Festive Sales : ఈ కామర్స్ కంపెనీలకు పండుగే పండుగ…వేల కోట్లలో అమ్మకాలు

ఫెస్టివల్‌ సీజన్‌లో రెండు సంస్థలు అమ్మకాలు ఏ విధంగా జరిపిందనే విషయాలపై రెడ్‌సీర్‌ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ప్రతి గంటకు 68 కోట్ల రూపాయల స్మార్ట్‌ ఫోన్లు అమ్ముడయ్యాయి.

Festive Sales : ఈ కామర్స్ కంపెనీలకు పండుగే పండుగ…వేల కోట్లలో అమ్మకాలు

Festival Sale

Updated On : October 16, 2021 / 2:09 PM IST

Redseer : దసరా ఫెస్టివల్‌ సీజన్‌ ఈ కామర్స్‌ కంపెనీలకు వరంగా మారింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు ఫెస్టివల్‌ సేల్స్‌ ప్రారంభించిన మొదటి వారంలోనే వేలకోట్లలో అమ్మకాలు జరిపినట్లు ప్రముఖ కన్సెల్టింగ్‌ సంస్థ రెడ్‌సీర్‌ పేర్కొంది. ఫ్లిప్‌ కార్ట్‌ అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 10 వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహించింది. అమెజాన్ అక్టోబర్ 4 నుంచి గ్రేట్ ఇండియా ఫెస్టివల్‌ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌ నెల రోజుల పాటు కొనసాగుతుంది.

Read More : Tamil Nadu : జయలలితకు నివాళి, శశికళ కంటతడి

ఈ సందర్భంగా దసరా ఫెస్టివల్‌ సీజన్‌లో ఈ రెండు సంస్థలు అమ్మకాలు ఏ విధంగా జరిపిందనే విషయాలపై రెడ్‌సీర్‌ రిపోర్ట్‌ను విడుదల చేసింది. డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్‌ ఆఫర్లు ప్రకటించడంతో భారీ కొనుగోళ్లు జరిపినట్లు వెల్లడించింది. మొదటి వారంలోనే 32 వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయని, ప్రతి గంటకు 68 కోట్ల రూపాయల స్మార్ట్‌ ఫోన్లు అమ్ముడైనట్లు రిపోర్టులో పేర్కొంది.

Read More : Android Phones Hack: మీ ఫోన్‌లో వైరస్ ఇలా గుర్తించండి.. వెంటనే తీసేయండి..!

ఈ సంవత్సరం అమెజాన్‌ కంటే ఫ్లిప్‌కార్ట్ అమ్మకాలు ఎక్కువ జరిపినట్లు తేలింది. పండుగ సేల్స్‌లో ఫ్లిప్‌ కార్ట్‌ మార్కెట్ వాటా 64 శాతానికి దగ్గరగా ఉండగా.. అమెజాన్‌ వాటా తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఇక కరోనా కారణంగా గతేడాది కొనుగోళ్లు తగ్గినా.. ఈ ఏడాది మాత్రం పెరిగాయి. ఇక గతేడాది ప్రతి కస్టమర్ కొనుగోలు సగటు 4 వేల 980 ఉండగా  ఈ ఏడాదిలో 5 వేల 34కి పెరిగినట్లు రెడ్‌సీర్ తెలిపింది.