Netflix Password Sharing : భారత్‌లో నో పాస్‌వర్డ్ షేరింగ్.. నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఎవరికి ఉచితం? ఎవరు చెల్లించాలంటే?

Netflix Password Sharing : నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్.. మీ ఇంటిలో నివసిస్తున్న వ్యక్తులు మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఉచితంగా ఉపయోగించవచ్చు. కానీ, మీతో నివసించని వారితో అకౌంట్ పాస్‌వర్డ్ షేరింగ్ చేయలేరు.

Netflix Password Sharing : భారత్‌లో నో పాస్‌వర్డ్ షేరింగ్.. నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఎవరికి ఉచితం? ఎవరు చెల్లించాలంటే?

Netflix India ends password sharing _ Who is eligible to use it for free and who will have to pay

Netflix Password Sharing : ప్రముఖ స్ట్రీమింగ్ కంపెనీ నెట్‌ప్లిక్స్ (Netflix) ఇంటి వెలుపల వారితో పాస్‌వర్డ్‌లను షేర్ చేసే సభ్యులకు ఇమెయిల్ పంపనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఇటీవల ప్రకటించింది. దీంతో భారతీయులు ఇకపై పాస్‌వర్డ్‌లు లేదా తమ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ బయటి వ్యక్తులతో షేర్ చేయలేరని కంపెనీ స్పష్టం చేసింది. యూజర్లకు ఇమెయిల్‌లను పంపడంపై నెట్‌ఫ్లిక్స్ తమ బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. ఇప్పుడు, భారతీయ యూజర్లలో ఎవరు ఉచితంగా అకౌంట్ ఉపయోగించవచ్చు? ఎవరు అకౌంట్ వినియోగానికి చెల్లించాలి? అనేది పూర్తి వివరాలను తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఎవరు ఫ్రీగా వాడొచ్చు? ఎవరు చెల్లించాలి? :
నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ అనేది ఒక ఫ్యామిలీకి మాత్రమే ఉపయోపడుతుంది. ఆ ఇంట్లో నివసించే ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నా ఇంట్లో లేదా ప్రయాణంలో, సెలవుల్లో ఉన్నా నెట్‌ఫ్లిక్స్‌ని ఉపయోగించవచ్చు. ప్రొఫైల్‌ను ట్రాన్స్‌ఫర్ చేయడం, అకౌంట్ యాక్సెస్, డివైజ్‌లను మేనేజ్ చేయడం వంటి కొత్త ఫీచర్ల ప్రయోజనాన్ని పొందవచ్చు.

Read Also : Infinix GT 10 Pro Sale : ఇన్ఫినిక్స్ GT 10 ప్రో ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. నథింగ్ ఫోన్ మాదిరి ఫీచర్లు, ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే ఆర్డర్ పెట్టేస్తారు!

దీనిర్థం ఏమిటంటే.. మీ ఇంటిలో నివసించే వ్యక్తులు, మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఉచితంగా ఉపయోగించవచ్చు. కానీ, మీతో నివసించని వారితో మీరు షేరింగ్ చేయలేరు. నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్ చేయడానికి ప్రయత్నిస్తే.. వార్నింగ్ మెసేజ్ వస్తుంది. మీ అకౌంట్ తాత్కాలికంగా నిలిపివేయొచ్చు. మీ డివైజ్ IP అడ్రస్, అకౌంట్ కార్యకలాపాలు, రిజిస్టర్ Wi-Fi నెట్‌వర్క్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్‌లను గృహ సభ్యులు కానీ, వారితో షేరింగ్ చేస్తున్నారో లేదో మానిటరింగ్ చేయొచ్చు.

నెట్‌ఫ్లిక్స్ అకౌంట్.. సెలవులకు బయటకు వెళితే.. మీ అకౌంట్ ఇంటి వెలుపల ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కానీ, ఒక నెల కన్నా ఎక్కువ కాలం పాటు మీ ఇంటి బయట ఉండి.. వేరే లొకేషన్ నుంచి అకౌంట్ లాగిన్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్ విధానాన్ని గుర్తుచేస్తూ ఇమెయిల్ పంపుతుంది. మీరు కంపెనీకి తెలియజేయడానికి నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ప్రధాన ఇంటి లొకేషన్ మార్చవచ్చు. మీ అకౌంట్ గృహేతర సభ్యుడు ఉపయోగించడం లేదని నిర్ధారించుకోవాలి.

Netflix India ends password sharing _ Who is eligible to use it for free and who will have to pay

Netflix India ends password sharing _ Who is eligible to use it for free and who will have to pay

మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ స్నేహితుడితో షేర్ చేయడానికి ప్రయత్నిస్తే.. ఆ వ్యక్తి మీ అకౌంట్ ఉచితంగా ఉపయోగించడం కోసం కనీసం నెలకు ఒకసారి మీ ఇంటికి వెళ్లవలసి ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ నాన్-హౌస్‌హోల్డ్ మెంబర్ అని అనుకోవడానికి మీ స్నేహితుడు మీ Wi-Fi నెట్‌వర్క్‌ని ఉపయోగించి.. మీ ఇంట్లో నెట్‌ఫ్లిక్స్ ఉపయోగిస్తూ ఉండాలి.

రూ. 649 ధర కలిగిన ప్రీమియం ప్లాన్ మీ వద్ద ఉంటే.. మీ అకౌంట్ గరిష్టంగా 3 మంది సభ్యులతో మాత్రమే ఉచితంగా షేర్ చేయగలరని గుర్తుంచుకోండి. రెండు డివైజ్‌లు స్టాండర్డ్ ప్లాన్‌తో ఒక డివైజ్‌కు బేసిక్ ప్లాన్‌తో సపోర్ట్ అందిస్తుంది. మొబైల్ ప్లాన్ మీ ఫోన్, టాబ్లెట్‌లో యాక్సెస్‌ను అందిస్తుంది.

Read Also : Fire-Boltt Emerald Smartwatch : 1.09 అంగుళాల డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్‌తో ఫైర్ బోల్ట్ ఎమరాల్డ్ స్మార్ట్‌వాచ్.. ధర ఎంతంటే?