EPFOలో వడ్డీ జమ అవుతుందో లేదో తెలుసా? మీ పాస్‌బుక్ చెక్ చేసుకోండిలా!

మీ ఈపీఎఫ్ అకౌంట్లో ప్రతినెలా వడ్డీ జమ అవుతోందా? ఎంత వడ్డీ జమ అవుతుందో తెలుసా? అయితే ఇప్పుడే చెక్ చేసుకోండి. మీ EPFO పాస్ బుక్ ద్వారా వడ్డీ ఎంతవరకు జమ అయిందో తెలుసుకోవచ్చు.

EPFOలో వడ్డీ జమ అవుతుందో లేదో తెలుసా? మీ పాస్‌బుక్ చెక్ చేసుకోండిలా!

Epfo Users Can Check Their Pf Credit Interest Fom Passbook

EPF Interest Check Passbook : మీ ఈపీఎఫ్ అకౌంట్లో ప్రతినెలా వడ్డీ జమ అవుతోందా? ఎంతవరకు వడ్డీ జమ అవుతుందో తెలుసా? అయితే ఇప్పుడే చెక్ చేసుకోండి. మీ ఈపీఎఫ్ఓ పాస్ బుక్ ద్వారా సులభంగా మీ పీఎఫ్ వడ్డీ ఎంతవరకు జమ అయిందో చెక్ చేసుకోవచ్చు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 2020-21 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీని నిర్ణయించింది. ఈ మొత్తం వడ్డీని పీఎఫ్ అకౌంటుదారులకు జమ చేస్తున్నట్టు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజషన్ (EPFO) సర్క్యులర్ జారీ చేసింది. దీపావళి సందర్భంగా EPFO ఖాతాదారుల అకౌంట్లలో వడ్డీ జమ చేస్తోంది. రూ. 25 కోట్ల EPF అకౌంట్లలో వడ్డీ జమ చేస్తున్నట్టు EPFO ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. చాలావరకు EPF అకౌంట్లలో వడ్డీ జమ అయింది. మీ ఈపీఎఫ్ అకౌంట్లలో వడ్డీ జమ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఎలా? అయితే ఈపీఎఫ్ పాస్ బుక్ చెక్ చేసుకుంటే సరి.. ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా చాలు.. ఎంత వడ్డీ వచ్చిందో తెలుసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా EPF Passbook చెక్ చేయాలి. అది ఎలాగో తెలుసుకోండి.

పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోండిలా :
EPF ఖాతాదారులు https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login వెబ్‌సైట్ విజిట్ చేయాలి.
UAN తప్పనిసరిగా ఉండాలి. మీ దగ్గర ఉన్న UAN నెంబర్ ఎంటర్ చేయాలి.
UAN యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
ఈ అకౌంట్లో వేర్వేరు మెంబర్ ఐడీలు ఉన్నాయా? ప్రస్తుత కంపెనీకి ఐడీ సెలెక్ట్ చేసుకోండి.
UAN పేజీలో Passbook Downaload కోసం ఓల్డ్ ఫార్మాట్ లేదా కొత్త ఫార్మాట్‌ ఎంచుకోవాలి.
మీకు ఏ ఫార్మాట్‌ కావాలో ఆ ఫార్మాట్‌లో పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
EPFO అకౌంట్లో జమ అయిన వడ్డీ వివరాలు ఇలా తెలుసుకోవచ్చు.

బ్యాలెన్స్ చెకింగ్ ద్వారా కూడా వడ్డీ తెలుసుకోండిలా :
EPF అకౌంట్ పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేయాల్సిన పనిలేకుండానే పీఎఫ్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మీ అకౌంట్లో వడ్డీ జమ అయిందో లేదో తెలుసుకోవచ్చు. వడ్డీ జమ కానప్పుడు మీ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో ముందే తెలిసి ఉండాలి. అప్పుడే వడ్డీ ఎంత జమ అయిందో కచ్చితంగా తెలుసుకోవచ్చు. EPF బ్యాలెన్స్ చెక్ చేయడానికి 4 రకాల పద్ధతులు ఉన్నాయి. EPFO నెంబర్‌కు Missed Call ఇవ్వవచ్చు. SMS పంపడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. UMANG యాప్, EPFO పోర్టల్‌లో కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

EPF బ్యాలెన్స్ చెక్ చేయండిలా :
SMS:
SMS ద్వారా EPF అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి EPFOHO UAN ENG అని టైప్ చేయండి.. 7738299899 అనే నెంబర్‌కు SMS పంపాలి. బ్యాలెన్స్ వివరాలు SMS ద్వారా వస్తాయి. తెలుగులో బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే EPFOHO UAN TEL అని టైప్ చేస్తే సరిపోతుంది.

Missed Call:
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు Missed Call ఇవ్వాలి. SMS ద్వారా మీ EPF అకౌంట్ వివరాలు తెలుసుకోవచ్చు.

EPFO website :
EPFO వెబ్‌సైట్‌లో బ్యాలెన్స్ తెలుసుకోనే వీలుంది. EPF పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసి బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసి ఎంత వడ్డీ వచ్చిందో సులభంగా తెలుసుకోవచ్చు. అంతేకాదు.. మీ పీఎఫ్ అకౌంట్లో ఎంత మొత్తంలో బ్యాలెన్స్ ఉంది. ప్రతీ నెలా ఎంత వడ్డీ జమ అవుతందో తెలుసుకోవచ్చు.


UMANG :
ఉమాంగ్ యాప్‌లో మీ పీఎఫ్ పాస్‌బుక్ చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో లాగిన్ కాగానే EPF పైన క్లిక్ చేయాలి. View Passbook అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత మీ UAN నెంబర్ ఎంటర్ చేయాలి.. ఆ వెంటనే OTP ఎంటర్ చేయాలి. అప్పుడు మీ పీఎఫ్ పాస్‌బుక్ డిస్ ప్లే అవుతుంది.
Read Also : EPFO : PF ఖాతాదారులకు తీపికబురు.. దీపావళి కల్లా అకౌంట్లలోకి డబ్బులు