Samsung Galaxy Z Flip 6 : ఆఫర్ అదిరింది భయ్యా.. ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ అతి తక్కువ ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

Samsung Galaxy Z Flip 6 : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ బైబై 2025 సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 ధర భారీగా తగ్గింది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy Z Flip 6 : ఆఫర్ అదిరింది భయ్యా.. ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ అతి తక్కువ ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

Samsung Galaxy Z Flip 6

Updated On : December 5, 2025 / 3:59 PM IST

Samsung Galaxy Z Flip 6 : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ బైబై 2025 సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ సమయంలో అనేక స్మార్ట్‌ఫోన్‌లతో సహా వివిధ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అద్భుతమైన ఆఫర్‌లలో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6పై కూడా ఊహించని డిస్కౌంట్ అందిస్తోంది.

ప్రస్తుత ఆఫర్‌తో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6పై రూ.24వేల వరకు (Samsung Galaxy Z Flip 6) సేవ్ చేసుకోవచ్చు. మీరు ఈ శాంసంగ్ ఫోన్‌ తక్కువ ధరకు పొందవచ్చు. ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ డీల్ అసలు వదులుకోవద్దు. ఇలాంటి ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండవు. మీకు ఆసక్తి ఉంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. ఇంతకీ ఈ శాంసంగ్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 ఫ్లిప్‌కార్ట్ డీల్ :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 ఫోన్ రూ.1,09,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్ బైబై 2025 సేల్ సందర్భంగా గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6పై రూ.20వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతేకాదు..ఫ్లిప్‌కార్ట్ యాక్సస్/ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.4వేలు అదనపు డిస్కౌంట్‌ పొందవచ్చు. మరింత ఆదా కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ట్రేడ్ చేయవచ్చు.

Read Also : Cloudflare Outage : ట్రేడర్లకు బిగ్ షాక్.. క్లౌడ్‌ఫ్లేర్ మళ్లీ క్రాష్.. Groww, Zerodha ప్లాట్‌ఫారమ్స్ డౌన్.. గగ్గోలు పెడుతున్న జనం..!

శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 ఫోన్ 6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X మెయిన్ డిస్‌ప్లే, FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఔటర్ డిస్‌ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌తో 3.4-అంగుళాల సూపర్ అమోల్డ్ స్క్రీన్‌తో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 4,000mAh బ్యాటరీతో వస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10MP కెమెరా కలిగి ఉంది. అలాగే, శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 ఫోన్ ఆటో జూమ్ వంటి ఏఐ ఆధారిత ఫీచర్లతో వస్తుంది. బెస్ట్ షాట్‌ను ఫ్రేమ్‌ను ఆటోమాటిక్‌గా అడ్జెస్ట్ చేస్తుంది.