Flipkart Buy Buy Sale 2025 : ఫ్లిప్‌కార్ట్ బైబై సేల్ ఆఫర్లు.. శాంసంగ్, ఐఫోన్, పిక్సెల్ ఫోన్లపై కిర్రాక్ డిస్కౌంట్లు.. ఏ ఫోన్ కొంటారో కొనేసుకోండి..!

Flipkart Buy Buy Sale 2025 : ఫ్లిప్‌కార్ట్ బై బై సేల్ 2025 సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, ఐఫోన్ 16, పిక్సెల్ 9 ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. ఈ అదిరిపోయే డీల్స్ ఎలా పొందాలంటే?

Flipkart Buy Buy Sale 2025 : ఫ్లిప్‌కార్ట్ బైబై సేల్ ఆఫర్లు.. శాంసంగ్, ఐఫోన్, పిక్సెల్ ఫోన్లపై కిర్రాక్ డిస్కౌంట్లు.. ఏ ఫోన్ కొంటారో కొనేసుకోండి..!

Flipkart Buy Buy Sale 2025

Updated On : December 5, 2025 / 4:31 PM IST

Flipkart Buy Buy Sale 2025 : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ మిస్ అయ్యారా? డోంట్ వర్రీ.. ఫ్లిప్‌కార్ట్ బై బై సేల్ 2025 మొదలైంది. ఈ ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ ఫోన్లపై అద్భుతమైన భారీ డీల్స్ అందిస్తోంది. మీరు శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, ఐఫోన్ 16, పిక్సెల్ 9 మరిన్నింటిపై భారీగా డబ్బులు ఆదా చేసుకోవచ్చు.

బ్యాంక్ కార్డులతో ఈ ఫోన్లపై అద్భుతమైన (Flipkart Buy Buy Sale 2025) డిస్కౌంట్లను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బై బై సేల్ 2025 సమయంలో అందించే ఈ స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్ డీల్స్ ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి..

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ధర :
2025 బైబై సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ ధర రూ. 40వేలు భారీ తగ్గింపుతో రూ. 78,999 వద్ద లిస్ట్ అయింది. అదనంగా, కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ. 4వేల వరకు సేవ్ చేసుకోవచ్చు. దాంతో ఈ అల్ట్రా ఫోన్ అసలు ధర నుంచి రూ. 75వేల కన్నా తక్కువకే లభిస్తుంది. కస్టమర్లు తమ పాత ఫోన్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఎంచుకోవచ్చు. అయితే, కచ్చితమైన వాల్యూ, వర్కింగ్ కండిషన్లు, బ్రాండ్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

Read Also : Samsung Galaxy Z Flip 6 : ఆఫర్ అదిరింది భయ్యా.. ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ అతి తక్కువ ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ధర తగ్గింపు :
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఐఫోన్ 16 రూ.7వేలు ధర తగ్గింపుతో రూ.62,999కి అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో బ్యాంక్ ఆఫర్లతో రూ.60వేల కన్నా తక్కువ ధరకు పొందవచ్చు. పాత ఫోన్ ట్రేడింగ్ చేయడం ద్వారా కొనుగోలుదారులు రూ.59,550 వరకు ఎక్స్చేంజ్ వాల్యూను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ నెలకు రూ.2,215 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది. అయితే, మీరు హిడెన్ ఛార్జీలను చెల్లించాల్సి రావచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 9 ధర తగ్గింపు :
మీరు పిక్సెల్ ఫ్యాన్ అయితే ఇది మీకోసమే. లాస్ట్ జనరేషన్ గూగుల్ పిక్సెల్ 9 కూడా ఫ్లిప్‌కార్ట్‌లో బై బై సేల్ 2025 సమయంలో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ పిక్సెల్ 9 ఫోన్ రూ.54,999కి లిస్ట్ అయింది. పైన పేర్కొన్న డీల్స్ మాదిరిగానే కస్టమర్లు కొన్ని బ్యాంకు కార్డులతో రూ.4వేలు తగ్గింపు పొందవచ్చు.

తద్వారా ధర దాదాపు రూ.50వేల వరకు తగ్గుతుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ధర తగ్గింపు కోసం పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్, గూగుల్ పిక్సెల్ 9 ప్రో సిరీస్ ఇతర ఫోన్లు కూడా అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.