ఫేస్‌బుక్‌.. ప్రైవసీ ఇదేనా? : 15 లక్షల యూజర్ల ‘ఈమెయిల్స్’ ఇంపోర్ట్

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లో యూజర్ల ప్రైవసీ ఇష్యూ మరొకటి వెలుగులోకి వచ్చింది. యూజర్ల అనుమతి లేకుండా వారి ఈమెయిల్ కాంటాక్టులను ఫేస్ బుక్ తమ డేటా సిస్టమ్స్ లో అప్ లోడ్ చేసింది.

  • Published By: sreehari ,Published On : April 19, 2019 / 11:57 AM IST
ఫేస్‌బుక్‌.. ప్రైవసీ ఇదేనా? : 15 లక్షల యూజర్ల ‘ఈమెయిల్స్’ ఇంపోర్ట్

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లో యూజర్ల ప్రైవసీ ఇష్యూ మరొకటి వెలుగులోకి వచ్చింది. యూజర్ల అనుమతి లేకుండా వారి ఈమెయిల్ కాంటాక్టులను ఫేస్ బుక్ తమ డేటా సిస్టమ్స్ లో అప్ లోడ్ చేసింది.

కాలిఫోర్నియా:  ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లో యూజర్ల ప్రైవసీ ఇష్యూ మరొకటి వెలుగులోకి వచ్చింది. యూజర్ల అనుమతి లేకుండా వారి ఈమెయిల్ కాంటాక్టులను ఫేస్ బుక్ తమ డేటా సిస్టమ్స్ లో అప్ లోడ్ చేసింది. ఫేస్ బుక్ డేటా సిస్టమ్స్ లో ఇప్పటివరూ ఎలాంటి లూప్ హోల్ గుర్తించలేదు. అయినప్పటికీ యూజర్ల ప్రైవసీ డేటాను ఫేస్ బుక్ డేటా సిస్టమ్స్ లో అప్ లోడ్ అయినట్టు ఓ సెక్యూరిటీ రీసెర్చర్ గుర్తించారు.
Also Read : Voiceతోనే టైపింగ్ : వచ్చే ఐదేళ్లలో Keyboards ఉండవు

మే 2016 నుంచి ఫేస్ బుక్ డేటా సిస్టమ్స్ లో 1.5 మిలియన్లు (15లక్షలు) కొత్త యూజర్లు ఈమెయిల్ కాంటాక్ట్స్ ను అప్ లోడ్ చేసినట్టు రీసెర్చర్ తెలిపారు. కొత్త యూజర్లు ఫేస్ బుక్ లో SignUp ప్రాసెస్ లో భాగంగా వారి ఈ మెయిల్ వివరాలను అడుగుతారు. 

అయితే 2019 మార్చిలో ఫేస్ బుక్.. కొత్త యూజర్ల సైన్ అప్ అయ్యే సమయంలో ఈమెయిల్ పాస్ వర్డ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ను నిలిపివేసింది. ఇలాంటి సమయాల్లోనే అనుకోకుండా ఫేస్ బుక్ డేటా సిస్టమ్స్ లో కొత్త యూజర్ల ఈమెయిల్ కాంటాక్ట్స్ అప్ లోడ్ అయినట్టు కంపెనీ వెల్లడించింది. ‘ఇప్పటివరకూ 1.5 మిలియన్ల యూజర్ల ఈమెయిల్ కాంటాక్టులు అప్ లోడ్ అయినట్టు అంచనా వేస్తున్నాం.

ఈ కాంటాక్ట్ లను ఎవరితోనూ షేర్ చేయలేదు. యూజర్ల ఈమెయిల్ కాంటాక్టులను డిలీట్ చేస్తున్నాం’ అని ఫేస్ బుక్ తెలిపింది. అంతేకాదు.. కాంటాక్ట్స్ ఇంపోర్ట్ అయిన యూజర్లకు త్వరలో నోటిఫై చేస్తామని, యూజర్లకు కలిగిన ఈ అవాంతరాన్ని ఫిక్స్ చేస్తున్నామని ఒక ప్రకటనలో వెల్లడించింది.
Also Read : చెక్ చేశారా? : ఇన్ స్టాగ్రామ్‌లో.. మీ Likes కనిపించవు

సోషల్ మీడియా కంపెనీ ఫేస్ బుక్.. కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసిన యూజర్ల ఈమెయిల్ కాంటాక్టులను వారి అనుమతి లేకుండా కంపెనీ ఇంపోర్ట్ చేసినట్టు ఇటీవల ఓ రిపోర్టు తెలిపింది. ఫేస్ బుక్ లాగిన్ అకౌంట్ ఆప్షన్ పై.. ఈ-మెయిల్, పాస్ వర్డ్ ఎంటర్ చేయగానే.. ‘ఇంపోర్టింగ్’అవుతున్నట్టుగా ఓ Pop-Up మెసేజ్ వస్తోందని, అది యూజర్ల అనుమతి లేకుండానే అవుతున్నట్టు రిపోర్ట్ పేర్కొంది.

ఇటీవల యూజర్ల ప్రైవసీకి సంబంధించి ఇష్యూ ఫేస్ బుక్ ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్లెయిన్ టెక్స్ట్ లో మిలియన్ల మంది యూజర్ల పాస్ వర్డులను సంస్థ ఉద్యోగులకు కనిపించేలా బహిర్గతం చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. 
Also Read : 240 క్రిమినల్ కేసులు : 4 పేజీల యాడ్ : బీజేపీ టికెట్ పై పోటీ