Flipkart Year End Sale 2023 : ఈ స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు.. డిసెంబర్ 16 వరకు మాత్రమే ఛాన్స్..!

Flipkart Year End Sale 2023 : ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2023 ఈ నెల 16 (డిసెంబర్)వ తేదీతో ముగియనుంది. ఆపిల్ ఐఫోన్ నుంచి శాంసంగ్, మోటోరోలా, గూగుల్ పిక్సెల్ వంటి అనేక ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

Flipkart Year End Sale 2023 : ఈ స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు.. డిసెంబర్ 16 వరకు మాత్రమే ఛాన్స్..!

Flipkart Year End Sale 2023 Ending On December 16

Flipkart Year End Sale 2023 : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. అతి తక్కువ ధరలో మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్లను సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ డిసెంబర్ 16తో ముగియనుంది. ఆసక్తిగల వినియోగదారులు అనేక స్మార్ట్‌ఫోన్లపై టాప్ డీల్స్ పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పిఎన్‌బి కార్డ్‌లను కలిగిన కస్టమర్‌లు అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. ఎందుకంటే.. ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2023 సమయంలో స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : Google Messages Spam : ఆన్‌లైన్ మోసాలకు గూగుల్ మెసేజెస్ ఫీచర్‌తో చెక్ పెట్టొచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?

ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ డిసెంబర్ 9వ తేదీన ఇయర్ ఎండ్ సేల్ ప్రారంభించగా.. డిసెంబర్ 16 వరకు కొనసాగుతుంది. ఆపిల్ ఐఫోన్ 14, రెడ్‌మి 12, శాంసంగ్ గెలాక్సీ ఎస్22, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, మోటరోలా ఎడ్జ్ 40, పోకో సీ51, గూగుల్ పిక్సెల్ 7ఏ, నథింగ్ ఫోన్ (2) వంటి ప్రముఖ మోడల్‌లతో సహా విస్తృత శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్‌లు, ఆఫర్‌లు, మరెన్నో డీల్‌లను అందిస్తుంది.

కార్డ్ హోల్డర్లకు ప్రత్యేకమైన డిస్కౌంట్లు :
ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2023లో స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌‌స్టంట్ డిస్కౌంట్ పొందగలిగేలా బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, పిఎన్‌బి కార్డ్‌లను కలిగిన కస్టమర్‌లు అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.

ఇయర్ ఎండ్ సేల్ కీలక తేదీలు :
డిసెంబర్ 9న ప్రారంభమైన ఈ సేల్ కస్టమర్‌లను అనేక ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందిస్తోంది. శనివారం, డిసెంబర్ 16, 2023న ముగుస్తుంది.

టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ :
ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా వివిధ స్మార్ట్‌ఫోన్‌లపై గణనీయమైన తగ్గింపులను అందిస్తోంది. టెక్ ఔత్సాహికుల కోసం తప్పనిసరిగా కొన్ని అద్భుతమైన డీల్‌లు ఉన్నాయి.

Flipkart Year End Sale 2023 Ending On December 16

Flipkart Year End Sale 2023 Ending

ఆపిల్ ఐఫోన్ 14 : ఈ ఐఫోన్ అసలు ధర రూ. 69,900 ఉండగా.. ఐఫోన్ 14 సేల్ సమయంలో రూ. 58,999 తగ్గింపు ధరతో లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు రూ. 500 అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. పాత హ్యాండ్‌సెట్‌లపై రూ. 34,500 వరకు తగ్గింపును అందించే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 : ఈ ఫోన్ అసలు ధర రూ. 1,54,999 ఉండగా.. ఇప్పుడు రూ. 7వేల అమెజాన్ కూపన్‌ ద్వారా రూ. 1,48,999 వద్ద అందుబాటులో ఉంది. రూ. 44,500 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

గూగుల్ పిక్సెల్ 7ఎ : రూ. 43,999 ధరతో గూగుల్ పిక్సెల్ 7ఎ సంవత్సరాంతపు విక్రయ సమయంలో రూ. 37,999 తగ్గింపు ధరతో లభిస్తుంది. పీఎన్‌బీ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ. వెయ్యి అదనపు తగ్గింపును పొందవచ్చు.

రెడ్‌మి 12 : వాస్తవానికి రెడ్‌మి 12 రూ. 10,999 ఉండగా.. ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో రూ. 9,899 తగ్గింపు ధరతో లభిస్తుంది.

మోటోరోలా ఎడ్జ్ 40 : రూ. 29,999 వద్ద లాంచ్ అయిన మోటోరోలా ఎడ్జ్ 40, పీఎన్‌బీ కార్డ్‌లపై రూ. వెయ్యి తగ్గింపుతో సహా విక్రయ సమయంలో రూ. 25,499కి సొంతం చేసుకోవచ్చు.

Read Also : Supercomputer 2024 : ఏఐ మనుషుల కంటే తెలివైనదా? 2024లో మానవ మెదడు సామర్థ్యానికి సరిపోయే సూపర్ కంప్యూటర్ వస్తోంది..!