EPFO Alert : ఈపీఎఫ్ఓ బిగ్ అలర్ట్.. ఈ తేదీలోగా మీ UAN యాక్టివేట్ చేసుకోండి.. లేదంటే ఈఎల్ఐ స్కీమ్ బెనిఫిట్స్ పొందలేరు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!
EPFO Alert : ఈపీఎఫ్ఓ వినియోగదారులు ఈ తేదీలోగా యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవాలి. లేదంటే..ఈఎల్ఐ స్కీమ్ బెనిఫిట్స్ పొందలేరు. ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా యూఏఎన్ యాక్టివేట్ చేసుకోండి.

EPFO Alert
EPFO Alert : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈపీఎఫ్ఓ యూజర్లకు అలర్ట్.. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేషన్, మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకున్నారా? దీనికి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఇప్పటివరకూ యూఏఎన్, బ్యాంకు అకౌంట్ లింక్ చేయనివారికి చివరి తేదీ దగ్గరపడుతుందని ఈపీఎఫ్ఓ అప్రమత్తం చేస్తోంది. చివరి తేదీ ఫిబ్రవరి 15, 2025 అని ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈపీఎఫ్ఓ ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) స్కీమ్ కింద మరిన్ని ప్రయోజనాలను పొందడానికి యూఏఎన్ యాక్టివేషన్, బ్యాంక్ అకౌంట్లను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. ఇప్పటివరకూ మీరు ఎవరైనా ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ ద్వారా యూఏఎన్ యాక్టివేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈఎల్ఐ (ELI) స్కీమ్ అంటే ఏమిటి? :
ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించడం, జాబ్ మార్కెట్‌లో అధికారికీకరణను ప్రోత్సహించడం, ఉపాధి సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వం 2024-25 కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి ఆధారిత ప్రోత్సాహక స్కీమ్ లేదా ఈఎల్ఐ పథకాన్ని ప్రకటించింది. మొత్తం 3 స్కీమ్‌లు ఉన్నాయి.
స్కీమ్ A: ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ చేసుకున్న అధికారికంగా నమోదు చేసుకున్న రంగంలో మొదటిసారిగా ఉద్యోగం పొందే వారికి ప్రయోజకరంగా ఉంటుంది. వీరంతా మూడు వాయిదాలలో ఒక నెల వేతనం (రూ. 15వేల వరకు) అందుకుంటారు.
స్కీమ్ B : తయారీ రంగంలో ఉద్యోగ సృష్టిని ప్రోత్సహిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగులు, యజమానులు ఇద్దరికీ మొదటి 4 ఏళ్ల ఉద్యోగంలో వారి ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్‌లను తిరిగి చెల్లిస్తుంది. మొదటిసారి ఉద్యోగుల అదనపు ఉపాధిని పొందడానికి వీలు కల్పిస్తుంది.
స్కీమ్ C : పరిమితికి మించి ప్రతి అదనపు ఉద్యోగికి వారి ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ కోసం రెండు ఏళ్ల పాటు నెలకు రూ. 3వేల వరకు తిరిగి చెల్లించడం ద్వారా యజమానులకు మద్దతు అందిస్తుంది.
యూఏఎన్ (UAN) అంటే ఏమిటి? :
యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) అనేది 12 అంకెల సంఖ్య. ఇది ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ (PF) అకౌంటుకు పర్మినెంట్ నెంబర్. ఈ యూఏఎన్ ద్వారా పీఎఫ్ అకౌంట్ యాక్సస్ చేయొచ్చు.
Read Also : Topmate Startup : ఇదెక్కడి యాప్ రా బాబోయ్.. 10 నిమిషాల్లో మనుషులు డెలివరీ అట..!
యూఏఎన్ (UAN) ఎలా యాక్టివేట్ చేయాలి? :
- యూఏఎన్ యాక్టివేట్ చేయడం చాలా సులభం. మీరు చేయాల్సిందిల్లా ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో చేయడమే..
- ఈపీఎఫ్ఓ (EPFO) మెంబర్స్ పోర్టల్‌ను విజిట్ చేయండి లేదా (www.epfindia.gov.in)పై క్లిక్ చేయండి.
- ‘Our Services’ ఎంచుకుని ‘For employees’ పై క్లిక్ చేయండి.
- ‘Member UAN/Online Services’పై క్లిక్ చేయండి.
- కుడి వైపున ఉన్న ‘Important Links’ కింద ‘Activate UAN’ లింక్‌పై క్లిక్ చేయండి.
- యూఏఎన్, ఆధార్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, ఆధార్-లింక్డ్ మొబైల్ నంబర్ వంటి ప్రాథమిక వివరాలను ఎంటర్ చేయండి.
- మీ ఆధార్-లింక్డ్ మొబైల్ నంబర్‌కు OTP పొందడానికి ‘Get Authorization PIN’ పై క్లిక్ చేయండి.
- ‘I Agree’ పై క్లిక్ చేసి OTP ఎంటర్ చేయండి.
- చివరగా, ‘Validate OTP and Activate UAN’ పై క్లిక్ చేయండి.