EPF Passbook Balance : మీ ఫోన్‌లో మెసేజ్ ద్వారా ఆన్‌లైన్‌లో EPF పాస్‌బుక్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!
EPF Passbook Balance Check : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈ-పాస్‌బుక్.. సాధారణంగా EPF పాస్‌బుక్‌ను ప్రావిడెంట్ ఫండ్ (PF) అకౌంట్‌దారులకు జారీ చేస్తుంది. EPF పాస్‌బుక్‌లో వడ్డీ, విత్‌డ్రాలు మొదలైన వాటితో సహా PF అకౌంట్‌కు లింక్ చేసిన మొత్తం డేటా ఉంటుంది.

How to Check EPF Passbook Balance Check Online and through text message
EPF Passbook Balance Check : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈ-పాస్‌బుక్.. సాధారణంగా EPF పాస్‌బుక్‌ను ప్రావిడెంట్ ఫండ్ (PF) అకౌంట్‌దారులకు జారీ చేస్తుంది. EPF పాస్‌బుక్‌లో వడ్డీ, విత్‌డ్రాలు మొదలైన వాటితో సహా PF అకౌంట్‌కు లింక్ చేసిన మొత్తం డేటా ఉంటుంది. PF బ్యాలెన్స్‌లో ఖాతాదారుని PF అకౌంట్లో సంపాదించిన వడ్డీని ట్రాక్ చేసేందుకు డిజిటల్ పాస్‌బుక్ ఉపయోగపడుతుంది.
అదనంగా, ఈ-పాస్‌బుక్‌ను రుణాలు లేదా ఇతర ఆర్థిక సర్వీసుల కోసం అప్లయ్ చేసేటప్పుడు PF కాంట్రిబ్యూషన్స్ బ్యాలెన్స్ వివరాలకు ప్రూఫ్‌గా కూడా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా, PF అకౌంట్లో ఈ-పాస్‌బుక్ ఫ్యాకల్టీ EPFO పోర్టల్‌లో వారి UAN నంబర్‌ను నమోదు చేసుకున్న ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. EPFO పోర్టల్‌లో UAN నంబర్‌ను ఎలా రిజిస్టర్ చేయాలో EPF పాస్‌బుక్‌కు యాక్సస్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
EPFO పోర్టల్‌లో UANను ఎలా రిజిస్టర్ చేయాలంటే? :
– అధికారిక EPFO వెబ్‌సైట్‌ను epfindia.gov.in విజిట్ చేయండి.
– ఇప్పుడు ‘Our Services’ విభాగంలోని ‘For Employees’పై Click చేయండి.
– డ్రాప్-డౌన్ మెను నుంచి ‘UAN మెంబర్ E-Service’ ఎంపికను ఎంచుకుని, ‘Sign In’పై Click చేయండి.
– లాగిన్ పేజీలో, లాగిన్ ఫారమ్ కింద ఉన్న ‘UAN Activate’పై Click చేయండి.
– అవసరమైన ఫీల్డ్‌లలో మీ UAN, Name, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
– ‘Get Authorization PIN’పై క్లిక్ చేయండి.
– మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTPని పొందవచ్చు.
– OTPని ఎంటర్ చేసి, Submitపై క్లిక్ చేయండి.
– OTP ధృవీకరించిన తర్వాత మీ UAN అకౌంట్ కోసం పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయమని ప్రాంప్ట్ వస్తుంది. పాస్‌వర్డ్ నమోదు చేసి, ‘Submit’పై క్లిక్ చేయండి.
– ప్రాసెస్ పూర్తికాగానే మీ రిజిస్టర్ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్‌లో నిర్ధారణ మెసేజ్ పొందవచ్చు.
– మీ UAN యాక్టివేట్ అయిన తర్వాత, మీరు మీ UAN మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి మీ అకౌంట్ లాగిన్ చేయవచ్చు.
– EPFO పోర్టల్‌లో UAN నంబర్ రిజిస్టర్ పూర్తయిన తర్వాత, మీరు నమోదు చేసుకున్న 6 గంటల తర్వాత మీ EPF పాస్‌బుక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

How to Check EPF Passbook Balance Check Online and through text message
ఆన్‌లైన్‌లో EPF పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేయడం ఎలా
– EPFO పోర్టల్‌ని విజిట్ చేయండి.
– Next మెనూ బార్‌లోని ‘For Employees’ ఎంపికపై క్లిక్ చేసి, ‘Member Passbook’ ఎంచుకోండి.
– ఇప్పుడు మీ UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్), పాస్‌వర్డ్‌ను రిజిస్టర్ చేయండి.
– మీరు ఇప్పుడు మీ EPF అకౌంట్ వివరాలను చూడవచ్చు.
– మీ EPF పాస్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసేందుకు ‘డౌన్‌లోడ్ ఇ-పాస్‌బుక్’ ఆప్షన్‌పై Click చేయండి.
