Fake OTP Delivery Scam : ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారా? ఇదో కొత్త ఫేక్ OTP డెలివరీ స్కామ్‌.. మీ ఇంటికే వచ్చి డబ్బులు దోచేస్తారు జాగ్రత్త..!

Fake OTP Delivery Scam : మీరు ఆన్‌లైన్‌లో ఏదైనా షాపింగ్ చేస్తున్నారా? ఆన్‌లైన్ డెలివరీ మోసాలతో తస్మాత్ జాగ్రత్త.. ఇటీవల డెలివరీ పేరుతో ఇంటికి వచ్చి ఫేక్ OTP ద్వారా డబ్బలు కాజేస్తున్నారు..

Fake OTP Delivery Scam : ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారా? ఇదో కొత్త ఫేక్ OTP డెలివరీ స్కామ్‌.. మీ ఇంటికే వచ్చి డబ్బులు దోచేస్తారు జాగ్రత్త..!

Do you shop online_ Beware of fake OTP delivery scam or you will lose money

Updated On : December 27, 2022 / 5:15 PM IST

Fake OTP Delivery Scam : మీరు ఆన్‌లైన్‌లో ఏదైనా షాపింగ్ చేస్తున్నారా? ఆన్‌లైన్ డెలివరీ మోసాలతో తస్మాత్ జాగ్రత్త.. ఇటీవల డెలివరీ పేరుతో ఇంటికి వచ్చి ఫేక్ OTP ద్వారా డబ్బలు కాజేస్తున్నారు.. ఇలాంటి ఆన్‌లైన్ మోసాలను నివారించేందుకు ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వంటి ప్లాట్ ఫారంలు వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) డెలివరీ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించాయి. ఈ ప్రక్రియలో, కస్టమర్‌లు తమ డెలివరీ ప్యాకేజీని చెక్ చేసి, ప్యాకేజీని స్వీకరించాల్సి ఉంటుంది. ఆ సమయంలో మీ ఫోన్‌లో వచ్చిన OTPని డెలివరీ ఏజెంట్‌లతో షేర్ చేయాల్సి ఉంటుంది. ఫేక్ డెలివరీలపై ఆన్‌లైన్ మోసాన్ని నిరోధించడానికి OTP డెలివరీ సురక్షితమైన మార్గంగా మారింది.

మరోవైపు OTP ప్యాకేజీ డెలివరీ స్కామ్ ద్వారా మరొక ఆన్‌లైన్ మోసానికి తెరలేపారు సైబర్ మోసగాళ్లు.. ఇప్పుడు ఈ ఫేక్ OTP డెలవరీ స్కామ్ ద్వారా వినియోగదారుల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. వినియోగదారులను లక్ష్యంగా ఎల్లప్పుడూ కొత్త మార్గాలను స్కామర్‌లు అన్వేషిస్తున్నారు. ఇప్పుడు డెలివరీ ఏజెంట్లుగా మారుతూ వినియోగదారుల నుంచి డబ్బును దోచుకుంటున్నారు. ఇప్పటివరకూ నివేదించిన కేసుల ప్రకారం.. ఈ స్కామర్‌లు డెలివరీ ఏజెంట్‌లుగా ఇంటింటికి వస్తున్నారు. డెలివరీకి ముందు వినియోగదారులను OTP అడుగుతారు. ఎవరైనా OTPని షేర్ చేసిన తర్వాత స్కామర్‌లు వారి ఫోన్‌ను క్లోన్ చేస్తారు లేదా బ్యాంక్ అకౌంట్ల నుంచి వారి సున్నితమైన డేటాకు యాక్సెస్ పొందుతారు.

ఫేక్ OTP డెలివరీ స్కామ్ అంటే ఏమిటి :
ఆన్‌లైన్ స్కామర్‌లు.. ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ల నుంచి ఎక్కువ షాపింగ్ చేసే యూజర్లే లక్ష్యంగా చేసుకుంటున్నారు. డెలివరీ ప్యాకేజీలను తరచుగా స్వీకరించే యూజర్లపై నిఘా పెడతారు. డెలివరీ ఏజెంట్లుగా నటిస్తూ వారి ఇంటి వద్ద వస్తారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లేదా పోస్ట్ ఆఫీస్ వంటి అతిపెద్ద ఈ-కామర్స్ సైట్ల నుంచి వచ్చి తమ ప్యాకేజీలను డెలివరీ చేస్తున్నామని స్కామర్లు నమ్మిస్తారు. పే-ఆన్ డెలివరీ (Pay On Delivery) పార్శిల్ అంటూ డబ్బు అడుగుతారు. యూజర్ డెలివరీ ప్యాకేజీని స్వీకరించడానికి నిరాకరిస్తే.. డెలివరీని Cancel చేస్తున్నట్లుగా వ్యవహరిస్తారు.

