FASTag Tolltax : మీ వెహికల్‌కు ఫాస్ట్ ట్యాగ్ సరిగా ఫిక్స్ చేశారా? చెక్ చేసుకోండి.. డబుల్ టోల్ ఫీ చెల్లించాల్సిందే!

FASTag Tolltax : వెహికల్ ముందు విండ్‌షీల్డ్‌పై ఫాస్ట్‌ట్యాగ్ సరిగ్గా అమర్చకుండా జాతీయ రహదారులపై టోల్ లేన్‌లలోకి ప్రవేశించే కార్ల వినియోగదారుల నుంచి టోల్ పన్ను రెట్టింపు వసూలు చేయనుంది.

FASTag Tolltax : మీ వెహికల్‌కు ఫాస్ట్ ట్యాగ్ సరిగా ఫిక్స్ చేశారా? చెక్ చేసుకోండి.. డబుల్ టోల్ ఫీ చెల్లించాల్సిందే!

FASTag not properly affixed on car ( Image Source : Google )

FASTag Tolltax : మీకు ఫాస్ట్‌ట్యాగ్ ఉందా? అయితే, బీ అలర్ట్.. మీ వెహికల్‌కు ఫాస్ట్ ట్యాగ్ సరిగా అమర్చుకోండి.. లేదంటే అంతే సంగతులు.. మీరు చెల్లించాల్సిన టోల్ ఫీజు కన్నా రెట్టింపు చెల్లించాల్సి వస్తుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఇటీవల కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

Read Also : Sony Bravia 3 TV Series : కొత్త స్మార్ట్ టీవీ చూశారా? సోనీ బ్రావియా 3 టీవీ సిరీస్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

దీని ప్రకారం.. వెహికల్ ముందు విండ్‌షీల్డ్‌పై ఫాస్ట్‌ట్యాగ్ సరిగ్గా అమర్చకుండా జాతీయ రహదారులపై టోల్ లేన్‌లలోకి ప్రవేశించే కార్ల వినియోగదారుల నుంచి టోల్ పన్ను రెట్టింపు వసూలు చేయనుంది. జాతీయ రహదారిపై వెళ్లే వాహనం విండ్‌షీల్డ్‌పై ఉద్దేశపూర్వకంగా ఫాస్ట్‌ట్యాగ్‌ని బిగించకుండా నిరోధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఫాస్ట్‌ట్యాగ్‌ని అమర్చకపోవడం వల్ల టోల్ ప్లాజాల వద్ద అనవసర జాప్యాలు జరుగుతాయి.

ఫాస్ట్ ట్యాగ్ లేకుంటే భారీ జరిమానాలు :
ఫ్రంట్ విండ్‌షీల్డ్‌పై ఫాస్ట్‌ట్యాగ్‌ని బిగించని పక్షంలో వినియోగదారుల రుసుమును రెట్టింపు వసూలు చేయడానికి ఎన్‌హెచ్ఏఐ రుసుము సేకరణ ఏజెన్సీలు, రాయితీదారులకు వివరణాత్మక ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను (SOPs) జారీ చేసింది. అన్ని వినియోగదారు రుసుము ప్లాజాల వద్ద కూడా సమాచారాన్ని ప్రదర్శించనుంది.

హైవే వినియోగదారులకు నిర్ణీత ఫాస్ట్‌ట్యాగ్ లేకుండా టోల్ లేన్‌లోకి ప్రవేశించనందుకు జరిమానాలను విధించనుంది. అదనంగా, ఫీజు ప్లాజా వద్ద వాహన రిజిస్ట్రేషన్ నంబర్ (VRN)తో కూడిన సీసీటీవీ ఫుటేజీని అతికించని ఫాస్ట్‌ట్యాగ్ కేసులను నమోదు చేస్తుందని ఎన్‌‌హెచ్ఏఐ అధికారిక ప్రకటనలో పేర్కొంది. వసూలు చేసిన రుసుము, వసూలు చేయడంపై సరైన రికార్డును నిర్వహించడంలో సాయపడుతుంది.

ప్రామాణిక ప్రక్రియ ప్రకారం.. కేటాయించిన వాహనంపై స్టిక్ చేయని ఏదైనా ఫాస్ట్‌ట్యాగ్ యూజర్-ఫీజు ప్లాజాలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ETC) ఫీజు చెల్లించలేరు. అప్పుడు దానికి రెట్టింపు టోల్ రుసుమును చెల్లించవలసి ఉంటుంది. అంతేకాదు.. మీ ఫాస్ట్ ట్యాగ్ కూడా బ్లాక్‌లిస్ట్ చేస్తుంది. వివిధ పాయింట్-ఆఫ్-సేల్ (POS) నుంచి జారీ చేసే సమయంలో ముందు విండ్‌షీల్డ్‌పై కేటాయించిన వాహనానికి ఫాస్ట్‌ట్యాగ్‌ని తప్పనిసరిగా ఉండేలా జారీచేసే బ్యాంకులకు సూచించిందని ఎన్‌హెచ్ఏఐ పేర్కొంది.

ఎన్‌హెచ్ఏఐ జాతీయ రహదారులపై వినియోగదారు రుసుమును జాతీయ రహదారి రుసుము (రేట్లు, వసూళ్ల నిర్ణయం) నియమాలు, 2008 ప్రకారం సేకరిస్తుంది. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా సుమారు 1,000 టోల్ ప్లాజాల వద్ద సుమారు 45వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలకు వినియోగదారు రుసుము వసూలు చేస్తుంది.

Read Also : Tata Curvv Launch : హ్యుందాయ్, మారుతి గ్రాండ్ విటారాకు పోటీగా టాటా కర్వ్ వచ్చేస్తోంది.. ఆగస్టు 7నే లాంచ్.. కీలక ఫీచర్లు ఇవే!