– మీరు E-పాస్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసే ఆర్థిక సంవత్సరాన్ని ఎంచుకుని, Captcha కోడ్‌ను నమోదు చేయండి.
– మీ EPF పాస్‌బుక్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసేందుకు ‘డౌన్‌లోడ్’పై Click చేయండి.
మీరు మీ EPF పాస్‌బుక్ బ్యాలెన్స్‌ని SMS ద్వారా Missed Call ద్వారా లేదా UMANG యాప్‌ని ఉపయోగించి కూడా చెక్ చేసుకోవచ్చు.
SMS ద్వారా EPF పాస్‌బుక్ బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేయాలి :
– SMS ద్వారా EPF పాస్‌బుక్ బ్యాలెన్స్‌ని చెక్ చేయాలంటే మీరు EPFO పోర్టల్‌లో మీ మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకున్నారని నిర్ధారించుకోండి.
– మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి < EPFOHO UAN ENG > టైప్ చేసి 7738299899కి SMS పంపండి.
– ఇంగ్లీష్, హిందీ, తమిళం, మరాఠీ, బెంగాలీ, కన్నడ, పంజాబీ, తెలుగు, మలయాళం, గుజరాతీతో సహా మొత్తం 10 భాషల్లో SMS సౌకర్యం అందుబాటులో ఉంది.
– SMSలోని చివరి 3 అక్షరాలు మీకు నచ్చిన భాషను సూచిస్తాయి.
– ఆంగ్లంలో సమాచారాన్ని పొందడానికి ENG, హిందీ కోసం టైప్ చేయాలంటే.. మీరు HIN, పంజాబీకి PUN, గుజరాతీకి GUJ, మరాఠీకి MAR, కన్నడకు KAN, తెలుగుకి TEL, తమిళం కోసం TAM, మలయాళం కోసం MAL బెంగాలీ కోసం BEN కోసం పంపాలి.
– SMS పంపిన తర్వాత కొంచెం వేచి ఉండండి.
– EPFO చివరి PF సహకారం, బ్యాలెన్స్ వివరాలు అందుబాటులో ఉన్న KYC సమాచారాన్ని కలిగిన SMSతో రిప్లయ్ ఇస్తుంది.
ఈ ఫోన్ నంబర్‌ని ఉపయోగించి EPF అకౌంట్ బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేయాలి :
మిస్డ్ కాల్ ద్వారా మీ EPF (ఉద్యోగుల భవిష్య నిధి) వివరాలను పొందడానికి మీ మొబైల్ నంబర్ మీ EPF అకౌంటుతో రిజిస్టర్ చేసుకోవచ్చు.
వివరాలను పొందాలంటే :
– మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వండి.
– మిస్డ్ కాల్ తర్వాత మీ అకౌంట్లో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్‌తో సహా మీ EPF అకౌంట్ వివరాలతో మీకు SMS వస్తుంది.
మీకు మల్టీ EPF అకౌంట్లు ఉన్నట్లయితే, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)లో యాక్టివేట్ అయిన లేటెస్ట్ అకౌంట్ వివరాలను కూడా SMS ద్వారా పొందవచ్చు.
UMANG యాప్ ద్వారా EPF పాస్‌బుక్ బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేయాలంటే? :
UMANG యాప్‌లో EPF పాస్‌బుక్ బ్యాలెన్స్‌ని చేసేందుకు ముందుగా..
– Google Play Store లేదా Apple App Store నుంచి మీ స్మార్ట్‌ఫోన్‌లో UMANG యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
– ఇప్పుడు యాప్‌ను ఓపెన్ చేసి.. EPFO (ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ఆప్షన్‌పై నొక్కండి.
– మీరు మొదటిసారి UMANG యాప్‌ని ఉపయోగిస్తుంటే.. మీరు యాప్‌లో రిజిస్టర్ చేసుకోమని అడగవచ్చు.
– రిజిస్టర్ చేసుకునేందుకు మీ మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసి ‘OTP పొందండి’ బటన్‌పై Click చేయండి.
– మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేసి, ‘Submit’పై Click చేయండి.
– ఆ తర్వాత మీ UMANG అకౌంట్ కోసం యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయండి.
– మీరు UMANG అకౌంట్ లాగిన్ అయిన తర్వాత, ‘View Passbook’ ఆప్షన్ నొక్కండి.
– మీ UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) ఎంటర్ చేసి, ‘ Get OTP’ బటన్‌పై Click చేయండి.
– ఇప్పుడు మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో అందుకున్న OTPని నమోదు చేసి, ‘Login’పై క్లిక్ చేయాలి.
– OTP ధృవీకరణ తర్వాత మీరు UMANG యాప్‌లో మీ EPF పాస్‌బుక్ బ్యాలెన్స్‌ని చూసుకోవచ్చు.