వివో V50e రివ్యూ.. అద్భుతమైన ఫీచర్లు ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎవరెవరికి నచ్చుతుందంటే?

వివో V50e పెర్ల్ వైట్ వెర్షన్ చాలా స్టైలిష్‌గా ఉంది.

వివో V50e రివ్యూ.. అద్భుతమైన ఫీచర్లు ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎవరెవరికి నచ్చుతుందంటే?

Updated On : May 3, 2025 / 3:45 PM IST

వివో V సిరీస్ స్మార్ట్‌ఫోన్లను చాలా మంది వాటిలోని కెమెరా ఫీచర్ల కోసం కొంటుంటారు. ధర కూడా మరీ ఎక్కువగా లేదు. దీంతో వివో V సిరీస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఆకర్షిస్తోంది.

వివో V50 జైస్ ట్యూన్డ్ కెమెరా ఉండి కూడా తక్కువ ధరకు వచ్చే ఫోన్‌లలో ఒకటి. మంచి క్వాలిటీతో ఫొటోలు తీసుకోవచ్చు. వివో ఇటువంటి కెమెరా ఫీచర్లపైనే దృష్టి సారించి తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ వివో V50eని విడుదల చేసింది.

వివో V50e మోడల్‌ కూడా వివో V50 లాగే ఉంది. V50 కంటే V50e ధర తక్కువ. రూ.30 వేలలోపు బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్‌ కొనుక్కోవాలని భావిస్తున్న వారు వివో V50e కొనుక్కోవచ్చు.

ఈ ఫోన్‌ వృత్తాకార కెమెరా సెటప్, రింగ్ లైట్‌తో ప్రత్యేకమైన డిజైన్‌తో వచ్చింది. వివో నుంచి గతంలో వచ్చిన స్మార్ట్‌ఫోన్లు కూడా రూ.30 వేలలోపు ధరతోనే వచ్చాయి. అయితే, అదే ధరలో ఆయా ఫోన్‌ల కంటే బిల్డ్ క్వాలిటీ మెరుగ్గా ఉంది. డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌కు IP68/69 రేటింగ్ కూడా ఉంది.

Also Read: శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 లాంచ్‌ డేట్‌ లీక్‌.. ఫీచర్లు ఎంత బాగున్నాయంటే? 

తక్కువ ధరలో అత్యుత్తమ డిస్‌ప్లే
వివో V50e పెర్ల్ వైట్ వెర్షన్ చాలా స్టైలిష్‌గా ఉంది. రూ.30,000 కంటే తక్కువ ధరలో లభ్యమవుతున్న ఫోన్లలో అత్యుత్తమ డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్లలో Vivo V50e ఒకటి. ఇందులో 6.77-అంగుళాల FHD+ OLED స్క్రీన్‌ ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రోలింగ్, యానిమేషన్‌లను చాలా వేగంగా రన్‌ చేస్తుంది.

క్వాడ్ కర్వ్డ్ స్క్రీన్ ఉండడంతో OnePlus 13 వంటి ఖరీదైన ఫోన్‌లలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ కూడా ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. మీడియం గ్రాఫిక్స్ సెట్టింగ్‌లలో PUBG వంటి గేమ్‌లను ఆడుకోవడానికి vivo V50e అనువుగా ఉంటుంది.

ఈ ఫోన్‌లో హై క్వాలిటీ డిస్‌ప్లే ఉండడంతో వీడియోలను బాగా చూసేవారికి ఈ స్మార్ట్‌ఫోన్‌ బాగా నచ్చుతుంది. మొత్తంమీద ఈ స్మార్ట్‌ఫోన్‌ కెమెరా ఆకట్టుకుంటుంది. హై క్వాలిటీ ఫొటోలు, వీడియోలు తీసుకోవాలనుకునేవారు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవచ్చు.