటున్నాయి. మంచి ఫీచర్ల విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా పోర్టబిలిటీని కోరుకునే వారు ఈ స్మార్ట్‌ఫోన్లను బాగా కొంటున్నారు.

అందుకు తగ్గట్లే శాంసంగ్, ఆపిల్ వంటి కంపెనీలు శక్తిమంతమైన చిప్‌సెట్‌లు, అధిక రిజల్యూషన్ ఉండే డిస్‌ప్లేలు, బ్యాటరీ లైఫ్‌ అధికంగా ఉండే అల్ట్రా లైట్ ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఇటువంటి తేలికపాటి స్మార్ట్‌ఫోన్లను కొనాలని మీరు అనుకుంటుంటే ఈ టాప్‌ మోడళ్లను చూడండి..

శాంసంగ్ గెలాక్సీ S25 (162 గ్రాముల బరువు)
మంచి పర్ఫార్మన్స్‌ ఉన్న శాంసంగ్ గెలాక్సీ S25 యూజర్లను ఆకర్షిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ S25 ఆండ్రాయిడ్‌ను v15తో తీసుకొచ్చారు. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ద్వారా రన్‌ అవుతుంది. 12 GB RAM, 4.47 GHz పీక్ బ్రైట్‌నెస్‌తో ఆక్టా-కోర్ ప్రాసెసర్ మల్టీ టాస్కింగ్‌కు అనుగుణంగా ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలైంది.

స్క్రీన్ 6.2-అంగుళాల డైనమిక్ AMOLED 2xతో వచ్చింది.120 Hz రిఫ్రెష్ రేటుతో అందుబాటులో ఉంది. ట్రిపుల్ రియర్ కెమెరా కాన్ఫిగరేషన్‌లో 50 MP, 12 MP, 10 MP సెన్సార్లు, LED ఫ్లాష్‌లు ఉన్నాయి. ఫ్రంట్‌ కెమెరా 12 MPతో వచ్చింది. బ్యాటరీ సామర్థ్యం 4000 mAh ఉంది. ఇండియాలో దీని ధర రూ.64,499.

Also Read: గూగుల్ Pixel 8 Proపై భారీ డిస్కౌంట్.. అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌.. డోంట్‌ మిస్..

ఆపిల్ ఐఫోన్ 16E (167 గ్రాముల బరువు)
ఐఫోన్ 16E ఆపిల్ నుంచి వచ్చిన తేలికైన డివైజ్‌లలో ఒకటి. ఇది iOS v18పై రన్‌ అవుతుంది. ఆపిల్ A18 చిప్‌సెట్, 4.04 GHz వరకు క్లాకింగ్ చేసే హెక్సా-కోర్ ప్రాసెసర్‌తో 8 GB RAMతో వచ్చింది. 60 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR స్క్రీన్‌తో వచ్చింది. కెమెరా విషయానికి వస్తే 48 MP ప్రైమరీ రియర్ సెన్సార్, 12 MP ఫ్రంట్ షూటర్ ఉన్నాయి. 3,961 mAh బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది. రూ.53,999 కు అందుబాటులో ఉంది.

శాంసంగ్ గెలాక్సీ S24 5G (168 గ్రాముల బరువు)
శాంసంగ్ గెలాక్సీS24 5G Android v14తో రన్ అవుతుంది. ఇందులో Samsung Exynos 2400 చిప్‌సెట్‌ను వాడారు. డెకా కోర్ ప్రాసెసర్, 8 GB RAMతో అంబాబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.2-అంగుళాల డైనమిక్ AMOLED 2x స్క్రీన్‌తో వచ్చింది.

ఇందులో ఫుల్ HD+ రిజల్యూషన్, రిచ్ విజువల్స్ కోసం 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. 50 MP, 12 MP, 10 MP సెన్సార్‌లతో ట్రిపుల్ రియర్ కెమెరా ఇందులో ఉంది. అలాగే 12 MP ఫ్రంట్ కెమెరా ఉంది. 4000 mAh బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులో ఉంది. భారత్‌లో దీని ధర రూ.50,999గా ఉంది.