మోడీ బర్త్‌డే స్పెషల్ : NaMo యాప్‌లో కొత్త అప్‌డేట్ ఇదే

  • Published By: sreehari ,Published On : September 16, 2019 / 02:19 PM IST
మోడీ బర్త్‌డే స్పెషల్ : NaMo యాప్‌లో కొత్త అప్‌డేట్ ఇదే

Updated On : September 16, 2019 / 2:19 PM IST

సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ 69వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా NaMo యాప్ లో కొత్త అప్ డేట్ రిలీజ్ అయింది. అదే.. NaMo Exclusive. నమో యాప్ ఫాలో అయ్యే యూజర్లు ఈజీగా మోడీ జన్మదిన వేడుకలను జరుపుకోవచ్చు. నమో యాప్ ట్రాఫిక్ పెరిగేందుకు న్యూ ఫాస్టర్ అండ్ స్లీకర్ వెర్షన్ లాంచ్ చేశారు.

ప్రధాని మోడీనే స్వయంగా సోమవారం (సెప్టెంబర్ 16) ట్విట్టర్ వేదికగా NaMo Appలో కొత్త అప్ డేట్ వచ్చినట్టు ప్రకటించారు. ‘నమో యాప్ లో కొత్త అప్ డేట్ వచ్చింది. ఇదెంతో వేగవంతమైనది. ప్రత్యేకించి ఈజీగా కంటెంట్ యాక్సస్ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్లు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. కొత్త వెర్షన్ యాప్ వెంటనే పొందండి’ అని మోడీ ట్వీట్ చేశారు. పీఎం మోడీ గురించి రోజువారీ అప్ డేట్స్ తెలుసుకోనేందుకు ఈ మొబైల్ యాప్ ను ప్రవేశపెట్టారు. 

మోడీ ఫాలోవర్ల కోసం నమో యాప్ లో కొత్త ఫీచర్లు రిలీజ్ అయ్యాయి. వన్ టచ్ నేవిగేషన్, న్యూ కంటెంట్ సెక్షన్ ‘నమో ఎక్స్ క్లూజీవ్’ పేరుతో అప్ డేట్స్ రిలీజ్ చేశారు. యూజర్ల ఆసక్తి బట్టి కంటెంట్ మార్పులు చేయడం జరుగుతుంది. 2015లో నరేంద్ర మోడీ ఈ నమో యాప్ ను ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ యాప్ కు వివిధ ప్లాట్ ఫాం నుంచి 1.5కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఏ రాజకీయ నేతకు రాని అత్యంత పాపులారిటీ మోడీకి ఉన్నట్టు అధికారిక ప్రకటన తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఈమెయిల్స్, మెసేజ్ లను నేరుగా నమో యాప్ ద్వారా పొందే అవకాశం ఉంది. ఈ యాప్ లో వివిధ పీఎం.. మన్ కి బాత్ ఎడిషన్స్ కూడా యూజర్లు వినవచ్చు. బయోగ్రఫీ సెక్షన్ లో ఆయన బ్లాగులు సహా ఇతర ఆసక్తికరమైన విషయాలను కూడా తెలుసుకోవచ్చు.