Huawei Mate XT : ప్రపంచంలోనే ఫస్ట్ ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్.. హువావే మేట్ XT మడతబెట్టే ఫోన్.. ధర ఎంతో తెలుసా?

Huawei Mate XT : హువావే చివరకు ప్రపంచంలోని మొట్టమొదటి ట్రిపుల్-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ (Huawei Mate XT)ని లాంచ్ చేసింది. సెప్టెంబర్ 20న ఈ సేల్ ప్రారంభం కానుంది.

Huawei Mate XT : ప్రపంచంలోనే ఫస్ట్ ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్.. హువావే మేట్ XT మడతబెట్టే ఫోన్.. ధర ఎంతో తెలుసా?

First triple-fold smartphone in the world ( Image Source : Google )

Huawei Mate XT triple-fold smartphone : ఇప్పుడంతా ఫొల్డబుల్ ఫోన్ ట్రెండ్ నడుస్తోంది. సింగిల్ స్ర్కిన్ బోరుకొట్టేసి ఫోల్డబుల్ ఫోన్లపై ముచ్చటపడుతున్నారు వినియోగదారులు. మార్కెట్లోకి ఏదైనా ఫోల్డబుల్ ఫోన్ వచ్చిందంటే ఫీచర్ల గురించి తెగ ఆరా తీస్తుంటారు. గ్లోబల్ మార్కెట్లు సహా భారత్ మార్కెట్లో అనేక బ్రాండ్ల ఫోల్డబుల్ ఫోన్లు చాలానే వచ్చాయి.

కానీ, ప్రపంచంలోనే మొదటిసారిగా ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రపంచ మార్కెట్లోకి వచ్చేసింది.

Read Also : Apple iOS 18 Update : ఐఓఎస్ 18 అప్‌డేట్ డేట్ తెలిసిందోచ్.. ఏయే ఐఫోన్లలో సపోర్టు చేస్తుందంటే? ఫుల్ లిస్టు మీకోసం..

ఇంతకీ ఏ బ్రాండ్ తెలుసా? హువావే కంపెనీ.. హువావే చివరకు ప్రపంచంలోని మొట్టమొదటి ట్రిపుల్-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ (Huawei Mate XT)ని లాంచ్ చేసింది. హువావే మేట్ ఎక్స్‌టీ చైనాలో రిలీజ్ అయింది. ఈ ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ ధరలు ఊహించినంత ఎక్కువగా ఉన్నాయి.

చైనాలో, ట్రిపుల్ ఫోల్డ్ డివైజ్ ప్రారంభ ధర 19,999 యువాన్ (సుమారు రూ. 2,35,000). అదే ఫోల్డ్ ఓపెన్ చేస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 10.2-అంగుళాల టాబ్లెట్-సైజు స్క్రీన్‌గా మారుతుంది. ఐఫోన్ 16 సిరీస్ మాదిరిగానే సెప్టెంబర్ 20న ఈ సేల్ ప్రారంభం కానుంది. కానీ హువావే మేట్ XT చైనీస్ మార్కెట్‌కు మాత్రమే అందుబాటులో ఉంది.

హువావే మేట్ XT ధర, లభ్యత వివరాలివే :
కంపెనీ మొత్తం 3 స్టోరేజ్ వేరియంట్‌లను లాంచ్ చేసింది. అందులో అన్నీ 16జీబీ ర్యామ్ కలిగి ఉంటాయి. 256జీబీ స్టోరేజీతో కూడిన బేస్ మోడల్ 19,999 యువాన్లకు (సుమారు రూ. 2,35,000), 512జీబీ వేరియంట్ ధర 21,999 యువాన్లకు (సుమారు రూ. 2,59,000), 1టీబీ వేరియంట్ 23,999 యువాన్లకు (సుమారు 003,8) అందుబాటులో ఉంటుంది.

సెప్టెంబరు 20న చైనాలోని వినియోగదారుల కోసం ఈ సేల్ ప్రారంభం కానుంది. ట్రెండ్‌లను పరిశీలిస్తే.. ఈ ట్రిపుల్ ఫోన్ భారత మార్కెట్లో లేదా గ్లోబల్ మార్కెట్‌లో విడుదలయ్యే అవకాశం లేదు.

హువావే మేట్ XT స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
ప్రపంచంలోని మొట్టమొదటి డ్యూయల్ హింగ్డ్, ట్రిపుల్ ఫోన్ స్మార్ట్‌ఫోన్ ఫోల్డ్ ఓపెన్ చేసినప్పుడు ఓఎల్ఈడీ 6.4-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. కానీ, అది పూర్తిగా ఓపెన్ చేయగానే డిస్‌ప్లే 10.2-అంగుళాల (2,232 x 3,184)కి పెరుగుతుంది. చిన్న డిస్‌ప్లే 7.9-అంగుళాల కాన్ఫిగరేషన్‌లో పాక్షికంగా ఫోల్డ్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఉపయోగించవచ్చు.

అదే పూర్తిగా ఓపెన్ చేస్తే డివైజ్ టాబ్లెట్ మాదిరిగా 10.2-అంగుళాల స్క్రీన్‌గా మారుతుంది. ఈ సమయంలో, ఫుల్ ఓపెన్ ఫోల్డ్ డివైజ్ కేవలం 3.6ఎమ్ఎమ్ మందంగా ఉంటుంది. మార్కెట్‌లోని అత్యంత సన్నని ఫోన్‌లలో ఇదొకటిగా చెప్పవచ్చు.

హువావే కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో అల్ట్రా-టఫ్ లామినేటెడ్ స్ట్రక్చర్, నాన్-న్యూటోనియన్ ఫ్లూయిడ్ సహా కొన్ని అత్యాధునిక టెక్నాలజీని వినియోగించింది. ఈ ఫోన్ డ్యూయల్-హింజ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో కంప్రెషన్ లోపలి కీలు, టెన్షన్ నిరోధించే బయటి కీలు ఉంటాయి. సులభంగా ఫోల్డబుల్ చేసేలా డిస్‌ప్లే‌ను అనుమతిస్తుంది.

హువావే మేట్ ఎక్స్‌టీ అల్టిమేట్ ఎడిషన్‌కు సంబంధించి హువావే అధికారికంగా ప్రాసెసర్ వివరాలను వెల్లడించనప్పటికీ, కిరిన్ 9000ఎస్ చిప్ వేరియంట్‌తో అమర్చి ఉంటుందని అంచనా. అదే ఇంటర్నల్ ప్రాసెసర్ మేట్ 60ప్రో ప్లస్ ఫ్లాగ్‌షిప్‌కు పవర్ అందిస్తుంది.అదనంగా, ఈ ఫోన్ (HarmonyOS) 4.2లో రన్ అవుతుంది.

మేట్ ఎక్స్‌టీలోని కెమెరా సిస్టమ్ కూడా హై-ఎండ్‌గా ఉంది. 50ఎంపీ బ్యాక్ కెమెరా, 12ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 5.5ఎక్స్ ఆప్టికల్ జూమ్ సపోర్టుతో 12ఎంపీ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. పంచ్-హోల్ కటౌట్‌లో సెల్ఫీలకు 8ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

ఈ ఐఫోన్ 5,600mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో వస్తుందని కంపెనీ వెల్లడించింది. 66డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కంపెనీ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించిన ప్రపంచంలోనే అత్యంత సన్నని బ్యాటరీ ఇదే కావడం విశేషం.

Read Also : iPhone 16 Launch : A18 చిప్‌సెట్‌తో మోస్ట్ పవర్‌ఫుల్ ఐఫోన్ 16.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?