Flipkart Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 15 ప్రోపై భారీ తగ్గింపు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

Flipkart Big Billion Days Sale : ఐఫోన్ 15 ప్రో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ. 99,999 ధర ట్యాగ్‌తో జాబితా అయింది. ఐఫోన్ 15 ప్రో 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర భారత మార్కెట్లో రూ. 1,34,999కి అందుబాటులో ఉంది.

Flipkart Big Billion Days Sale now live_ iPhone 15 Pro gets huge discount

Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మొదలైంది. ఈ ప్లాట్‌ఫారమ్ అనేక ఐఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 15 ప్లస్ మోడళ్లను తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. ఐఫోన్ 15 ప్రోపై ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ డీల్‌ను అందిస్తోంది. భారత మార్కెట్లో ఐఫోన్ 15 ధర రూ. 1,34,999కి ప్రకటించగా, ఇప్పుడు రూ. 1 లక్ష కన్నా తక్కువ ధరకు విక్రయిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. ఐఫోన్ 15 ప్రో భారీ తగ్గింపు :
ఐఫోన్ 15 ప్రో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ. 99,999 ధర ట్యాగ్‌తో జాబితా అయింది. ఐఫోన్ 15 ప్రో 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర భారత మార్కెట్లో రూ. 1,34,999కి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఎలాంటి షరతులు లేకుండా రూ. 35వేల తగ్గింపును అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. తద్వారా ఈ ఐఫోన్ 15 ధర రూ.94,999కి తగ్గుతుంది.

Read Also : Amazon Festival Sale : అమెజాన్ ప్రైమ్ సేల్ మొదలైందోచ్.. ఈ ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇంకా తక్కుద ధరకే పొందాలంటే?

ఈ ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ ముగిసిన తర్వాత, ఐఫోన్ 15 ప్రో మళ్లీ రూ.లక్షకు పైగా విక్రయించే అవకాశం ఉందని గమనించడం ముఖ్యం. ఈ ఐఫోన్ 15 డీల్ ఎప్పుడు ముగుస్తుందో ప్రస్తుతం తెలియదు. ఫ్లిప్‌కార్ట్ ట్రాక్ రికార్డ్‌ను పరిశీలిస్తే.. ఇ-కామర్స్ దిగ్గజం పరిమిత కాల వ్యవధిలో బెస్ట్ డిస్కౌంట్ డీల్స్ అందించింది. ఐఫోన్ 15 ప్రో ఆఫర్‌ను తొలగించాలనే అవకాశాలు కూడా ఉన్నాయి. వినియోగదారులు మరింత తగ్గింపును పొందడానికి ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను వినియోగించవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్‌లను ఎంచుకునే వినియోగదారులు క్యాషిఫైలో ఎక్స్ఛేంజ్ డీల్‌లను కూడా చెక్ చేయాలని సూచించారు.

ఐఫోన్ 15ప్రో : కీలక స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 15 ప్రో ఫింగర్ ఫ్రింట్ స్మడ్జ్‌లను తగ్గించే బ్రష్డ్ ఎఫెక్ట్‌తో తేలికపాటి, మన్నికైన టైటానియం ఛాసిస్‌ను కలిగి ఉంది. ఈ డివైజ్ అంచులు సున్నితంగా ఉంటాయి. మెటల్ గ్లాసు కలిసే చోట మరింత గుండ్రంగా ఉంటాయి. ఫోన్ దిగువన యూఎస్‌బీ-సి పోర్ట్‌ను కూడా చూడవచ్చు. ఆపిల్ రెగ్యులర్ ప్రో వెర్షన్‌లో 6.1-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. 120Hz ప్రోమోషన్ టెక్నాలజీకి సపోర్టుతో సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లే ఫీచర్‌కు సపోర్టు ఇస్తుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు కూడా సపోర్టు అందిస్తుంది.

లేటెస్ట్ iOS 18 సాఫ్ట్‌వేర్‌ను కూడా వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎ17 ప్రో చిప్ ద్వారా రన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ రంగంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుందని ఆపిల్ చెబుతోంది. హై-ఎండ్ పీసీలకు కూడా పోటీదారుగా నిలుస్తుంది. జీపీయూతో ఐఫోన్ 15ప్రోలో ఆకర్షణీయమైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. లేటెస్ట్ ఐఫోన్ 15ప్రో స్మార్ట్‌ఫోన్ బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం వంటి ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో వస్తుంది.

ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌లోని కెమెరా సిస్టమ్ మీ జేబులోని 7 కెమెరా లెన్స్‌లకు సమానం” అని ఆపిల్ పేర్కొంది. ఐఫోన్ 15 ప్రో మోడల్ 48ఎంపీ కెమెరాతో తక్కువ-కాంతిలోనూ లెన్స్ ఫ్లేర్-ఫ్రీ ఫొటోలను తీయగలదు. వినియోగదారులు ఫోకల్ లెంగ్త్‌ల (24 మిమీ, 28 మిమీ, 35 మిమీ) మధ్య మారవచ్చు. 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌ను పొందవచ్చు. యూఎస్‌బీ-సి పోర్ట్ ద్వారా 4కె60 ప్రోరేస్ వీడియో రికార్డింగ్, డైరెక్ట్ ఎక్స్‌టర్నల్ డ్రైవ్ కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. ఐఫోన్ 15 ప్రో ప్రస్తుతం మార్కెట్‌లోని బెస్ట్ ఫోన్‌లలో ఒకటిగా చెప్పవచ్చు.

Read Also : UPI Payments : గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎంతో UPI పేమెంట్స్ చేస్తున్నారా? ఈ 5 సేఫ్టీ టిప్స్ తప్పక పాటించండి..!