Read Also : Electricity Bill Scam : కరెంట్ బిల్లు కట్టలేదంటూ మీ ఫోన్‌కు ఇలా మెసేజ్ వచ్చిందా? ఇదో పెద్ద స్కామ్.. ఆ లింక్ క్లిక్ చేయొద్దు.. తస్మాత్ జాగ్రత్త..!

డెలివరీ లేదా రద్దును ప్రాసెస్ చేయడానికి స్కామర్‌ OTP కోసం అడుగుతారు. అక్కడే యూజర్లను మోసగిస్తారు. తెలియని యూజర్లు తమ స్కామర్లకు OTP ఇవ్వడం లేదా ఫోన్‌లో వచ్చిన లింక్‌పై క్లిక్ చేసి మోసపోతుంటారు. స్కామర్‌లు OTPని స్వీకరించిన తర్వాత వారు ఫోన్‌ను క్లోన్ చేస్తారు లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలను యాక్సెస్ చేసేందుకు హ్యాక్ చేస్తారు. బాధితుడి అకౌంట్ నుంచి డబ్బును దొంగిలిస్తారు. కొన్నిసార్లు, ఈ స్కామర్‌లు లక్ష్యంగా చేసుకున్న యూజర్లు పొరుగువారిని సంప్రదించి, వ్యక్తికి కాల్ చేసి OTP ఇవ్వాలని లేదా తరపున పేమెంట్ చేయమని అడుగుతారు. ఆ సమయంలో వినియోగదారులు పెద్దగా ఒత్తిడి చేయరు.. వెంటనే నమ్మేసి వారికి OTP చెప్పేస్తారు.. అంతే.. యూజర్ల బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులను కాజేస్తారు.

Do you shop online_ Beware of fake OTP delivery scam or you will lose money

Do you shop online_ Beware of fake OTP delivery scam or you will lose money

ఫేక్ OTP డెలివరీ స్కామ్‌ను ఎలా నిరోధించాలంటే? :

* OTPని ఎవరితోనూ Share చేయవద్దు. OTP విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
* ఎవరైనా ఏదైనా PIN కోసం అడిగితే.. ఆ వ్యక్తి ఐడెంటీని వెరిఫై చేసుకోవాలి.
* కొన్నిసార్లు డెలివరీ కంపెనీలు డెలివరీకి ముందు Code పంపుతాయి.
* నగదు ఇవ్వడం లేదా డెలివరీని నిర్ధారించే ముందు ఎల్లప్పుడూ డెలివరీ పార్శిల్‌ను ఓపెన్ చేయండి.
* అనుమానిత లింక్‌లపై ఎప్పుడూ Click చేయవద్దు లేదా మీ వ్యక్తిగత సమాచారాన్ని వెబ్‌సైట్‌లకు అందించవద్దు.
* మీరు అనుమానాస్పద డెలివరీని స్వీకరిస్తే.. దానిని అంగీకరించవద్దు.
* మీ పార్శిల్‌ను ఎల్లప్పుడూ Track చేయండి.
* మీరు ప్యాకేజీ డెలివరీని పొందాలంటే.. మీ కుటుంబ సభ్యులకు కూడా దాని గురించి తెలియజేయండి.
* Pay on Delivery ప్రక్రియను నివారించడానికి మీ కొనుగోళ్లకు ఆన్‌లైన్ Payments చేసేందుకు ప్రయత్నించండి.
* స్కామర్‌లు వినియోగదారులను మోసం చేయడానికి కొత్త ట్రిక్స్‌ని చేర్చడానికి ప్రయత్నిస్తారని గుర్తుంచుకోండి.
* ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి. మీ ప్రియమైన వారికి స్కామ్‌ల గురించి అవగాహన కల్పించండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : QR Code Scam : QR కోడ్ స్కామ్‌తో తస్మాత్ జాగ్రత్త.. ఇలాంటి స్కామర్ల నుంచి ఎలా సేఫ్‌గా ఉండాలి? ఎలా గుర్తించాలో తెలుసా?