ఫ్లిప్ కార్ట్‌లో మొబైల్ బొనాంజ: భారీ ఆఫర్లు ఉన్న ఫోన్లు ఇవే

  • Published By: vamsi ,Published On : February 17, 2020 / 10:39 AM IST
ఫ్లిప్ కార్ట్‌లో మొబైల్ బొనాంజ: భారీ ఆఫర్లు ఉన్న ఫోన్లు ఇవే

Updated On : February 17, 2020 / 10:39 AM IST

శివరాత్రికి ముందే కిక్ ఇచ్చే సేల్‌ను తీసుకుని వచ్చింది ఆన్‌లైన్ ఈ కామర్స్ దిగ్గచజం ఫ్లిప్ కార్ట్. గాడ్జెట్ ప్రియల కోసం ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తేదీ వరకు బిగ్ బొనాంజాను ప్రకటించింది. ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ లో అద్భుతమైన ఆఫర్లను హైలైట్ చేయడానికి ఒక ప్రత్యేకమైన కాంపెయిన్‌ను ప్రారంభించింది.

ఈకామర్స్ ద్వారా  పోర్టల్లో కొనుగోలు చేసేవారికి, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్‌ను ఉపయోగించే వినియోగదారులకు 10 శాతం తగ్గింపును ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.  ఈ మేరకు ఇప్పటికే  సేల్‌ను ప్రారంభించింది సంస్థ. ఈ సేల్‌‌లో, ఫ్లాగ్‌ షిప్, మిడ్ రేంజ్, బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఫ్లిప్‌ కార్ట్ ప్రకటించింది. యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే అన్ని లావాదేవీలకు అదనంగా 10 శాతం డిస్కౌంట్‌‌ను ఇస్తోంది.

ఈ సేల్‌‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ స్మార్ట్‌ ఫోన్లు రూ.22,999కు, రూ.27,999కు అందుబాటులోకి వస్తాయి. రూ.89,999కు లాంచ్ అయిన ఐఫోన్ 10ఎక్స్ ఎస్ ను రూ.54,999కే కొనుగోలు చేయొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్ కూడా ఇందులో ఉంది. 

ఇందులో ఉత్తమమైన ఫోన్ ఆఫర్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 50 (4జీబీ, 64జీబీ)కి ఇచ్చారు. దీనిని రూ. 12వేల 999కి అందుబాటులో ఉంచారు. దీని అసలు ధర ఎంఆర్‌పీ రూ. 21,000, దానిని మొబైల్స్ బొనాంజాలో ఉంచారు. గెలాక్సీ ఎ 50లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉన్నాయి. మీరు పాత స్మార్ట్‌ఫోన్ నుండి అప్‌గ్రేడ్ చేయాలని చూస్తున్నట్లయితే, ఫ్లిప్‌కార్ట్ 12,950 రూపాయల వరకు ఎక్స్‌చేంజ్ దక్కనుంది. 

అంతేకాదు.. ఆపిల్‌, శాంసంగ్‌, వివో, రియల్‌మీ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపుధరలను అందుబాటులో ఉంచనుంది. ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్, మిడ్-రేంజ్, బడ్జెట్ ఇలా స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపుల ధరలను ప్రకటించింది.