Hotstar Plans: సెప్టెంబర్ 1 నుంచి అప్‌గ్రేడ్ అయ్యే Disney+Hotstar ప్లాన్లు ఇవే!

పాపులర్ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అందించే సబ్ స్ర్కిప్షన్ ప్లాన్లు సెప్టెంబర్ 1 నుంచి అప్‌గ్రేడ్ కానున్నాయి.

Hotstar Plans: సెప్టెంబర్ 1 నుంచి అప్‌గ్రేడ్ అయ్యే Disney+Hotstar ప్లాన్లు ఇవే!

Disney+ Hotstar Plans Set To Change From Sept 1 (1)

Updated On : August 20, 2021 / 9:58 AM IST

Disney+ Hotstar plans : ప్రముఖ పాపులర్ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజాల్లో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney+ Hotstar) అందించే సబ్ స్ర్కిప్షన్ ప్లాన్లు సెప్టెంబర్ 1 నుంచి అప్ గ్రేడ్ కానున్నాయి. Disney+ Hotstar VIP plan ఏడాది సబ్ స్ర్కిప్షన్ రూ.399లకు ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ కింద దేశంలోని వినియోగదారులంతా HD క్వాలిటీ వీడియో, Dolby 5.1 ఆడియోను యాక్సస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మరో ప్రీమియం ప్లాన్ ధర ఏడాదికిగానూ రూ.1,499 ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ ద్వారా 4K క్వాలిటీ వీడియో Dolby 5.1 ఆడియోను యాక్సస్ చేసుకోవచ్చు. అంతేకాదు.. స్ట్రీమింగ్ కంటెంట్ ఒకేసారి రెండ్ స్ర్కీన్లపై యాక్సస్ చేసుకోవచ్చు.

ప్రస్తుత రెండు ప్లాన్లకు బదులుగా మరో మూడు సబ్ స్ర్కిప్షన్ ప్లాన్లకు అప్ గ్రేడ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు గతనెలలోనే Disney+ Hotstar ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇప్పుడు ఈ మూడు ప్లాన్లు సెప్టెంబర్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ ఓటీటీ దిగ్గజం తమ వినియోగదారులందరికి ప్లాన్ల మార్పుపై అధికారికంగా నోటిఫికేషన్లను పంపుతోంది. తమ ‌వెబ్ సైట్లో కూడా ఇదే విషయాన్ని అప్ డేట్ చేసింది. Disney+ Hotstar ఆఫర్ చేసే అప్ గ్రేడ్ ప్లాన్లలో ఒకటి Mobile Plan, రెండోది Super Plan, మూడోది Premium Plan.. మొబైల్ ప్లాన్ సబ్ స్ర్కిప్షన్ ఏడాదికిగానూ రూ.499 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే సూపర్ ప్లాన్ ఏడాదిగానూ రూ.899 చెల్లించాలి. ఇక ప్రీమియం ప్లన్ ఏడాదిగానూ రూ.1,499 చెల్లించి ప్లాన్ యాక్సస్ చేసుకోవచ్చు.
అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, నెట్ ఫ్లిక్ లో… గోళ్లు కొరుక్కునే 9 థ్రిల్లర్ షో,సినిమాలు ఇవే!

ఈ మూడింటిలో ఏదైనా ప్లాన్ Disney+ Hotstar సబ్ స్ర్కైబర్లు ఎంచుకంటే.. వారికి అన్ లిమిటెడ్ స్పోర్ట్స్ యాక్సస్ చేసుకోవచ్చు. అందులో Cricket, Pro Kabaddi League, ISL, Tennis grand slams, Premier League, F1 వంటివి స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. అంతేకాదు.. లేటెస్ట్ ఇండియన్ మూవీ డిజిటల్ ప్రీమియర్స్, Hotstar Specials, Star serials TV, Disney+ Originals, popular Disney movies, kids shows మరెన్నో ఇంగ్లీష్ భాషలో స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. భారతీయ భాషల్లో కూడా చాలావరకు కంటెంట్ యాక్సస్ చేసుకోవచ్చు. ప్రస్తుత సబ్ స్ర్కైబర్ ప్లాన్ ముగిసిన తర్వాత మాత్రమే ఈ కొత్త సబ్ స్ర్కిప్షన్లు అందుబాటులోకి వస్తాయని Disney+ Hotstar తమ సపోర్టు పేజీలో అప్ డేట్ చేసింది.

Hotstar

Disney+ Hotstar Mobile plan :
ఈ ప్లాన్ యాడ్ సపోర్టెడ్ ప్లాన్.. ఏడాది సబ్ స్ర్కిప్షన్ ధర రూ.499 చెల్లించాలి. ఎప్పుడంటే అప్పుడు ఏదైనా డివైజ్ నుంచి ఈజీగా లాగిన్ అవ్వొచ్చు. 720p వీడియో క్వాలిటీ, స్టీరియో క్వాలిటీ సౌండ్ యాక్సస్ చేసుకోవచ్చు.

Disney+ Hotstar Super plan :
ఈ ప్లాన్ యాడ్ సపోర్టెడ్ ప్లాన్.. ఏడాదికి రూ.899 చెల్లించాలి. ఒకే సమయంలో రెండు డివైజ్ ల్లో లాగిన్ కావొచ్చు. 1080p వీడియో క్వాలిటీతో పాటు Dolby 5.1 సౌండ్ యాక్సస్ చేసుకోవచ్చు.

Disney+ Hotstar Premium :
ఈ ప్లాన్ కూడా యాడ్ సపోర్టెడ్ ప్లాన్.. ఏడాదికి రూ.1,499 చెల్లించి సబ్ స్ర్కిప్షన్ పొందవచ్చు. ఒకే సమయంలో 4 డివైజ్ ల్లో లాగిన్ కావొచ్చు. అలాగే 4K వీడియో క్వాలిటీ, Dolby 5.1 సౌండ్ క్వాలిటీని యాక్సస్ చేసుకోవచ్చు.