Tesla in Talks : మూడు భారతీయ కంపెనీలతో టెస్లా చర్చలు.. ఎందుకంటే?
ప్రముఖ టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా స్థానిక మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. మూడు భారతీయ ఆటో కాంపోనెంట్ సరఫరాదారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.

Elon Musk's Tesla In Talks With 3 Indian Firms For Auto Components
Elon Musk Tesla : ప్రముఖ టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా స్థానిక మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రణాళికలో భాగంగా మూడు భారతీయ ఆటో కాంపోనెంట్ సరఫరాదారులతో చర్చలు జరుపుతున్నట్లు నివేదిక వెల్లడించింది. కంపెనీ క్రిటికల్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెకానికల్ కాంపోనెంట్‌ల కోసం ప్రయత్నిస్తోందని పేర్కొంది. టెస్లో కోరే విడిభాగాలలో ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌లు, విండ్‌షీల్డ్‌లు, డిఫరెన్షియల్ బ్రేక్‌లు, గేర్లు, పవర్ సీట్లు ఉన్నాయి.
సోనా కామ్‌స్టార్ లిమిటెడ్, సంధర్ టెక్నాలజీస్ లిమిటెడ్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ ఇప్పటికే టెస్లాకు విడిభాగాలను సరఫరా చేస్తున్న భారతీయ కంపెనీలలో ఒకటిగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న చర్చలపై టెస్లా స్పందించలేదు. టెస్లా ఎలక్ట్రిక్ ఆటో సంస్థ ఫస్ట్ ఇంపోర్టెడ్ వెహికల్స్‌తో సేల్ ప్రారంభించనుంది.
గత జూలైలోనే టెస్లా తమ ఫ్యాక్టరీ నుంచి త్వరలోనే కార్లను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలన్ మస్క్ వెల్లడించారు. టెస్లా.. ప్రస్తుతం దిగుమతులపై పన్నులు తగ్గించుకునేందుకు చర్చలు జరుపుతోంది. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద కార్ల మార్కెట్లలో ఒకటైన టెస్లా భారతదేశంలోనూ తమ మార్కెట్‌ను విస్తరించాలని భావిస్తోంది.