Cloudflare Outage : ట్రేడర్లకు బిగ్ షాక్.. క్లౌడ్‌ఫ్లేర్ మళ్లీ క్రాష్.. Groww, Zerodha ప్లాట్‌ఫారమ్స్ డౌన్.. గగ్గోలు పెడుతున్న జనం..!

Cloudflare Outage : జెరోధా, గ్రోలను ఉపయోగించే పెట్టుబడిదారులు భారీ అంతరాయాలను ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లు వెబ్‌సైట్‌లు, మొబైల్ యాప్‌లు పనిచేయడం లేదని వాపోతున్నారు..

Cloudflare Outage : ట్రేడర్లకు బిగ్ షాక్.. క్లౌడ్‌ఫ్లేర్ మళ్లీ క్రాష్.. Groww, Zerodha ప్లాట్‌ఫారమ్స్ డౌన్.. గగ్గోలు పెడుతున్న జనం..!

Cloudflare Outage

Updated On : December 5, 2025 / 3:39 PM IST

Cloudflare Outage : క్లౌడ్‌ఫ్లేర్ మళ్లీ క్రాష్ అయింది. క్లౌడ్‌ఫ్లేర్ సర్వర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. డిసెంబర్ 5న క్లౌడ్ ఫ్లేర్ సర్వీసులు స్తంభించిపోవడంతో ట్రేడర్లు, ఇన్వెస్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆన్‌లైన్ సర్వీసులు నిలిచిపోయాయి.

ప్రత్యేకించి ట్రేడింగ్‌కు సంబంధించిన Groww, Upstock, Zeroda వంటి బ్రోకింగ్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాయి. సర్వీస్ మానిటరింగ్ ప్లాట్‌ఫారమ్ DownDetector సర్వీసులు కూడా నిలిచిపోయాయి.

క్లౌడ్‌ఫ్లేర్ సర్వర్లు పనిచేయకపోవడంతోనే (Cloudflare Outage) ఈ సాంకేతిక సమస్య తలెత్తినట్టు భావిస్తున్నారు. కొద్ది నిమిషాల్లోనే లక్షల మంది వినియోగదారులకు ఈ ట్రేడింగ్ సర్వీసులను యాక్సస్ కోల్పోయారు. ప్రధానంగా ఈ అంతరాయం క్లౌడ్‌ఫ్లేర్‌పై ఆధారపడిన API, బ్యాకెండ్ సర్వర్‌లు పనిచేయకపోవడం వల్లనే ఏర్పడిందని చెబుతున్నారు.

యాప్‌లు, సర్వర్‌ల మధ్య కనెక్షన్లు డౌన్ కావడంతో యూజర్లు లాగిన్ అవ్వడం, ట్రేడింగ్ ఆర్డర్‌లు పెట్టడం, లైవ్ మార్కెట్ డేటా చూడడం వంటివి మధ్యలోనే ఆగిపోయాయి. చాలా మంది ట్రేడర్లు తమ మొబైల్, వెబ్ యాప్‌లలో Server Error, Unable to Connect వంటి మెసేజ్‌లు కనిపిస్తున్నాయి.

Read Also : iPhone 15 Plus : ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన డిస్కౌంట్.. భారీగా తగ్గిన ఐఫోన్ 15 ప్లస్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి..!

దేశంలోని అతిపెద్ద రిటైల్ బ్రోకరేజ్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన జెరోధా.. తమ టెక్నికల్ టీమ్ వీలైనంత త్వరగా సర్వీసులను రీస్టోర్ చేసేందుకు కృషి చేస్తోందని పేర్కొంటూ ఈ సమస్యను ధృవీకరించింది. ప్రముఖ పెట్టుబడి, మ్యూచువల్ ఫండ్ ప్లాట్‌ఫామ్ గ్రోవ్ కూడా అంతరాయాన్ని అంగీకరించింది. ప్రస్తుత అంతరాయ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని వినియోగదారులకు తెలిపింది.

క్లౌడ్‌ఫ్లేర్‌లో క్రాస్-ప్లాట్‌ఫామ్ డౌన్‌టైమ్ కారణంగా కైట్ ప్రస్తుతం అందుబాటులో లేదు. మీ ట్రేడ్‌ల కోసం దయచేసి కైట్ వాట్సాప్ బ్యాకప్‌ను ఉపయోగించాలని జెరోధా ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.

“క్లౌడ్‌ఫ్లేర్‌లో ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కారణంగా ప్రస్తుతం సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా మల్టీ యాప్‌లు, సర్వీసులను ప్రభావితం చేస్తోంది. మేం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. సర్వీసులను పునరుద్ధరించిన వెంటనే మీకు తెలియజేస్తాం’’ అని గ్రోవ్ ఎక్స్ వేదికగా పేర్కొంది.

ఇటీవలి నెలల్లో ఇది రెండో అతిపెద్ద క్లౌడ్‌ఫ్లేర్ అంతరాయం. గత నెలలో ఇలాంటి టెక్నికల్ లోపం కారణంగా భారీ మొత్తంలో సర్వీసులకు అంతరాయం కలిగింది. X, ChatGPT, Letterboxd, Downdetector వంటి ప్లాట్‌ఫారమ్‌లను తాత్కాలికంగా ప్రభావితం చేసింది. అనేక ఆన్‌లైన్ సర్వీసులను ప్రభావితం చేసింది.

సోషల్ మీడియా వేదికగా అనేక మంది యూజర్లు తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. క్లౌడ్‌వేర్ అంతరాయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది యూజర్లు తమ సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.