Flipkart Mobiles Bonanza Sale: స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు..!

ఆ మధ్య కరోనా మహమ్మారి దెబ్బకు ప్రజల ఆదాయం పడిపోగా.. వారి వస్తు కొనుగోళ్లు కూడా తగ్గాయి. అందుకే ఈ కామర్స్ సంస్థలు కూడా ఆ సమయంలో

Flipkart Mobiles Bonanza Sale: స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు..!

Flipkart Mobiles Bonanza Sale

Updated On : August 19, 2021 / 7:27 PM IST

Flipkart Mobiles Bonanza Sale: ఆ మధ్య కరోనా మహమ్మారి దెబ్బకు ప్రజల ఆదాయం పడిపోగా.. వారి వస్తు కొనుగోళ్లు కూడా తగ్గాయి. అందుకే ఈ కామర్స్ సంస్థలు కూడా ఆ సమయంలో పెద్దగా ఆఫర్లను అందించక ఉన్నంతలో సేల్స్ పెంచుకొనే పనిలో ఉన్నాయి. కానీ, ఇప్పుడు మహమ్మారి ప్రభావం తగ్గి మళ్ళీ యధావిధిగా ప్రజాజీవితం మొదలు కావడంతో మళ్ళీ ఈ కామర్స్ సైట్లు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఇప్పటికే తమ కస్టమర్లకోసం మొబైల్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు మరో ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కూడా భారీ ఆఫర్లతో మొబైల్స్‌ బోనాంజా సేల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. నేటితో ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్‌ మొబైల్‌ బొనాంజా సేల్స్‌ ఆగస్టు 23 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ సేల్స్‌లో పలు మొబైల్స్‌పై , మొబైల్‌ యాక్సేసరిస్‌పై ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్లను ప్రకటించింది. ఐఫోన్ పలు మోడల్స్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తున్న ఫ్లిప్‌కార్ట్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో లింకై ప్రీపెయిడ్ డిస్కౌంట్, ఈఎంఐ ఆఫర్‌లు కూడా అందిస్తుంది.

ఫ్లిప్ కార్ట్ మొబైల్‌ బొనాంజా సేల్స్‌లో అందిస్తున్న పలు ఆఫర్లను చూస్తే.. ఐఫోన్ 12 మినీ స్మార్ట్‌ఫోన్‌ రూ.59,999కు అందించనుండగా.. ఐఫోన్ ఎస్‌ఈ (2020) రూ.34,999, ఐఫోన్ 11 రూ.48,999, ఐఫోన్ ఎక్స్ ఆర్‌ రూ.41,999, ఐఫోన్ 11 ప్రో రూ.74,999కు అందిస్తుంది. ఇక, మోటో జీ60 రూ.16,999, పోకో ఎమ్‌3ను రూ.10,499, ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్‌ 5 రూ.6,999కు అందించనుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫోన్ కొనే ఉద్దేశ్యం ఉంటే ఈ రెండు ఈ కామర్స్ సైట్లలోకి వెళ్లి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనేసుకోండి.