First Cell Phone Call : ఫస్ట్ సెల్‌ఫోన్ కాల్‌కు 50 ఏళ్లు.. ఏ కంపెనీ ఫోన్ నుంచి ఎవరికి.. ఎవరు చేశారు? ఇప్పుడు వాడే ఫోన్ అప్పట్లో ఎలా ఉండేదో తెలుసా?
First Cell Phone Call : ఫస్ట్ సెల్ ఫోన్ కాల్ చేసి నేటికి 50 ఏళ్లు పూర్తవుతుంది. సరిగ్గా ఇదే రోజున ఏ కంపెనీ ఫోన్ నుంచి ఎవరూ ఎవరికి ఫోన్ చేశారో తెలుసా? పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

First Cell Phone Call (Photo : Google)
First Cell Phone Call : ఎవరైనా టెలిఫోన్ (Telphone) ఎవరు కనిపెట్టారు అనగానే.. అందరూ అలెగ్జాండర్ గ్రహంబెల్ (Alexander Graham Bell) అని చెప్పేస్తారు. ఇంతకీ సెల్ ఫోన్ ఎవరు కనిపెట్టారో తెలుసా? అసలు ఎప్పటి నుంచి మొబైల్ ఫోన్ కాల్స్ (Mobile Phone Calls) ప్రారంభమయ్యాయో తెలుసా? ఫస్ట్ మొబైల్ ఫోన్ కాల్ ఎవరూ చేశారు? ఎప్పుడు ఎక్కడా? చేశారంటే చాలామందికి తెలియకపోవచ్చు. వాస్తవానికి ఒకప్పుడు సెల్ ఫోన్ ఎంత సైజులో ఉండేది.. ఎంత బరువు ఉండేది.. అసలు ఎలా ఫోన్ పట్టుకునేవారు ఎలా వాడేవారు? మొబైల్ ఫోన్ ఏ కంపెనీ ముందుగా ప్రపంచానికి పరిచయం చేసిందో తెలుసా? ఇప్పుడు, మీరు వాడే స్మార్ట్ ఫోన్లు చాలా చిన్నదిగా అరచేతిలో ఇమిడేలా ఉంటాయి. చాలా తేలికగా కూడా ఉంటాయి. గంటల తరబడి ఫోన్ మాట్లాడుకోవచ్చు. ఈ సెల్ ఫోన్ కాల్ (CellPhone Call) ఎప్పుడు చేశారు అనేది మీకు తెలుసా? అది ఎలా కనిపెట్టారో తెలుసా? ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానం కావాలంటే ఇప్పుడు ఇది చదివి తెలుసుకోవాల్సిందే..
ఏప్రిల్ 3 నాటికి 50 ఏళ్లు :
ఏప్రిల్ 3, 1973న, మార్టిన్ కూపర్ (Martin Cooper) అనే వ్యక్తి మాన్‌హట్టన్ వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతని చేతిలో ఒక సెల్‌ఫోన్ కనిపించింది. అప్పుడే అతను ఫస్ట్ ఫోన్ కాల్ చేశాడు. కాల్ చేసి హిస్టరీ క్రియేట్ చేశాడు. సరిగ్గా.. ఆ విప్లవ ఘట్టానికి నేటికి 50 ఏళ్లు. ఆనాటి నుంచి అర్ధ శతాబ్ద కాలం గడిచిపోయింది. మానవాళిలో సెల్ ఫోన్ అనేది ఒక నిత్యావసరంగా మారిపోయింది. ఫస్ట్ మొబైల్ ఫోన్ (Mobile Phone) నుంచి ఫస్ట్ కాల్ (First Phone Call) వెళ్లిన రోజు.. ఏప్రిల్ 3వ తేదీ నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1973, ఏప్రిల్ 3న బెల్ ల్యాబ్స్ నుంచి ఫస్ట్ ఫోన్ కాల్ వెళ్లింది.
ఈ ఫస్ట్ ఫోన్ కాల్ మార్టిన్ కూపర్ (Martin Cooper) అనే మోటారోలా కంపెనీ ఉద్యోగి చేయడం జరిగింది. న్యూయార్క్ సిటీలో 54వ స్ట్రీట్ బెల్ టెలిఫోన్ కంపెనీ అయిన 6వ అవెన్యూలో వైర్‌లెస్ ఫోన్‌తో ఫస్ట్ కాల్ చేశాడు. అప్పుడు, న్యూజెర్సీలో బెల్ ల్యాబ్స్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూపర్ కాల్ చేసి మాట్లాడారు. బెల్ ల్యాబ్‌లో (ఏటీ అండ్ టీఎస్)లో పనిచేసే పోటీదారుడు అయిన జోయెల్ ఎంజెల్ ( Dr. Joel Engel)కు ఫస్ట్ ఫోన్ కాల్ చేశాడు. ‘నేను, ‘హాయ్ జోయెల్, మార్టీ కూపర్’ అని చెప్పారు. ‘హాయ్ మార్టీ,’ అని జోయెల్ చెప్పారు. ఆపై ఎంజెల్‌తో.. ‘నేను మీకు సెల్ ఫోన్ నుంచి కాల్ చేస్తున్నాను’ అని అన్నారు. అలా ఇద్దరి మధ్య ఫస్ట్ సెల్ ఫోన్ సంభాషణ కొనసాగింది.
అందులో, 21/2 పౌండ్ ప్రొటోటైప్ చెవి దగ్గర పెట్టుకునేలా మోటారోలా టీమ్ (Motorola Team) ఫంక్షనల్ పొర్టబుల్ ఫోన్ చేయడం జరిగిందని చెప్పాడు. 2015లోనూ బ్లూమ్ బెర్గ్ కూపర్ రెండోసారి ఫోన్ కాల్ చేశారు. అది, ప్రొటోటైప్ DynaTAC (డైనమిక్ అడాప్టీవ్ టోటల్ ఏరియా కవరేజ్) 8000x ద్వారా ఫస్ట్ వైర్‌లెస్ సెల్ ఫోన్ కాల్ చేశారు. అప్పటినుంచి కమర్షియల్ తొలి ఫోన్ కూడా అదే కావడం విశేషంగా చెప్పవచ్చు. 1973లో కాల్ చేసినప్పటికీ.. ఫస్ట్ కమర్షియల్ సెల్ ఫోన్ మోడల్ 1983 వరకు విక్రయించలేదు.

First Cell Phone Call (Photo : Google)
DynaTAC 8000X అనేది కూపర్ ఉపయోగించిన ప్రోటోటైప్ కన్నా ఎక్కువ బటన్‌లు, అద్భుతమైన డిజైన్ కలిగి ఉంది. చూడటానికి ఒక ఇటుక పరిమాణంలో ఉండేది. అప్పట్లో ఆ ఫోన్ ధర 4వేల డాలర్లుగా ఉంది. అప్పుడు దాని బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు 10 గంటలు పట్టింది. ఇది, ఇప్పటికీ టెలికమ్యూనికేషన్స్ ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మార్చిన ఫోన్ అని చెప్పవచ్చు. వాల్ స్ట్రీట్ (1987) వంటి మూవీల్లో కనిపించడం ద్వారా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. మైఖేల్ డగ్లస్ ఎక్కడి నుంచైనా ఫోన్ కాల్స్ చేయడానికి ఉపయోగించారు.
సెల్‌ఫోన్ సైజు, బరువు ఎంతంటే? :
1973 సంవత్సరంలో కనిపెట్టిన సెల్‌ఫోన్ దాదాపు 1.1కిలోల బరువు ఉంది. అంతేకాదు.. 22.86 సెంటీమీటర్ల పొడువు కూడా ఉండేది. చూడటానికి సైజు 12.7సెం.మీ పరిమాణం ఉండేది. ఇక, 4.44 సెంటీమీటర్లు వెడల్పు ఉండేది. రేడియో టెలిగ్రాఫ్ సిస్టమ్ ద్వారా 1973 నుంచి 1993 మధ్య కాలంలో మోటారోలా (Motorola) కంపెనీ 100 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టింది. ఆ తర్వాత 1980 సంవత్సరంలో పర్సనల్ సెల్యూలర్ ఫోన్లకు సంబంధించి ప్రమోషన్ వీడియోలను విడుదల చేసిందనే విషయాన్ని EDN నెట్‌వర్క్ తెలిపింది.
నివేదిక ప్రకారం.. AMPS అభివృద్ధికి 15ఏళ్ల టైమ్ పట్టింది. ప్రొటోటైప్ నెట్‌వర్క్ ఆధారంగా చేసిన తొలి కమర్షియల్ నెట్‌వర్క్ మొబైల్ కాల్.. దశాబ్దం తర్వాత AMPS ప్రారంభమైంది. ఆరోజు నుంచి దీర్ఘకాలంగా టెక్నికల్‌గా సాఫ్ట్‌వేర్, హార్డ్ వేర్, రేడియో ప్రీక్వెన్సీ సమస్యలను పరిష్కరిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం సరికొత్త టెక్నాలజీ డెవలప్ కావడంతో ఎప్పటికప్పుడూ గ్లోబల్ మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి.
Read Also : Cell Phone 50 Years : వస్తువుగా వచ్చి.. నిత్యావసరంగా మారిన మొబైల్ ఫోన్