కిర్రాక్ 5జీ ఫోన్.. 47 శాతం ఆఫర్.. డిస్కౌంట్ అంటే ఇట్లుండాలి..
50MP ప్రైమరీ కెమెరాతో పాటు 12MP సూపర్ వైడ్ యాంగిల్ లెన్స్‌తో దీన్ని విడుదల చేశారు.

Flipkart Bachat Sale: అత్యద్భుత ఫీచర్లు ఉండే శాంసంగ్ గెలాక్సీ ఎస్23 5జీ 256GB మోడల్ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 5జీ (256 జీబీ, 8 జీబీ ర్యామ్) అసలు ధర రూ.79,999.
అయితే, డిస్కౌంట్ ఆఫర్లు, కొత్త మోడల్ విడుదలతో ఈ స్మార్ట్‌ఫోన్ ధర ప్రస్తుతం పడిపోయింది. ధర తగ్గాక కొనుగోలు చేద్దామని అనుకుంటున్న వారి కోసం ఫ్లిప్‌కార్ట్‌లో ఒక అద్భుతమైన అవకాశం ఉంది.
ఇప్పుడు ఈ ఫోన్‌ను దాదాపు రూ.50,000కే కొనుగోలు చేయవచ్చు. హై-ఎండ్ శాంసంగ్ ఫోన్ తమ వద్ద ఉంటే బాగుంటుందని బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. అయితే, అందుకు తగ్గ డబ్బు ఉండదు. అటువంటి వారు ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్‌ను వాడుకుని శాంసంగ్ గెలాక్సీ ఎస్23 5జీ 256GB మోడల్‌ను కొనుక్కోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 5జీని 47 శాతం ఆఫర్‌తో రూ.49,999కే అందిస్తున్నారు. అంతేకాదు, ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, ఉచిత ఈఎంఐ షిప్పింగ్ వంటి వాటిని కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది.
ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 5జీ 256GB మోడల్ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 Octa-Core ప్రాసెసర్‌ను వాడారు. ఈ స్మార్ట్‌ఫోన్ 6.1-అంగుళాల డైనమిక్ AMOLED 2X స్క్రీన్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది.
50MP ప్రైమరీ కెమెరాతో పాటు 12MP సూపర్ వైడ్ యాంగిల్ లెన్స్‌తో దీన్ని విడుదల చేశారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. S23 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 3900mAh బ్యాటరీ సామర్థ్యంతో ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది.