జీమెయిల్ సర్వీసులో ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్స్ ను యాడ్ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. జీమెయిల్ వాడకంపై కూడా కొన్ని ట్రిక్స్ ను గూగుల్ అందిస్తోంది.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ అందించే అద్భుతమైన సర్వీసుల్లో జీమెయిల్ ఒకటి. ఏదైనా డేటా షేర్ చేయాలన్నా ఎక్కువగా జీమెయిల్ వాడుతూ ఉంటారు. 2004లో ప్రవేశపెట్టిన ఈ సర్వీసుకు ప్రపంచవ్యాప్తంగా 1.2బిలియన్ల యూజర్లు ఉన్నారు. గూగుల్ దిగ్గజం.. జీమెయిల్ సర్వీసులో ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్స్ ను యాడ్ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. జీమెయిల్ వాడకంపై కూడా కొన్ని ట్రిక్స్ ను గూగుల్ అందిస్తోంది. 2019లో కూడా జీమెయిల్ యూజర్ల కోసం గూగుల్ మూడు కొత్త ఫీచర్లను త్వరలో అందించనుంది. ఈ మూడు కొత్త ఫీచర్ల సాయంతో జీమెయిల్ ను మరింత సులభంగా యూజర్లు వినియోగించుకోవచ్చు. అంతేకాదు.. యూజర్లు మెయిల్ పంపే సమయంలో మిస్టేక్ లను సరిచేయొచ్చు. అలాగే కంపోజ్ చేసిన మెయిల్ టెక్స్ట్ ను ఎడిట్ చేయొచ్చు.
ఇందులో రెండు ఫీచర్లు మెయిల్ షార్ట్ కట్ బటన్లు అన్ (డూ, రీడూ)గా పనిచేస్తాయి. మూడో ఫీచర్.. మెయిల్ నుంచి డిఫరెంట్ ఫార్మాట్ ల్లో మెసేజ్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మెయిల్ బాక్సులో షార్ట్ కట్ బటన్లు అన్ డూ, రీడూ ఆప్షన్లతో ఈజీగా కంపోజ్ చేయొచ్చు. కంపోజ్ చేస్తున్నప్పుడు పొరపాటున ఈ మెసేజ్ డిలీట్ అయినా మళ్లీ అన్ డూ బటన్ తో .. డిలీట్ అయిన మెసేజ్ ను తిరిగి పొందొచ్చు. డిలీట్ అయిన కంటెంట్ ఆటోమాటిక్ గా మెయిల్ డ్రాఫ్ట్ లో స్టోర్ అవుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రాఫ్ట్ నుంచి మెసేజ్ ను తిరిగి కంపోజ్ బాక్సులోకి ఇన్ సర్ట్ చేయొచ్చు. రీడూ బటన్ ఆప్షన్ కూడా కంపోజ్ బాక్సులో గూగుల్ యాడ్ చేయనుంది.