Disney Plus : నెట్‌ఫ్లిక్స్ బాటలో డిస్నీప్లస్.. వచ్చే జూన్ నుంచి పాస్‌వర్డ్ షేరింగ్‌ కుదరదు..!

Disney Plus : డిస్నీ ప్లస్ గత ఏడాదిలో పాస్‌వర్డ్ షేరింగ్‌ను బ్లాక్ చేయడం ప్రారంభించింది. 2024లో డిస్నీ ప్లాట్‌ఫారమ్ ఈ పాస్‌వర్డ్ షేరింగ్ బ్లాకింగ్ ఫీచర్‌ను మరిన్ని దేశాలకు విస్తరించబోతోంది.

Disney Plus Will Block Password Sharing From June 2024

Disney Plus Password Block : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం డిస్నీ ప్లస్ నెట్‌ఫ్లిక్స్ బాటలోనే పయనిస్తోంది. పాస్‌వర్డ్ షేరింగ్ విధానాన్ని డిస్నీ ప్లస్ క్రమంగా తగ్గిస్తోంది. గత ఏడాదిలోనే ఈ పాస్‌వర్డ్ షేరింగ్ విధానాన్ని బ్లాక్ చేయడం ప్రారంభించిన డిస్నీ ప్లస్.. 2024 ఏడాదిలోనూ పూర్తి స్థాయిలో పాస్‌వర్డ్ షేరింగ్ బ్లాకింగ్ ఫీచర్‌ను విస్తరించనుంది. ఇందులో భాగంగా వచ్చే జూన్ నుంచి డిస్పీ ప్లస్ పాస్‌వర్డ్ షేరింగ్ బ్లాక్ చేయనుంది.

Read Also : Netflix : వామ్మో.. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్స్ ఎన్ని కోట్ల మంది ఉన్నారో తెలుసా?

వాస్తవానికి, ఈ కొత్త అప్‌డేట్‌ను వాల్ట్ డిస్నీ సీఈఓ బాబ్ ఇగోర్ షేర్ చేయగా.. వచ్చే సెప్టెంబర్ నాటికి ఈ బ్లాకింగ్ ఫీచర్ పూర్తిగా అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. ఈ బ్లాకింగ్ ఫీచర్ మొదట్లో ఎంపిక చేసిన దేశాల్లోనే అందుబాటులోకి వస్తుందని డిస్నీ ప్లస్ చీఫ్ వెల్లడించారు.

అయితే, సెప్టెంబరు 2024 నాటికి విస్తృతంగా అందుబాటులోకి వస్తుందని ఆయన సూచించారు. గతంలో నెట్‌ఫ్లిక్స్ వినియోగదారుల పాస్‌వర్డ్ షేరింగ్ పరిమితం చేయడంతో అనేక ప్రయోజనాలను పొందింది. ఈ విధానంతో అధిక మొత్తంలో కొత్త వినియోగదారులు చేరారు. ఇప్పుడు ఇదే విధానాన్ని డిస్నీ కూడా అమల్లోకి తీసుకొస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫారమ్ ఈ కొత్త నియమాన్ని నవంబర్ 1 2023 నుంచి కెనడాలో యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త సిస్టమ్ ద్వారా స్నేహితులతో అకౌంట్ షేర్ చేయలేరనే విషయాన్ని మెయిల్ పంపడం ద్వారా తెలియజేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. డిస్నీ ప్లస్ కూడా పాస్‌వర్డ్ షేరింగ్ అమలులో చాలా కఠినంగా ఉండాలని భావిస్తోంది.

కొత్త నిబంధనలను ఉల్లంఘించిన యూజర్లు తమ అకౌంట్లపై పరిమితులు లేదా రద్దు వంటి చర్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. డిస్నీ ప్లస్‌ అకౌంట్ ద్వారా కాకుండా సర్వీసు కోసం ఎక్కువ మంది యూజర్లు చెల్లించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పాస్‌వర్డ్ షేరింగ్ బ్లాకింగ్ ముందుగా ఏయే దేశాల్లో అందుబాటులోకి రానుంది అనేదానిపై క్లారిటీ లేదు. ఇందులో భారత్ వంటి మార్కెట్లకు మినహాయింపు ఉంటుందా లేదా తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే..

Read Also : Netflix Password Sharing : భారత్‌లో నో పాస్‌వర్డ్ షేరింగ్.. నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఎవరికి ఉచితం? ఎవరు చెల్లించాలంటే?

ట్రెండింగ్ వార్తలు