బి అలర్ట్ : ఫేస్‌బుక్‌లో.. ఫేక్ అకౌంట్లు, పేజీలు బ్యాన్‌!

ఇప్పుడు అంతా డిజిటల్ మయం. డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ ఫాంపై ఏ సమాచారమైనా క్షణాల్లో చేరిపోతుంది. ఏదో ఫేక్ న్యూస్.. ఏది ఫాక్ట్.. అనేది తెలుసుకోవడం కష్టంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా రారాజు ఫేస్ బుక్.. ఫేక్ అకౌంట్, ఫేక్ న్యూస్ పై కన్నెర్ర చేసింది.

  • Published By: sreehari ,Published On : January 11, 2019 / 07:47 AM IST
బి అలర్ట్ : ఫేస్‌బుక్‌లో.. ఫేక్ అకౌంట్లు, పేజీలు బ్యాన్‌!

ఇప్పుడు అంతా డిజిటల్ మయం. డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ ఫాంపై ఏ సమాచారమైనా క్షణాల్లో చేరిపోతుంది. ఏదో ఫేక్ న్యూస్.. ఏది ఫాక్ట్.. అనేది తెలుసుకోవడం కష్టంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా రారాజు ఫేస్ బుక్.. ఫేక్ అకౌంట్, ఫేక్ న్యూస్ పై కన్నెర్ర చేసింది.

ఇప్పుడు అంతా డిజిటల్ మయం. డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ ఫాంపై ఏ సమాచారమైనా క్షణాల్లో చేరిపోతుంది. ఏది ఫేక్ న్యూస్.. ఏది ఫాక్ట్.. అనేది తెలుసుకోవడం కష్టంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా రారాజు ఫేస్ బుక్.. ఫేక్ అకౌంట్, ఫేక్ న్యూస్ పై కన్నెర్ర చేసింది. ఫేస్ బుక్ పాలసీలను అతిక్రమించినవారిని ఊపేక్షించడం లేదు. ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేస్తున్న సంస్థల ఫేస్ బుక్ పేజీలను బ్యాన్ చేస్తోంది. శుక్రవారం ఫిలిప్పైన్ కు చెందిన ఓ డిజిటల్ మార్కెంటింగ్ గ్రూపును బ్యాన్ చేసినట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. ట్విన్ మార్క్ మీడియా ఎంటర్ ప్రైజేస్ అనే డిజిటల్ మార్కెంటింగ్ గ్రూపు ఫేస్ బుక్ పాలసీలను అతిక్రమించిందనే కారణంతో ఆ సంస్థ అకౌంట్లు, పేజీలను తొలగించినట్టు ఫేస్ బుక్ ఇంక్ తెలిపింది. 

ఈ మేరకు ఫేస్ బుక్ తమ బ్లాగ్ లో పోస్టు చేసినట్టు తెలిపింది. ఇప్పటివరకూ ఫేస్ బుక్ 220 ఫేస్ బుక్ పేజీలు, 73 ఫేస్ బుక్ ఫేక్ అకౌంట్లు, 29 ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లను తొలిగించినట్టు పేర్కొంది. ట్విన్ మార్క్ డిజిటల్ మీడియా సంస్థ.. ప్రాఫిట్ కోసం.. తమ సంస్థ పేరుతో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి అందులో ప్రొడక్ట్స్ ను సేల్ చేసేందుకు కస్టమర్లకు పేజీల యాక్సెస్ ఇస్తోందని గుర్తించినట్టు తెలిపింది. ఇలాంటి సర్వీసులను ఫేస్ బుక్ ఎన్నడూ  ప్రొత్సహించదు. ఫేస్ బుక్ ప్లాట్ ఫాంపై ఇలాంటి చర్యలకు పాల్పడితే తక్షణమే ఆయా గ్రూపు అకౌంట్లు, పేజీలను తొలగిస్తామని హెచ్చరించింది. ఫేక్ న్యూస్ పోస్టు చేయడమే కాకుండా ఎన్నిసార్లు హెచ్చరించినా పదేపదే స్పామ్ ను ఫేస్ బుక్ పేజీల్లోకి స్ర్పెడ్ చేస్తున్నారని, అందుకే సదరు సంస్థ అకౌంట్లను బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఫేస్ బుక్ ఇంక్ వెల్లడించింది. 

ఫేస్ బుక్ బ్యాన్ చేసిన అకౌంట్లు, పేజీల వివరాలు..
ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ : 220 ఫేస్ బుక్ పేజీలు, 73 ఫేస్ బుక్ అకౌంట్లు, 29 ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లను తొలగించింది. 
– ఈ ఫేస్ బుక్ పేజీల్లో ఒకదానికి 43 మిలియన్ల అకౌంట్లు ఫాలోవర్లుగా ఉన్నారు. 

ట్విన్ మార్క్ డిజిటల్ మార్కెటింగ్ సంస్థ అడ్మిన్ రైట్స్ ను ఇతరులకు అమ్ముతున్నట్టు ఫేస్ బుక్ ప్రత్యేక విచారణలో ధృవీకరించినట్టు తెలిపింది. స్పామ్ పాలసీలను అతిక్రమిస్తూ సదరు సంస్థ ప్రాఫిట్ సంపాదిస్తోందని గుర్తించినట్టు పేర్కొంది. అప్పటినుంచి ఈ సంస్థ కార్యకలాపాలపై కన్నేసి ఉంచినట్టు తెలిపింది. అందుకే ఫేస్ బుక్ ప్లాట్ ఫాంపై ఇలాంటి చర్యలకు పాల్పడినవారి అకౌంట్లు, పేజీలను తొలగిస్తున్నట్టు ఫేస్ బుక్ ఇంక్ స్పష్టం చేసింది. ఫేస్ బుక్ పేజీల్లో స్పామ్ కు పాలసీలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఫేస్ బుక్ రివీల్ చేసింది. ఫేజీల్లో ఫాలోవర్లు పెరగగానే పేజీలపై పేర్లను మార్చేస్తున్నారని, ఫేక్ న్యూస్ కంటెంట్ ను స్ప్రెడ్ చేస్తున్నట్టు గుర్తించామని ఇది పేజ్ పాలసీలను అతిక్రమించడమే కాదు పేజీ పాలోవర్లను తప్పుదోవ పట్టించడమే అవుతుందని ఫేస్ బుక్ బ్లాగ్ పోస్టులో అభిప్రాయపడింది.