Elon Musk : ఆ ట్విట్టర్ అకౌంట్లను డిలీట్ చేస్తున్నాం.. మీ ఫాలోవర్లు ఒక్కసారిగా తగ్గిపోవచ్చు.. ఎలన్ మస్క్ ఇంకా ఏమన్నారంటే?

Elon Musk : ట్విటర్‌లో ఏళ్ల తరబడి ఇన్‌యాక్టివ్‌గా ఉన్న అకౌంట్లను 'ప్రక్షాళన' చేస్తామని ఎలాన్ మస్క్ ట్వీట్‌లో వెల్లడించారు. అందువల్ల, త్వరలో యూజర్ల అకౌంట్ల ఫాలోవర్లు ఒక్కసారిగా తగ్గిపోవచ్చు.

Elon Musk : ప్రపంచ బిలియనీర్, ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ కొత్త యజమానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. మస్క్ చేతుల్లోకి వచ్చిన తర్వాత ట్విట్టర్ నిబంధనలు అన్ని మార్చేశాడు. 2022 నుంచి లెగసీ అకౌంట్లలో బ్లూ టిక్‌ల వరకు కొత్త రూల్స్ తీసుకొచ్చాడు. ఇప్పుడు, ట్విట్టర్ అకౌంట్లలో చాలా ఏళ్లుగా ఇన్ యాక్టివ్‌గా ఉన్న ట్విట్టర్ అకౌంట్లను పూర్తిగా డిలీట్ చేయనున్నాడు. ఈ మేరకు ఎలన్ మస్క్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.

ట్విట్టర్ అకౌంట్ల ప్రక్షాళన ఎందుకంటే? :
కొన్ని ఏళ్లుగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ట్విట్టర్ అకౌంట్లను ప్లాట్‌ఫారమ్ నుంచి ‘ప్రక్షాళన’ చేయనున్నట్లు మస్క్ ప్రకటించారు. మీ ఫాలోవర్ల లిస్టులో ఇన్‌యాక్టివ్ అకౌంట్లు ఉంటే అకౌంట్లో ఫాలోవర్ల సంఖ్య తగ్గవచ్చునని తెలిపారు. చాలా ఏళ్లుగా ఎలాంటి యాక్టివిటీ లేని అకౌంట్లను ప్రక్షాళన చేస్తున్నామన్నారు. మీరు బహుశా ఫాలోవర్ల సంఖ్య తగ్గడాన్ని చూడవచ్చునని మస్క్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read Also : Twitter Blue Tick Bug : ట్విట్టర్ కొంపముంచిన బగ్.. లెగసీ అకౌంట్లకు బ్లూ టిక్ తొలగిస్తే.. ఫ్రీగా తిరిగి ఇచ్చేసింది..!

మస్క్ ట్వీట్‌కు యూజర్లు కూడా రిప్లయ్ ఇచ్చారు. ఇలా చేయడం ద్వారా అన్ని ఇన్‌యాక్టివ్ అకౌంట్ల ‘హిస్టరీ’ ట్వీట్‌లు పోతాయని విమర్శిస్తున్నారు. వెంటనే ‘పునరాలోచించుకోవాలని ట్విట్టర్ యూజర్లు మస్క్ నిర్ణయంపై మండిపడ్డారు. దీనిపై మస్క్ రిప్లయ్ ఇస్తూ.. ట్విట్టర్ అకౌంట్లు వెంటనే ‘ఆర్కైవ్’ అవుతాయని మస్క్ తెలిపారు.

కంటెంట్ క్రియేటర్లపై మస్క్ ఏమన్నారంటే? :
మస్క్ ట్విట్టర్‌లో కంటెంట్ క్రియేటర్లకు సపోర్టు ఇస్తున్న వ్యక్తులను అభినందిస్తున్నట్లు మరో ట్వీట్‌లో మస్క్ తెలిపారు. కంటెంట్ క్రియేటర్లు మొదటి 12 నెలల పాటు తమ సంపాదనపై ఎలాంటి ఛార్జీలు ఉండవని ఆయన చెప్పారు. అయితే, ఆ తర్వాత, ప్లాట్‌ఫారమ్ ద్వారా 10 శాతం కమీషన్ వసూలు చేయనున్నట్టు మస్క్ తెలిపారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో కంటెంట్ క్రియేటర్‌లకు మీ సపోర్టు చాలా అవసరమన్నారు. మొదటి 12 నెలల పాటు సబ్‌స్క్రిప్షన్ రాబడిని ట్విట్టర్ ఉంచుకోదని, ఆ తర్వాత 10శాతం మాత్రమే ఉంచుతుందని మస్క్ పేర్కొన్నారు.

Elon Musk Twitter says inactive Twitter accounts will be deleted soon

ట్విట్టర్ ఇటీవల ప్లాట్‌ఫారమ్‌లో బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌లను ప్రవేశపెట్టింది. ట్విట్టర్ యూజర్లు తమ కంటెంట్‌ను వినియోగించుకోవడానికి వారి ఫాలోవర్ల నుంచి నెలవారీ రుసుమును వసూలు చేసేందుకు అనుమతిస్తుంది. ట్విట్టర్ సెట్టింగ్‌లలో మానిటైజేషన్‌పై క్లిక్ చేయడం ద్వారా ఫీచర్‌ని యాక్సెస్ చేయవచ్చు. గత నెలలో, మస్క్ ట్విటర్ త్వరలో పబ్లీషర్లు తమ వినియోగదారులకు ప్రతి స్టోరీ ఆధారంగా ఛార్జీ విధించేలా అనుమతిస్తుందని ధృవీకరించారు.

ప్రతి స్టోరీకి పేమెంట్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పబ్లికేషన్‌కు సబ్‌స్క్రైబర్లు కాని యూజర్లు తమ ట్విట్టర్‌లో ఆ సెక్షన్ చదవడానికి ఆసక్తి కలిగి ఉంటే నిర్దిష్ట స్టోరీకి పేమెంట్ చేసుకోవచ్చు. వచ్చే నెలలో ఈ ఫీచర్ రిలీజ్ కానుందని మస్క్ తెలిపారు. ఈ ప్లాట్‌ఫారమ్ మీడియా పబ్లిషర్‌లు, యూజర్లకు ఒక్కో స్టోరీ ఆధారంగా ఒకే క్లిక్‌తో ఛార్జీలను వసూలు చేసేందుకు అనుమతిస్తుంది. నెలవారీ సభ్యత్వం కోసం సైన్ అప్ చేయని యూజర్లు పేమెంట్ చేసేందుకు వీలు కల్పిస్తుంది.

Read Also : Poco F5 5G India : పోకో F5 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఈ రోజే లాంచ్.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చు? లైవ్ స్ట్రీమ్ చూడాలంటే?

ట్రెండింగ్ వార్తలు