Facebook Apology : మళ్లీ అంతరాయం, క్షమాపణలు చెప్పిన ఫేస్ బుక్

సోషల్ మీడియాలో దిగ్గజాలైన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్ లలో అంతరాయం కలుగుతుండడంతో...నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Facebook Outage Again : సోషల్ మీడియాలో దిగ్గజాలైన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్ లలో అంతరాయం కలుగుతుండడంతో…నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా కూడా నష్టాలు ఎదురవుతున్నాయి. తాజగా..ఫేస్ బుక్ మెసేంజర్, ఇన్ స్ట్రాగ్రామ్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఆయా కార్యాలయాల్లో సేవలు ఆగిపోయినట్లు సమాచారం. ఈ అంతరాయంప యూజర్లకు ఫేస్ బుక్ క్షమాపణలు చెప్పింది.

Read More : Petrol Price Hike : దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఇన్ స్ట్రాగ్రామ్ యాప్ రిఫ్రెష్ కాకపోవడం, ఫీడ్స్ ఆగిపోవడం, ఫేస్ బుక్ మెసేంజర్లు సుమారు రెండు గంటల పాటు ఆగిపోవడంతో నెటిజన్లు అసహనం, నిరుత్సాహానికి గురయ్యారు. మరలా పునరుద్ధరణ కావడంతో…నెటిజన్లు Instagram Down, #Instadown హ్యాష్‌ట్యాగులు విపరీతంగా షేర్‌ చేశారు. దీంతో ఈ హ్యాష్ ట్యాగులు ట్రెండింగ్‌లో నడుస్తున్నాయి.
ఫేస్ బుక్ సంబంధిత సేవలకు విఘాతం కలుగడం..ఈ వారంలో ఇది రెండోసారి.

Read More : Google Bans Ads: గూగుల్ కొత్త పాలసీ.. ఇలా చేస్తే మానిటైజేషన్ పోతుంది.. జాగ్రత్త!

సోమవారం రాత్రి ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్, వాట్సాప్ సేవలు సుమారు ఆరు, ఏడు గంటలు ఆగిపోవడంతో…కోట్ల మంది యూజర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇన్ని గంటలు ఆగిపోవడంతో కొంతమంది ఆర్థికంగా నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఇందులో చిరు వ్యాపారులు కూడా ఉన్నారు. అయితే..శుక్రవారం ఏర్పడిన అంతరాయం, సోమవారం ఏర్పడిన అంతరాయానికి ఒకే కారణం కాదని ఫేస్ బుక్ చెప్పింది. అంతేకానీ…కారణం ఏంటి అనేది మాత్రం చెప్పలేదు. ఇన్ స్ట్రాగ్రామ్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఓపికగా ఎదురు చూసినందుకు…యూజర్లకు కృతజ్ఞతలు తెలియచేసింది.

ట్రెండింగ్ వార్తలు