ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఉన్న “SASA LELE” సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు లేదా ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసే వారికి ఇన్‌స్టాంట్‌గా 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశమని చెప్పవచ్చు. ఈ సేల్‌లో భాగంగా టాప్ స్మార్ట్‌ఫోన్‌లపై లభిస్తున్న డిస్కౌంట్‌ల వివరాలను తెలుసుకోండి.
Also Read: వివో V50e రివ్యూ.. అద్భుతమైన ఫీచర్లు ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ఎవరెవరికి నచ్చుతుందంటే?
Google Pixel 8aపై ఆఫర్
Google Pixel 8a (8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్)పై ఈ సేల్‌లో రూ.37,999కే లభిస్తోంది. దీనికి అదనంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.5,250 ఇన్‌స్టాంట్ తగ్గింపు లభిస్తుంది. దీంతో, ఈ ఫోన్‌ను రూ.32,749కే కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా, మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకుంటే అదనంగా రూ.23,600 వరకు తగ్గింపు పొందే అవకాశం కూడా ఉంది.
Apple iPhone 13పై ఆఫర్
Apple iPhone 13 (128GB స్టోరేజ్) ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రూ.44,999కి అందుబాటులో ఉంది. ప్రత్యేక డీల్ కింద అదనంగా రూ.2,000 తగ్గింపు కూడా లభిస్తుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో చెల్లింపు చేస్తే మరో రూ.1,500 తగ్గింపుతో, ఈ ఫోన్‌ను రూ.43,499కు కొనొచ్చు. ఒకవేళ మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే రూ.24,050 వరకు అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు.
Vivo T4 5Gపై తగ్గింపు
Vivo T4 5G స్మార్ట్‌ఫోన్ (8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్)ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.21,999 ధరకు లిస్ట్ చేశారు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో కొనుగోలు చేయడం ద్వారా రూ.2,000 ఇన్‌స్టాంగ్ తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ ధర రూ.19,999 అవుతుంది. పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకుంటే ఫోన్‌పై రూ.13,500 వరకు తగ్గింపు పొందే అవకాశం కూడా ఉంది.
ఈ ఫ్లిప్‌కార్ట్ “SASA LELE” సేల్‌లో లభిస్తున్న అద్భుతమైన ఆఫర్లను ఉపయోగించుకుని, మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోండి!