Facebook intentionally kills smartphone batteries, claims former employee
Facebook : సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లోని కొన్ని యాప్‌ల ప్రభావంతో ఫోన్ బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది అనేది సీక్రెట్ కాదు.. అందరికి తెలిసిన నిజమే.. స్మార్ట్ ఫోన్లలో యాప్స్ వినియోగం కారణంగా డేటా లోడింగ్ మాత్రమే కాదు.. బ్యాటరీ కూడా త్వరగా అయిపోతుందని వినియోగదారులు ఎక్కువగా కంప్లైట్ చేస్తుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ఉద్దేశపూర్వకంగా స్మార్ట్‌ఫోన్‌ల బ్యాటరీలను హరిస్తోందని ఫేస్‌బుక్ మాజీ ఉద్యోగి ఆరోపణలు చేశాడు. ఫేస్‌బుక్‌లో పని చేసే డేటా సైంటిస్ట్ జార్జ్ హేవార్డ్ ప్రకారం.. సోషల్ మీడియా కంపెనీ నెగటివ్ టెస్టింగ్ చేస్తోందని, తద్వారా యూజర్ సెల్‌ఫోన్ బ్యాటరీ శక్తిని రహస్యంగా హరిస్తోందని వాపోయాడు.
న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. హేవార్డ్ మాజీ కంపెనీ ఫేస్‌బుక్ ఉద్దేశపూర్వకంగా యూజర్ల ఫోన్ బ్యాటరీలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఏదైనా యాప్ ఎంత వేగంగా రన్ అవుతుంది లేదా ఎంత త్వరగా లోడ్ అవుతుంది అనేది టెస్టింగ్ చేస్తారు. ఈ టెస్టింగ్ విభిన్న ఫీచర్లు లేదా ఆయా యాప్‌లతో సమస్యలను టెస్టింగ్ చేయడానికి నిర్వహిస్తుంటారు. ఈ టెస్టింగ్ ద్వారా తమ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీపై ప్రభావం పడుతుందనే ఆలోచన యూజర్లకు తెలియదు. ఫేస్‌బుక్ కంపెనీకి వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యంలో హేవార్డ్ ఈ పద్ధతి చాలా హానికరమని పేర్కొన్నాడు. ఈ పద్ధతిని నిలిపివేయాలంటూ ఆందోళనలు కూడా చేశారు.
Facebook intentionally kills smartphone batteries
33 ఏళ్ల మాజీ ఉద్యోగి మాన్‌హాటన్ ఫెడరల్ కోర్టులో ఫేస్‌బుక్‌పై దావా వేశారు. నెగటివ్ టెస్టింగ్‌లో పాల్గొనడానికి నిరాకరించినందుకు తనను కంపెనీ నుంచి తొలగించినట్లు దావాలో వెల్లడించాడు. తాను ఫేస్‌బుక్ Messenger యాప్‌లో కొంతకాలం పనిచేశాడు. ఇది ఏ ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ లాగా ఉండదు. అందుకే ఈ టెస్టింగ్ చేయడానికి నిరాకరించానని అతను చెప్పాడు, ఫేస్‌బుక్ నెగటివ్ టెస్టింగ్ కారణంగా ప్రభావితమైన యూజర్లు ఎంతమంది ఉన్నారు అనేది కచ్చితమైన సంఖ్య తనకు తెలియదని హేవార్డ్ చెప్పారు.
ఆలోచనాపూర్వక నెగటివ్ టెస్టులను ఎలా అమలు చేయాలి అనే పేరుతో ఇంటర్నల్ ట్రైనింగ్ డాక్యుమెంట్ అందజేయడం వల్ల కంపెనీ నెగటివ్ టెస్టింగ్ ప్రారంభించిందని పేర్కొన్నాడు. తన కెరీర్‌లో ఇంతకంటే భయంకరమైన డాక్యుమెంట్‌ను తాను ఎప్పుడూ చూడలేదని చెప్పాడు. ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా, మాజీ ఉద్యోగి చేసిన ఆరోపణలను కంపెనీ ఇంకా పరిష్కరించలేదు. దీనిపై ఫేస్‌బుక్ కూడా అధికారికంగా స్పందించలేదు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..