Mini Moon Earth : మన భూమికి ‘మినీ చంద్రుడు’ వస్తున్నాడు.. 2 నెలలు మనచుట్టే తిరుగుతాడు!

Mini Moon Earth : దాదాపు 2 నెలల పాటు మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడట.. ఈ అరుదైన సంఘటన ఈ నెలాఖరులో జరుగనుంది. ఒక గ్రహశకలం భూమి గురుత్వాకర్షణ పరిధిలోకి రానుంది

Mini Moon Earth : మన భూమికి ‘మినీ చంద్రుడు’ వస్తున్నాడు.. 2 నెలలు మనచుట్టే తిరుగుతాడు!

Updated On : September 14, 2024 / 11:35 PM IST

Mini Moon Earth : మన భూగ్రహానికి త్వరలో మినీ మూన్ రాబోతోంది. ఇప్పటివరకూ మనకు ఒక చంద్రుడు మాత్రమే ఉన్నాడు. ఇకపై మరో చంద్రుడు కూడా వచ్చి చేరనున్నాడు. అయితే, ఈ చంద్రుడు తాత్కాలికంగా మాత్రమే భూవాతావరణంలోనే ఉంటాడట.. ఇదే విషయాన్ని సైంటిస్టులు చెబుతున్నారు.

దాదాపు 2 నెలల పాటు మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడట.. ఈ అరుదైన సంఘటన ఈ నెలాఖరులో జరుగనుంది. ఒక గ్రహశకలం భూమి గురుత్వాకర్షణ పరిధిలోకి రానుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 25 వరకు భూమి చుట్టూ తిరుగుతుంది. ఆగష్టు 7న 2024 పీటీ5 అనే ఈ గ్రహశకలాన్ని సైంటిస్టులు కనుగొన్నారు.

చిట్టి చంద్రుడిని చూడలేమా? :
ఆస్టరాయిడ్ టెరెస్ట్రియల్-ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ (ATLAS)ని ఉపయోగించి గుర్తించారు. దీన్ని నాసా నిధులతో రూపొందించిన గ్రహశకల ప్రభావం ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా చెప్పవచ్చు. అయితే, ఈ చిన్న చంద్రుడిని నేరుగా చూడలేం.. అంతేకాదు.. టెలిస్కోప్‌తో కూడా చూడలేమని అంటున్నారు.

Read Also : Best Phones 2024 : ఈ సెప్టెంబరులో రూ. 40వేల లోపు ధరలో టాప్ ఫోన్‌లివే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

ప్రత్యేకించి ఈ చిన్న చంద్రుడిని చూడాలంటే సైంటిస్టులకే సాధ్యపడుతుందని చెబుతున్నారు. ఈ చిన్నపాటి చంద్రుడిగా వస్తున్న గ్రహశకలంపై అధ్యయనం చేయడం ద్వారా భూమి గురుత్వాక‌ర్ష‌ణ పరిధిలోకి వచ్చే వస్తువులపై (NEOs) ఎలా ప్రభావం చూపుతుంది అనేదానిపై సైంటిస్టులు మరింత పరిశోధించే అవకాశం కలుగుతుంది. అంతేకాదు.. రాబోయే రోజుల్లో గ్రహశకలాల భూమికి దగ్గరగా వచ్చినప్పుడు వాటి తీవ్రతను అంచనా వేసేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడనుంది.

మినీ మూన్ పరిమాణం ఎంతంటే? :
అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ రీసెర్చ్ నోట్స్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. రాబోయే గ్రహశకలం కేవలం 10 మీటర్ల (33 అడుగులు) వ్యాసం ఉంటుంది. భూమి చుట్టూ 53-రోజుల పాటు పరిభ్రమించనుంది. అదే వ్యవధిలో 2024 పీటీ5 పూర్తి కక్ష్యను చిట్టి చంద్రుడు పూర్తిచేయదు. దానికి బదులుగా అది భూమి గురుత్వాకర్షణ పరిధి నుంచి విడిపోనుంది.

కార్లోస్ డి లా ఫ్యూంటె మార్కోస్, రౌల్ డి లా ఫ్యూంటె మార్కోస్ రచించిన (RNAAS) నివేదికలో భూమికి గ్రహశకలాలను పట్టుకుని వాటిని తన కక్ష్యలోకి లాగేసుకుంటుందని చెప్పారు. ఈ గ్రహశకలాలు కొన్నిసార్లు మన గ్రహం చుట్టూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో తిరుగుతాయి. మరికొన్నిసార్లు, అవి కక్ష్యను పూర్తి చేసే ముందు భూమి దీర్ఘవృత్తాకార మార్గం నుంచి విడిపోతాయి.

2051లో మినీ చంద్రుడు మళ్లీ రావచ్చు :
2006లో, భూమి గురుత్వాకర్షణ ద్వారా సంగ్రహించిన ఒక ఉల్క.. దాని చుట్టూ జూలై 2006 నుంచి జూలై 2007 వరకు ఒక ఏడాది పాటు పరిభ్రమించింది. అయితే, కొత్తగా కనుగొన్న 2024 పీటీ5 2022 ఎన్ఎక్స్1 మార్గాన్ని పోలి ఉంటుంది. 1981, 2022లో భూమి చుట్టూ తిరిగే తాత్కాలిక ఫ్లైబై అనే గ్రహశకలం కనిపించింది. ఒక కక్ష్యను పూర్తి చేసి 2051లో మరో సెమీ రౌండ్‌కు తిరిగి రావచ్చు.

ఈ క్రమంలో కొన్నిసార్లు భూమి అంతరిక్ష వ్యర్థాలను తన కక్ష్యలోకి లాగవచ్చు. నివేదిక ప్రకారం.. 2024 పీటీ5 సహజమైన వస్తువు.. స్వల్పకాలిక గతిశీల పరిణామం 2022 ఎన్ఎక్స్1 ధృవీకరించిన సహజ వస్తువును పోలి ఉంటుంది. దాని కక్ష్య లక్షణాలను పరిశీలిస్తే.. అర్జున గ్రహశకలం బెల్ట్ నుంచి వచ్చిన గ్రహశకలాలను పోలి ఉన్నాయని నివేదిక సూచిస్తుంది.

Read Also : Sunita Williams : ‘మేం పనిచేయకుంటే.. ఎముకల సాంద్రతను కోల్పోతాం.. అంతరిక్షంలో సవాళ్లపై సునీతా విలియమ్స్ ఇంకా ఏమన్నారంటే?