Enigma : మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. సూపర్ బ్యాటరీ.. అదిరిపోయే స్పీడ్
ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్‌లలో ఒకటైన ఎనిగ్మా ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్, తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ - 'కేఫ్ రేసర్'ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

Enigma
Enigma : భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్‌లలో ఒకటైన ఎనిగ్మా ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్, భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ – ‘కేఫ్ రేసర్’ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బైక్ బుకింగ్స్ నేటి(అక్టోబర్ 25) నుంచి ప్రారంభించింది. వినియోగదారులు కంపెనీ వెబ్ సైట్‌లో బైక్ బుక్ చేసుకోవచ్చు. కేఫ్ రేసర్ బైక్ ఎర్ల్ గ్రే, మిలిటరీ గ్రీన్, థండర్ వైట్, RMS రెడ్ లాగ్ ఆరెంజ్ రంగుల్లో విడుదల కానుంది. దీపావళికి ముందే బైక్ లాంఛ్ కానున్నట్లు అందరూ భావిస్తున్నారు. ఇది స్వదేశీ బైక్ దీని మేకింగ్ ప్లాంట్ హైదరాబాద్‌లో కూడా ఉంది.
చదవండి : Electric Car : ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 750 కి.మీ ప్రయాణం
కేఫ్ రేసర్‌లో 72V 50 Ah LifePo4 (లిథియం ఫెర్రో ఫాస్ఫేట్) బ్యాటరీని అమర్చారు, ఇది సిటీ మోడ్‌లో ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 140 KM వరకు వెళ్తుంది. గరిష్ట వేగం గంటకు 136 Kmph ఉండగా 0-80% ఛార్జ్ కోసం 3 గంటలు పూర్తి ఛార్జ్ కోసం 4 గంటల సమయం పడుతుంది. వీల్స్ కి 3 సంవత్సరాల కంటే ఎక్కువ వారంటీ ఇస్తున్నారు, బ్యాటరీకి ఐదేళ్ల వారెంటీ ఉంది.
చదవండి : Electric Scooter : బాబోయ్.. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు.. చూస్తుండగానే తగలబడిపోయింది
ఇక ఎనిగ్మా బైక్‌లను తయారీ యూనిట్, భోపాల్, మండిదీప్, ఉప్పల్ హైదరాబాద్‌లో ఉన్నాయి. ఈ బైక్ లను దేశ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 2022 నాటికి పూర్తి స్థాయి స్వదేశీ వస్తువులతో వాహనాలు తయారు చేయాలనీ టార్గెట్ గా పెట్టుంది. ఇందుకోసం స్వదేశీ లిథియం-అయాన్ బ్యాటరీ యూనిట్ ఏర్పాటుపై దృష్టిపెట్టింది.